Superheroes at Ayodhya: దేశంలో ఎక్కడ చూసినా.. ‘అయోధ్య’ గురించే చర్చ. జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రారంభానికి సర్వం సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో కొందరు ఏఐ ద్వారా ఇంటర్నేషనల్ సూపర్ హీరోలను అయోధ్యకు తీసుకొచ్చారు. అదెలా అంటే.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ద్వారా. ఐరన్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, వండర్ ఉమెన్, స్పైడర్ మ్యాన్, థోర్, హల్క్, డెడ్‌పూల్.. ఇలా ఎందరో సూపర్ హీరోలను ఏఐ ద్వారా అయోధ్యకు తీసుకొచ్చారు నిపుణులు.


అయోధ్య సేవలో సూపర్ హీరోలు..


ఏఐ ద్వారా ఇప్పటికే ఎందరో సినీ సెలబ్రిటీలను చిన్న పిల్లల్లాగా, వయసు అయిపోయిన వారిలా తయారు చేసి చూపించారు క్రియేటర్స్. అంతే కాకుండా ఈ టెక్నాలజీతో ఇంకా ఎన్నో అందమైన క్రియేషన్స్‌లో నెటిజన్లకు పరిచయం చేశారు. ఇప్పుడు అందులోకి మరో కొత్త క్రియేషన్ కూడా యాడ్ అయ్యింది. మార్వెల్, డీసీ కామిక్స్‌లోని సూపర్ హీరోలు వచ్చి అయోధ్యలో సేవ చేస్తున్నట్టుగా ఒక ఏఐ క్రియేటర్ ఫోటోలను క్రియేట్ చూసి చూపించాడు. దీనిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం దేశమంతటా అయోధ్య ఫీవర్ కొనసాగుతుండగా.. సోషల్ మీడియాలోని ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.


అందరు సూపర్ హీరోలు ఒక్కచోటే..


సినిమాల్లో చూపించే ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, వండర్ ఉమెన్, స్పైడర్ మ్యాన్, హల్క్, థోర్, డెడ్‌పూల్ వంటి సూపర్ హీరోలను మాత్రమే కాకుండా.. కామిక్ బుక్స్‌లో కనిపించే థానోస్, ది జోకర్, లోకీ వంటి క్యారెక్టర్స్‌ను కూడా అయోధ్య రామ మందిరంలో సేవ చేస్తున్నట్టుగా క్రియేట్ చేశాడు ఒక ఏఐ క్రియేటర్. ఇక షాహిద్ ఎస్‌కే అనే ఈ క్రియేటర్ క్రియేట్ చేసిన ఏఐ ఆర్ట్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోలు చూస్తుంటే చాలా క్యూట్‌గా అనిపిస్తున్నాయంటూ తన పోస్టుకు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రియేటివిటీని చూసి చాలామంది ఇన్‌స్పైర్ అవుతున్నారు. టెక్నాలజీని ఎన్నో విధాలుగా దుర్వినియోగం చేస్తున్న ఈరోజుల్లో.. ఇలాంటి ఆర్ట్స్ నెటిజన్లకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి.






వారంరోజుల ముందు నుండే కార్యక్రమాలు..


ఇప్పటికీ షాహిద్ తయారు చేసిన సూపర్ హీరోలతో పాటు హ్యారీ పాటర్‌లాగా మరికొన్ని క్యారెక్టర్స్ కూడా ఉంటే బాగుంటుందని కొందరు నెటిజన్లు సలహా కూడా ఇచ్చారు. ఇక అయోధ్య రామ మందిరం విషయానికొస్తే.. జనవరి 22న ఈ మందిరం ప్రారంభోత్సవం ఉన్నా కూడా దాదాపు వారం రోజుల ముందే ఇక్కడ పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. జనవరి 16 నుండే అక్కడ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గురువారం.. గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. నేరుగా రామ మందిర ప్రారంభోత్సవాన్ని చాలామంది చూసే అవకాశం లేదు కాబట్టి దీనిని వర్చువల్‌గా దేశవ్యాప్తంగా ప్రజలు వీక్షించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్య చుట్టు పక్కన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు జనవరి 22న కేంద్ర ప్రభుత్వం సెలవును కూడా ప్రకటించింది.


Also Read: ఆ సీన్‌ తర్వాత 'యానిమల్‌' సెట్‌లో నిజంగానే ఏడ్చాను - అసలేం జరిగిందో కూడా అర్థం కాలేదు