Honda SP 125 Bike on EMI: భారత మార్కెట్లో ద్విచక్ర వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఎందుకంటే మంచి మైలేజీని ఇచ్చే బైక్‌ల కోసం ప్రజలు వెతుకుతున్నారు. అలాంటి బైక్‌లలో ఒకటి హోండా ఎస్‌పీ 125. ఇది తక్కువ ధరలోనే చేతిలోకి వస్తుంది. అలాగే ఈ హోండా బైక్ మైలేజ్ పరంగా ఖచ్చితంగా బెస్ట్ ఆప్షన్. ఈ బైక్ ధర, ఫీచర్లు, ఇంజిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


భారత మార్కెట్లో హోండా ఎస్‌పీ 125 ఎక్స్ షోరూమ్ ధర రూ. 85,131 నుంచి మొదలై రూ. 89,131 వరకు ఉంది. ఈ హోండా మోటార్‌సైకిల్ డ్రమ్, డిస్క్ వేరియంట్‌లలో మార్కెట్లోకి వచ్చింది. ఈ బైక్‌లో ఏబీఎస్‌తో పాటు డిస్క్ బ్రేక్ సౌకర్యం కూడా ఉంది.



Also Read: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?


హోండా ఎస్‌పీ 125 బేస్ వేరియంట్ ఆన్ రోడ్ ధర రూ. లక్ష వరకు ఉంటుంది. మీరు రూ. 5,000 డౌన్ పేమెంట్‌ చెల్లించి ఈ బైక్‌ను కొనుగోలు చేయవచ్చు. డౌన్ పేమెంట్ చెల్లించిన తర్వాత, మీరు రూ. 97,000 బైక్ లోన్ తీసుకోవాలి. మీరు 10.5 శాతం వడ్డీ రేటుతో రుణం తీసుకుంటే మూడు సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 3,167 ఈఎంఐ చెల్లించాలి. మీరు బైక్ కొనే సిటీ, డీలర్‌షిప్‌లను బట్టి ధర మారే అవకాశం కూడా ఉంది.


ఈ హోండా బైక్‌లో 123.94 సీసీ సింగిల్ సిలిండర్ బీఎస్ 6, ఓబీడీ2 కంప్లైంట్ పీజీఎం-ఎఫ్ఐ ఇంజన్ ఉంది. ఇది 8కేడబ్ల్యూ పవర్, 10.9 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ హోండా బైక్ ఒక లీటర్ పెట్రోల్‌లో 65 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఒకసారి ట్యాంక్‌ను నింపితే దాదాపు 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.



Also Read: ఇండియాలో మోస్ట్ అవైటెడ్ కారు వచ్చేసింది - మహీంద్రా బీఈ 6ఈ ధర ఎంత?