Ram Charan's Peddi Movie Glimpse Unvieled: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు (Buchibabu) దర్శకత్వంలో వస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ 'పెద్ది' (Peddi). ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను టీం తాజాగా రిలీజ్ చేసింది. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ వేరే లెవల్ అనిపించగా.. గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

ఉత్తరాంధ్ర స్లాంగ్‌లో..

నోట్లో బీడీ కాలుస్తూ.. ముక్కుకు రింగుతో గెడ్డంతో చరణ్ మాస్ లుక్ గూస్ బంప్స్ తెప్పించగా.. ఇప్పుడు గ్లింప్స్ సైతం వేరే లెవల్‌లో ఉంది. 'ఒకే పని చేసేనాకి.. ఒకేనాగా బతికేనాకి.. ఇంతపెద్ద బతుకెందుకు?. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే సేసెయ్యాలా. పుడతామా ఏంటి మళ్లీ..?' అంటూ చరణ్ ఉత్తరాంధ్ర యాసతో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ బీజీఎం సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. 'పెద్ది పెద్ది' అంటూ సాగే బీజీఎం ఆకట్టుకుంటోంది. గ్లింప్స్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. చరణ్ యాక్షన్ అదుర్స్ ఉంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో వింటేజ్ రామ్ చరణ్ కనిపిస్తారని అంటున్నారు.

ఆ షాట్ గూస్ బంప్సే

గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్స్ బ్యాక్ డ్రాప్‌లో క్రికెట్ ప్రధానాంశంగా 'పెద్ది' మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ గ్లింప్స్ చూస్తుంటే స్టోరీ డిఫరెంట్‌గా వేరే లెవల్ ఉండబోతోందని అర్థమవుతోంది. గ్రామీణ ప్రాంతంలో ఓ మాస్ యువకుడిగా చరణ్ కాస్ట్యూమ్స్ అదిరిపోయాయి. గ్లింప్స్‌లో ఓ షాట్ కోసం ఫ్యాన్స్ వెయ్యిసార్లు చూస్తారన్న నిర్మాత కామెంట్ నిజమైంది.

Also Read: ఎన్టీఆర్ ‘లవకుశ’, బాలయ్య ‘శ్రీరామరాజ్యం’ to నాగార్జున ‘శ్రీరామదాసు’, ప్రభాస్ ‘ఆదిపురుష్’ వరకు - ఈ ఆదివారం (ఏప్రిల్ 6) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్

తన గాయానికి ఇసుస రాసుకుని చరణ్ బ్యాటింగ్ చేసిన తీరు వేరే లెవల్‌లో ఉంది. కోపంతో బ్యాట్‌ను కింద కొట్టి ముందుకొచ్చి మరీ బాల్‌ను బాదిన తీరు నిజంగా ఊర మాస్ అనేలా ఉంది. ఇక ఈ స్టోరీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మూవీలో వింటేజ్ రామ్ చరణ్ చూస్తారన్న మాట నిజం చేసినట్లేనని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. ఈ గ్లింప్స్ చూశాక తనకు అమితమైన సంతోషం కలిగిందని చరణ్ అన్నారు. 'ఏఆర్ రెహమాన్ సర్ మూవీకి అందించిన సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మామూలుగా లేదు. అదుర్స్ అనేలా ఉంది.' అని పేర్కొన్నారు.

ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు, సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాలో చరణ్ ఎప్పుడూ కనిపించని ఓ డిఫరెంట్ రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం. మూవీలో ఆయన పేరు కూడా 'పెద్ది' అనే ఉండనున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో సినిమా తెరకెక్కుతోంది. సినిమాలో ఇప్పటికే 2 పాటలు పూర్తైనట్లు రెహమాన్ తెలిపారు. ఫస్ట్ లుక్, గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుండగా ఇప్పుడు సాంగ్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.