కాలుష్య రహిత వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేద కుటుంబాలు EVలను కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున రాయితీలను ప్రకటించింది. పారిస్ మోటార్ షోలో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు రెనాల్ట్ - RENA.PA), స్టెల్లాంటిస్ (STLA.MI) కార్లను ఆవిష్కరించారు.
సబ్సిడీ భారీగా పెంపు
ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మాక్రాన్ కీలక విషయాలు వెల్లడించారు. తక్కువ ఆదాయ కుటుంబాలకు EV సబ్సిడీలు వచ్చే ఏడాది నుంచి మరింత పెంచనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 6,000 యూరోలు ఉండగా, వచ్చే ఏడాది నుంచి 7,000 యూరోలకు అంటే భారత కరెన్సీలో రూ. 5,62,179 రూపాయలకు పెంచనున్నట్లు తెలిపారు. ఇతర ఫ్రెంచ్ కొనుగోలుదారులకు సంబంధించిన సబ్సిటీని 5,000 యూరోలకు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. తక్కువ ఆదాయ కుటుంబాలకు నెలకు 100 యూరోల EVని యాక్సెస్ చేయడంలో సహాయపడే ‘సోషల్ లీజింగ్’ పథకాన్ని 2024 ప్రారంభంలో లాంచ్ చేయనున్నట్లు మాక్రాన్ వెల్లడించారు.
వాస్తవానికి పెట్రో ఉత్పత్తులతో నడిచే కార్లతో పోల్చితే ఎలక్ట్రిక్ వాహనాలు చాలా ఖరీదైనవి. అందుకే వీటిని కొనుగోలు చేసేందుకు మధ్య తరగతి ప్రజలు వెనుకడుగు వేస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత ఎక్కువ ఫ్రెంచ్ కార్లు కొనుగోలు చేయడానికి పారిశ్రామిక వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు మాక్రాన్ తెలిపారు.
స్టెల్లాంటిస్ (STLA.MI) Opel, DS బ్రాండ్లు రూపొందించిన రెనాల్ట్ జో, సరికొత్త Mégane, Kangoo వాన్తో పాటు రెండు చిన్న SUVలు కాకుండా.. ఫ్రెంచ్ కార్ల తయారీదారులు విక్రయించే అన్ని ఎలక్ట్రిక్ మోడల్‌లు విదేశాలలో అసెంబ్లింగ్ చేయడం విశేషం. తాజాగా ఆవిష్కరించిన స్టెల్లాంటిస్ ప్యుగోట్ 308 సెడాన్, లాంగర్ ప్యుగోట్ 408 ఎలక్ట్రిక్ వెర్షన్లు తూర్పు ఫ్రాన్స్‌లోని మల్‌హౌస్‌లో అసెంబ్లింగ్ చేస్తున్నారు.
Renault కంపెనీకి సంబంధించిన సరికొత్త Renault 4 EV, 1960ల నాటి ఐకానిక్ 4Lకి స్టైలిస్టిక్ నోడ్‌లతో కూడిన చిన్న SUV మౌబ్యూజ్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ కారు 2025లో అమ్మకానికి వస్తుంది. రెనాల్ట్ 4 ఎలక్ట్రిక్ కంగూ సైతం మౌబ్యూజ్‌లో ఉత్పత్తి చేస్తారు. కొత్త మెగన్ కారు ఉత్తర ఫ్రాన్స్‌లోని డౌయ్‌లో తయారు చేస్తారు. ఎలక్ట్రిక్ సీనిక్, రెనాల్ట్ 5 కూడా 2024 నాటికి డౌయ్‌లో ఉత్పత్తికి సిద్ధం అవుతున్నాయి.
2030 నాటికి రెనాల్టో నుంచి పూర్తి స్థాయిలో ఈవీలు
మరోవైపు రెనాల్ట్ గ్రూప్ 2030 నాటికి పూర్తి ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్ 8న ’ఇన్వెస్టర్స్ డే’ సందర్భంగా ఆటో పరిశ్రమలో విద్యుదీకరణ , సాఫ్ట్‌వేర్‌పై ప్రత్యేక ప్రణాళిక రూపొందనుంది. ఇటీవల అమెరికా ఆమోదించిన ద్రవ్యోల్బణం తగ్గింపు చట్టం మాదిరిగానే, యూరోపియన్ నిర్మిత EVలకు రాయితీలను పెంచడంపై ఫోకస్ పెడుతున్నట్లు మాక్రాన్ వెల్లడించారు.
Read Also: సరికొత్తగా జీప్ గ్రాండ్ చెరోకీ, వచ్చే నెలలో భారత మార్కెట్లో లాంచ్