Hero Karizma XMR: హీరో మోటోకార్ప్ తన కరిజ్మా ఎక్స్ఎంఆర్ మోడల్‌ను ఆగస్టు 29వ తేదీన భారత మార్కెట్లోకి తిరిగి తీసుకురానుంది. కస్టమర్లలో ఉత్సాహాన్ని పెంచడానికి కంపెనీ ఈ మోటార్‌సైకిల్ టీజర్‌ను కూడా విడుదల చేసింది. లాంచ్‌కు ముందు బైక్ వివరాలను కంపెనీ క్రమంగా రివీల్ చేస్తూ వస్తుంది. మొదటి టీజర్ బైక్ సిల్హౌట్‌ను చూపించగా, కొత్త టీజర్ దాని హెడ్‌ల్యాంప్‌ లుక్ ఎలా ఉంటుందో తెలిపింది. ఇందులో 210 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో రానుంది. అయితే ఇతర స్పెసిఫికేషన్లు ఇంకా వెల్లడించలేదు. ఇది దాదాపు 25 బీహెచ్‌పీ పవర్ అవుట్‌పుట్‌ను అందించగలదని అంచనా.


ఈ బైక్ ఫ్రంట్ లుక్ ఎలా ఉంది?
కొత్త టీజర్‌లో ఈ బైక్‌కు సంబంధించిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, రెండు వైపులా యాంగ్యులర్ డీఆర్ఎల్స్ కనిపించాయి. ఇంటర్నెట్‌లో కనిపించిన స్పై షాట్‌ల ప్రకారం రాబోయే బైక్ పాత కరిజ్మా ZMR మాదిరిగానే పూర్తి ఫెయిర్డ్ డిజైన్ లాంగ్వేజ్‌ను కలిగి ఉంటుంది. బైక్ ఎల్ఈడీ హెడ్‌లైట్ ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ లాగా కనిపిస్తుంది. ఇది క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్, స్ట్రాంగ్ ఫ్యూయల్ ట్యాంక్, స్ప్లిట్ సీట్లు, అల్లాయ్ వీల్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఇతర ఫీచర్లను పొందవచ్చు.


కొత్త ప్లాట్‌ఫారమ్‌పై...
ప్రస్తుతానికి ఈ బైక్ గురించి కంపెనీ ఇంకా నిర్దిష్ట సమాచారాన్ని షేర్ చేయలేదు. కానీ ఒక అంచనా ప్రకారం కరిజ్మా ఎక్స్ఎంఆర్‌ను స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్, బాక్స్ స్టైల్ స్వింగార్మ్‌తో కొత్త ప్లాట్‌ఫారమ్‌పై బిల్డ్ చేయనున్నారు. 210సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌తో వస్తున్న కంపెనీ తొలి బైక్ ఇదే. ఇది సుమారుగా 25 బీహెచ్‌పీ పవర్, 30 ఎన్ఎం టార్క్‌ని పొందగలదని అంచనా. ఈ బైక్‌లో 6 స్పీడ్ గేర్‌బాక్స్ అందించే అవకాశం ఉంది.


ధర ఎంత ఉండవచ్చు?
కొత్త హీరో కరిజ్మా ఎక్స్‌ఎంఆర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.60 లక్షల నుంచి రూ. 1.90 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. లాంచ్ అయిన తర్వాత ఇది యమహా ఆర్15 వీ4, బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 వంటి మోడళ్లతో పోటీపడగలదు. మరోవైపు టీవీఎస్ కూడా త్వరలో కొత్త అపాచీ ఆర్ఆర్ 310 బైక్‌ను లాంచ్ చేయనుంది. ఇది మార్కెట్లో నేకెడ్ అపాచీ RR 310గా రానుందని భావిస్తున్నారు.










Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial