What to Do If Your Brakes Fail: కారు డ్రైవ్ చేయడం అంటే మనలో చాలా మందికి ప్యాషన్. కారు నడుపుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కారు బ్రేక్ ఫెయిలై రోడ్డు ప్రమాదం జరిగిందనే వార్తలు మనం ఎన్నోసార్లు వింటూనే ఉంటాం. మీరు కారు డ్రైవ్ చేసేటప్పుడు సడెన్‌గా బ్రేకులు పని చేయకపోతే కంగారు పడకుండా కొన్ని చిట్కాలు పాటిస్తే ప్రమాదం జరగకుండా బయట పడవచ్చు.
కారును ఇలా కంట్రోల్ చేయండి
వేగంగా కదులుతున్న కారులో బ్రేక్‌లు పడకపోతే ముందు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత వాహనం వేగాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి. వేగాన్ని తగ్గించడానికి కారు గేర్‌ను నెమ్మదిగా క్రిందికి దించి, మొదటి గేర్‌కు తీసుకురండి. ఈ సమయంలో బ్రేక్‌ను నిరంతరం నొక్కుతూనే ఉండండి. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా బ్రేక్ మళ్లీ పని చేసే అవకాశాలు పెరుగుతాయి.
లైట్లు, హారన్ ఉపయోగించండి
కారు బ్రేక్ ఫెయిల్ అయినట్లయితే, వెంటనే కారులోని హజార్డ్ లైట్లు ఆన్ చేయండి. దీన్ని ఆన్ చేయడం ద్వారా, మీ చుట్టూ నడుస్తున్న వాహనాల్లో కూర్చున్న వ్యక్తులు మీ కారు బ్రేక్ డౌన్ అయిందని, యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉందని సిగ్నల్ పొందుతారు. అలాగే నిరంతరం హారన్ కొడుతూ ఉండండి.
పొరపాటున కూడా రివర్స్ గేర్ వేయవద్దు
వాహనం వేగాన్ని తగ్గించడానికి, పొరపాటున కూడా రివర్స్ గేర్ ఉపయోగించవద్దు. అది ప్రమాదానికి కారణం కావచ్చు.మీ కారు ఏసీని ఫుల్‌గా పెట్టండి. దీని వలన ఇంజిన్‌పై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. దీని కారణంగా కారు వేగం కొంచెం తగ్గుతుంది.
హ్యాండ్‌బ్రేక్ వేయండి
మీ కారు వేగం గంటకు 40 కిలో మీటర్లకు దగ్గరగా వస్తే హ్యాండ్‌బ్రేక్‌ని ఉపయోగించి కారుని ఆపవచ్చు. ఒక విషయాన్ని ఎప్పుడూ మైండ్‌లో ఉంచుకోండి. కారు హై స్పీడ్‌లో ఉన్నప్పుడు హ్యాండ్‌బ్రేక్‌ని ఉపయోగించవద్దు. అలాగే హ్యాండ్ బ్రేక్ వేసే ముందు కూడా వెనుక వాహనాలు ఏవీ రాకుండా చూసుకోండి. మీ చుట్టు పక్కల ఇసుక లేదా మట్టి కుప్ప ఉన్నట్లయితే దానిపై వాహనాన్ని నడపవచ్చు. దాని కారణంగా కారు ఆగిపోతుంది.
మరోవైపు ఇటీవలే హార్లీ డేవిడ్‌సన్ ఎక్స్440, ట్రయంఫ్ స్పీడ్ 400 మిడిల్ వెయిట్ మోటార్‌సైకిళ్లు భారతదేశంలో లాంచ్ అయ్యాయి. దీని కారణంగా మిడిల్ వెయిట్ మోటార్ సైకిల్ విభాగంలో భారతదేశంలో పోటీ విపరీతంగా పెరిగిపోయింది. ఈ రెండు మోడల్స్ హార్లీ డేవిడ్‌సన్, ట్రయంఫ్ ఇటీవలే లాంచ్ చేసిన బడ్జెట్ బైక్స్‌లో ఉన్నాయి. హార్లే డేవిడ్సన్ ఎక్స్440... హీరో, హార్లే మధ్య జాయింట్ వెంచర్ ద్వారా లాంచ్ అయిన మొదటి బైక్. అలాగే ట్రయంఫ్ స్పీడ్ 400... బజాజ్ ఆటో, ట్రయంఫ్ మధ్య జాయింట్ వెంచర్ ద్వారా లాంచ్ అయిన ఫస్ట్ ప్రొడక్ట్. ఈ రెండు బైక్‌లకు పోటీగా బుల్లెట్ 350, క్లాసిక్ 350, హంటర్ 350, మీటోర్ 350, హిమాలయన్ 400 మోడల్స్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పటికే మార్కెట్లో విక్రయిస్తుంది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial