Car Care Tips: చాలా మంది కార్లు వాడే వారు చేసే కంప్లయింట్ తమ కారుకు మంచి మైలేజీ రావడం లేదని. దీనికి కారణం కొన్నిసార్లు చాలా చిన్నది కావచ్చు. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా మీ కారు నుంచి మంచి మైలేజీని పొందవచ్చు.
స్మూత్‌గా నడపండి
చాలా సార్లు వ్యక్తుల జిగ్-జాగ్ లేదా తప్పుడు డ్రైవింగ్ కారణంగా కూడా సరైన మైలేజీని పొందకపోవడానికి కారణం అవుతుంది. ఇవేమీ పట్టించుకోకుండా వారు తమ కారును నిందిస్తూనే ఉంటారు. తరచుగా డ్రైవింగ్ చేసేవారు ఒక్కసారిగా యాక్సిలరేటర్ రైజ్ చేయడం, బ్రేక్‌లను వేయడం కనిపిస్తుంది. అయితే ఇది చాలా తప్పు పద్ధతి. ఇది వాహనం ఇంజిన్‌పై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా మైలేజీని తగ్గిస్తుంది. అందువల్ల వీటికి దూరంగా ఉండి కారును స్మూత్‌గా నడపాలి.
సమయానికి సర్వీసు చేయిస్తూ ఉండండి
మీ వాహనం మంచి మైలేజీని ఇవ్వాలంటే సరైన సమయంలో దానికి సర్వీసును చేయించడం కూడా అవసరం. చాలా సార్లు వినియోగదారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. సర్వీసుకు ఇవ్వకుండా కారును ఉపయోగించడం కొనసాగిస్తున్నారు. ఇంజిన్ ఆయిల్‌లోని లూబ్రికెంట్ నిర్ణీత దూరం, సమయం పూర్తయిన తర్వాత తగ్గిపోతుంది. ఇది ఇంజిన్ అంతర్గత భాగాలను దెబ్బతీస్తుంది. సరైన సమయంలో సర్వీసు చేయడం ద్వారా దీనిని నివారించవచ్చు.
టైర్ ఒత్తిడిని సరిగ్గా ఉంచండి
మైలేజీలో టైర్ ప్రెజర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల, నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఎల్లప్పుడూ మీ వాహనం యొక్క టైర్లలో గాలిని ఉంచండి. అదే సమయంలో, మీరు నత్రజని గాలిని ఉపయోగిస్తే, అప్పుడు టైర్ యొక్క జీవితం కూడా పెరుగుతుంది.
కల్తీ లేని పెట్రోల్‌ను ఉపయోగించాలి
ప్రస్తుతం చాలా పెట్రోల్ పంపుల్లో కల్తీపై ఫిర్యాదులు అందుతున్నాయి. అందుకే కల్తీకి అవకాశం తక్కువగా ఉండే చోట కారుకు పెట్రోల్ పోయించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంధనం సరిగ్గా ఉంటే మైలేజీ కూడా బాగుంటుంది.
ఎవరికి పడితే వారికి కారును ఇవ్వకండి
కొంతమంది కారును ఎవరికి పడితే వారికి ఇస్తూ ఉంటారు. ప్రతిరోజూ వివిధ వ్యక్తులు కారును ఉపయోగించడం కూడా చూడవచ్చు. ప్రతి ఒక్కరి డ్రైవింగ్ స్టైల్ భిన్నంగా ఉంటుంది కాబట్టి ఇది నేరుగా ఇంజిన్‌పై ప్రభావం చూపుతుంది. కారు మంచి మైలేజీని ఇచ్చి ఎక్కువ కాలం రావాలంటే దీనిని నివారించాలి. కారును ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు.
ఎక్కువ బరువు ఉంచకండి
చాలా కార్లలో అనవసరమైన వస్తువులు నిల్వ చేయటం చూడవచ్చు. అలాంటి వస్తువులను కారు నుండి తీసివేయాలి. అనవసరమైన ఉపకరణాలు వాహనం బరువును పెంచుతాయి. దీని ఫలితంగా మైలేజ్ తగ్గుతుంది. కాబట్టి మీ కారులో వీలైనంత తక్కువ లగేజీని ఉంచండి.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial