Hero Bike Scooter Discount Offer: హీరో మోటోకార్ప్ తన కస్టమర్ల కోసం ఈ దీపావళి సీజన్‌లో గొప్ప ఆఫర్‌ను తీసుకొచ్చింది. హీరో బైక్‌లు, స్కూటర్‌లకు సంబంధించిన అనేక మోడల్‌లపై వేల రూపాయల విలువైన ప్రయోజనాలు అందిస్తున్నారు. దీంతో పాటు 100 సీసీ బైక్‌లపై కూడా 5000 రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్ హీరో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లు, స్కూటర్‌లపై కూడా అందుబాటులో ఉంది.


హీరో అద్భుతమైన నవరాత్రి ఆఫర్
హీరో బైక్‌లపై రూ.5,500 వరకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తోంది. దీంతో పాటు, మీరు ఈ బైక్‌లపై రూ. 5,000 వరకు క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ నవరాత్రులకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. హీరో బైక్‌లతో పాటు స్కూటర్లపై కూడా ఈ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ బైక్‌లు, స్కూటర్‌లను కొనుగోలు చేసేవారు దసరా రోజు అక్టోబర్ 12వ తేదీ వరకు ఈ ఆఫర్‌ను పొందవచ్చు.


హీరో 100 సీసీ మోటార్‌సైకిల్
హీరో ఇటీవల 100 సీసీ సెగ్మెంట్‌లో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ 2.0ని విడుదల చేసింది. రూ.82,911 ధరతో ఈ బైక్ మార్కెట్లోకి వచ్చింది. స్ప్లెండర్ ప్లస్ హీరో బెస్ట్ సెల్లింగ్ బైక్. ఇండియన్ మార్కెట్లో ఈ బైక్ ధర రూ.75,441 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ బైక్ కొనుగోలుపై ఐదు వేల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ సెగ్మెంట్‌లోని అన్ని బైక్‌లపై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.



Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?


ప్రీమియం బైక్‌లపై ఆఫర్లు
100 సీసీతో పాటు 125 సీసీ, ప్రీమియం మోటార్‌సైకిళ్లపై కూడా హీరో ఈ నవరాత్రి ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ 125 సీసీ విభాగంలో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్, ప్రీమియం సెగ్మెంట్ బైక్ మావెరిక్ 440లో అందుబాటులో ఉంది. ఈ అన్ని బైక్‌లపై రూ. 5,000 వరకు ఆదా చేసుకోవచ్చు. 


హీరో స్కూటర్‌పై రూ. 5000 ప్రయోజనాలు
హీరో జూమ్, డెస్టినీ ప్రైమ్, ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్ వంటి స్కూటర్లన్నింటిపై మీరు రూ. 5,000 వరకు ఆదా చేసుకోవచ్చు. హీరో జూమ్ ధర రూ. 71,484 నుంచి ప్రారంభం అవుతుంది. డెస్టినీ ప్రైమ్ ధర రూ.71,499 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఆఫర్లన్నింటికీ సంబంధించిన సమాచారం హీరో మోటోకార్ప్ వెబ్‌సైట్‌లో ఇవ్వబడింది. ఈ నవరాత్రి దసరా ఆఫర్‌కి హీరో శుభ ముహూర్తం అని పేరు పెట్టారు.



Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే