Honda Shine 125 on EMI: ఫోర్ వీలర్స్‌తో పాటు భారతదేశంలో ద్విచక్ర వాహనాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. మధ్యతరగతి ప్రజలు ప్రయాణించడానికి బెస్ట్ వెహికిల్ ఆప్షన్ బైక్ అని చెప్పవచ్చు. ఇది సామాన్య ప్రజల రోజువారీ అవసరాలలో భాగం. మీరు మంచి మైలేజీ ఇచ్చే బైక్ కోసం వెతుకుతున్నట్లయితే మీకు ఒక గుడ్ న్యూస్. హోండా షైన్ 125 మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
ఈ హోండా బైక్ గ్రేట్ పెర్ఫార్మెన్స్‌తో పాటు గ్రేట్ లుక్‌తో కూడా వస్తుంది. దీనితో పాటు బైక్ మైలేజ్ కూడా బాగానే ఉంది. రోజూ డ్రైవ్ చేసే వారికి ఈ బైక్ పెట్రోల్ ఖర్చు కూడా ఆదా చేస్తుంది. హోండా షైన్ 125 ఆన్ రోడ్ ధర, ఈఎంఐ, డౌన్ పేమెంట్ ఏంటో తెలుసుకుందాం.
హోండా షైన్ 125 ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి?
కొత్త హోండా షైన్ 125 రెండు వేరియంట్లలో వస్తుంది. అదే డ్రమ్ వేరియంట్, డిస్క్ వేరియంట్. దీని డ్రమ్ వేరియంట్ ఆన్ రోడ్ ధర దాదాపు రూ.94 వేల వరకు ఉంది. మీ దగ్గర అంత డబ్బు లేకపోతే బైక్ లోన్ తీసుకుని కొనుగోలు చేయవచ్చు. హోండా షైన్ మనదేశంలో ఎక్కువగా అమ్ముడుపోతున్న బైక్స్‌లో ఒకటి. కాబట్టి తక్కువ ధరలో ఒక మంచి బైక్ కావాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు.
Also Read: సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!
హోండా షైన్ 125 డ్రమ్ వేరియంట్‌ను కొనుగోలు చేయడానికి మీరు రూ. 10,000 డౌన్ పేమెంట్‌గా చెల్లించాలి. దీని తర్వాత మిగిలిన మొత్తంపై 9.7 శాతం వడ్డీ రేటుతో 36 నెలల పాటు ప్రతి నెలా సుమారు రూ. 2700 ఈఎంఐ కట్టవచ్చు. సిటీ, డీలర్‌షిప్‌లను బట్టి కొత్త హోండా షైన్ 125 ఆన్ రోడ్ ధర మారవచ్చు.
హోండా షైన్ 125 పవర్‌ట్రెయిన్, ఫీచర్లు ఇలా...
ఈ బైక్‌లో కంపెనీ 123.94 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ని అమర్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 10.74 పీఎస్ పవర్‌ని, 11 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ బైక్ లీటరుకు 55 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇవ్వగలదు. అలాగే ఈ బైక్ సైలెంట్ స్టార్ట్ సిస్టమ్, ఇంజన్ కిల్ స్విచ్, డ్యూయల్ పాడ్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి గొప్ప ఫీచర్లను కలిగి ఉంది.
Also Read: రూ.10 లక్షల్లోపు ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉన్న కార్లు ఇవే - మహీంద్రా నుంచి మారుతి వరకు!