Honda Activa Electric Scooter: ద్విచక్ర వాహన ప్రియులకు ఒక ఉత్తేజకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే కొత్త హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తి 2024 డిసెంబర్ నాటికి కర్ణాటకలోని కంపెనీ ఫెసిలిటీలో ప్రారంభమవుతుంది. ఇది 2025 ప్రారంభంలో మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. కే4బీA అనే కోడ్‌నేమ్... హోండా యాక్టివా ఈవీ... ఏథర్ 450ఎక్స్, ఓలా ఎస్1, టీవీఎస్ ఐక్యూబ్‌లకు కొత్త ప్రత్యర్థిగా మార్కెట్‌లోకి వస్తుంది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది. ఇప్పటివరకు మనకు తెలిసిన విషయమేమిటంటే ఇది ఫిక్స్‌డ్ బ్యాటరీతో కూడిన 'మిడ్-రేంజ్' ఈ-స్కూటర్. ఇది మాస్ మార్కెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే తక్కువ ధరలోనే లభించే అవకాశం ఉంది.
హోండా యాక్టివా ఈవీ ప్రత్యేక ప్లాట్‌ఫారమ్ (ప్లాట్‌ఫారమ్ ఈ)పై ఆధారపడి ఉంటుంది. దీన్ని మల్టీపుల్ బ్యాటరీ ఆర్కిటెక్చర్లు, ఇన్‌స్టాలేషన్‌లతో రాబోయే అనేక ఎలక్ట్రిక్ మోడళ్ల కోసం ఉపయోగించనున్నారు. జపనీస్ ద్విచక్ర వాహన తయారీదారు ఇప్పటికే ఫిక్స్‌డ్ బ్యాటరీలు, మోటార్లు, కంట్రోలర్‌లు, ఛార్జర్‌లు మొదలైన వాటితో సహా ఈవీ టెక్నాలజీ కోసం పేటెంట్‌లను దాఖలు చేసింది. ఈ పేటెంట్‌లు కొత్త హోండా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఫ్లోర్‌బోర్డ్ కింద ఫిక్స్‌డ్ బ్యాటరీ, వెనుక చక్రంలో హబ్ మోటార్ ఉంటుందని సూచిస్తున్నాయి.
ప్రత్యేక 'ఈ' ఫ్యాక్టరీ ఏర్పాటు...
యాక్టివా ఈవీ కాకుండా హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) కొత్త ఈవీని పరిచయం చేస్తుంది. ఇది మార్చుకోగలిగే బ్యాటరీలతో వచ్చే అవకాశం ఉంది. ద్విచక్ర వాహన తయారీ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న 6,000 టచ్‌పాయింట్‌లలో బ్యాటరీ మార్పిడి స్టేషన్‌లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది.
ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌ను తీర్చే లక్ష్యంతో హోండా కర్ణాటకలోని నరసపుర ఫెసిలిటీలో కొత్త డెడికేటెడ్ ఫ్యాక్టరీ 'ఈ'ని ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ 2030 నాటికి ఒక మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేస్తుంది. హోండా త్వరలో లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీ, పవర్ కంట్రోల్ యూనిట్ భాగాలను తయారు చేస్తుంది. ఇతర కొత్త అప్‌డేట్‌లలో హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉన్న మనేసర్ గ్లోబల్ రిసోర్స్ ఫ్యాక్టరీలో హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా తన కొత్త ఇంజిన్ అసెంబ్లీ లైన్‌ను కూడా ప్రారంభించింది.
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?