Honda NX500 Launched: హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా దేశీయ మార్కెట్లో తన కొత్త ఎన్ఎక్స్500 అడ్వెంచర్ టూరర్ బైక్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.90 లక్షలుగా ఉంది. ఈ బైక్ ప్రాథమికంగా సీబీ500ఎక్స్ స్థానంలో ఉంటుంది. దేశీయ మార్కెట్లో ఈ బైక్ సీబీయూ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉండనుంది. అంటే పూర్తిగా బయట దేశాల్లో తయారై భారతదేశంలోకి దిగుమతి కానుందన్న మాట. భారతదేశంలోని కంపెనీ ప్రీమియం డీలర్‌షిప్ బిగ్‌వింగ్ నుంచి దీనిని కొనుగోలు చేయవచ్చు. ఈ బైక్ కోసం బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఈ బైక్‌ను ఫిబ్రవరిలో కస్టమర్‌లకు డెలివరీ చేసే అవకాశం ఉంది. దీని ధర రూ.5.9 లక్షల (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభం కానుంది.


హోండా ఎన్ఎక్స్500 డిజైన్, ఫీచర్లు
స్టైలింగ్ గురించి మాట్లాడితే మొత్తం లుక్ సీబీ500ని పోలి ఉంటుంది. ఇప్పుడు ఐదు అంగుళాల ఫుల్లీ కలర్డ్ టీఎఫ్‌టీ స్క్రీన్ కూడా ఉంది. డైమండ్ ట్యూబ్ మెయిన్‌ఫ్రేమ్ ఆధారంగా ఉండే ఈ బైక్‌లో తలక్రిందులుగా ఉన్న ఫ్రంట్ ఫోర్క్‌లు, వెనుకవైపు మోనో షాక్ యూనిట్ ఉన్నాయి. అయితే సీబీ500ఎక్స్ లాగా ఈ బైక్ 19 అంగుళాల ఫ్రంట్, 17 అంగుళాల రియర్ ట్రయల్ ప్యాటర్న్ టైర్‌లతో వస్తుంది. ఇందులో 5 స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. డ్యూయల్ 296 మిమీ ఫ్రంట్ డిస్క్‌లు, 240 మిమీ రియర్ డిస్క్‌లు బ్రేకింగ్ కోసం అందించారు. ఇవి స్టాండర్డ్‌గా డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌ ఉండనుంది. అయితే సీబీ500ఎక్స్‌లో సింగిల్ డిస్క్ ఫ్రంట్ బ్రేక్ మాత్రమే ఉంది.


హోండా ఎన్ఎక్స్500 ఇంజన్
ఈ బైక్‌కు గొప్ప పనితీరును అందించడానికి 471 సీసీ లిక్విడ్ కూల్డ్, సమాంతర ట్విన్ ఇంజన్ ఉంది. ఇది 47.5 హెచ్‌పీ పవర్‌ని, 43 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మోటార్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది. ఇది అసిస్ట్/స్లిప్పర్ క్లచ్‌తో రానుంది.


హోండా ఎన్ఎక్స్500 కలర్ ఆప్షన్లు ఇలా...
ఈ కొత్త బైక్‌ను భారతదేశంలో మూడు డిఫరెంట్ కలర్ ఆప్షన్లతో మార్కెట్లోకి రానుంది. గ్రాండ్ ప్రిక్స్ రెడ్, మ్యాట్ గన్‌పౌడర్ బ్లాక్ మెటాలిక్, పెరల్ హారిజన్ వైట్ కలర్స్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


మరోవైపు టాటా తన అల్ట్రోజ్ ఈవీ కాన్సెప్ట్‌ను 2019 జెనీవా మోటార్ షోలో మొదటిసారి ప్రదర్శించింది. తర్వాత దీన్ని ఆటో ఎక్స్‌పో 2020లో కూడా డిస్‌ప్లే చేయనుంది. కంపెనీ వచ్చే ఏడాది భారతీయ మార్కెట్లో అల్ట్రోజ్ ఈవీని విడుదల చేయనున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారును 2025 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ రాబోయే ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ గురించిన వివరాలు సీక్రెట్‌గా ఉంచారు. అల్ట్రోజ్ ఈవీ కాన్సెప్ట్ మార్కెట్‌లో ఉన్న ఐసీఈ వేరియంట్‌ల మాదిరిగా కనిపిస్తుంది. లాంచ్ అయిన తర్వాత ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కొత్త డిజైన్‌ను పొందే అవకాశం ఉంది.


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!