Two Wheeler Riding Tips: భారతదేశంలో చాలా మంది ఆఫీసులకు వెళ్లడానికి టూ వీలర్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది ఎకనమికల్‌గా ఉండటమే కాకుండా సమయాన్ని ఆదా చేయడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కొంచెం స్థలం దొరికినా ముందుకు వెళ్లిపోవచ్చు. అయితే ప్రస్తుతం రోడ్లపై చిన్న పొరపాటు జరిగినా పెద్ద నష్టం వాటిల్లే వాతావరణం నెలకొంది. అటువంటి పరిస్థితిలో మీరు ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. వీటి గురించి మనం తెలుసుకుందాం.
హెల్మెట్ లేకుండా బయటకు వెళ్లవద్దు
వాతావరణం ఎలా ఉన్నా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం మంచిది కాదు. వింటర్ సీజన్‌లో హెల్మెట్ లేకుండా రైడింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీంతోపాటు చలి మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని కూడా చెప్పవచ్చు.
దుస్తులు ధరించడంలో నిర్లక్ష్యం చేయవద్దు
బైక్ రైడింగ్ ఔత్సాహికులు కొన్నిసార్లు, స్టైలిష్‌గా కనిపించడం కోసం, వాతావరణానికి అనుగుణంగా దుస్తులు ధరించకుండా రైడ్ చేయడం ప్రారంభిస్తారు. ఈ కఠినమైన శీతాకాలంలో ఇది చాలా హానికరం.
అన్ని లైట్లు బాగానే ఉండేలా చూసుకోండి
ఈ సీజన్‌లో హెడ్‌లైట్లు, వెనుక లైట్లు, టర్న్ ఇండికేటర్‌లతో సహా ద్విచక్ర వాహనానికి సంబంధించిన అన్ని లైట్లు మంచి కండీషన్‌లో ఉండాలి. ఎందుకంటే రాత్రిపూట నడిపేటప్పుడు, పొగమంచు మొదలైనప్పుడు లైట్లు కూడా చాలా సహాయకారిగా ఉంటాయి. దీని కారణంగా మీ ముందున్న మార్గం, మీ వెనుక నడిచే వ్యక్తి గురించి మీకు ఒక ఆలోచన వస్తుంది.
బ్రేకులు, టైర్లు కండీషన్‌లో ఉండాలి
ఈ సీజన్‌లో రోడ్లు తడిగా మారడం వల్ల బైక్ జారిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల టైర్లు సరైన స్థితిలో ఉండటం ముఖ్యం. తద్వారా స్కిడ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. బ్రేకులు మంచి స్థితిలో ఉంటే బైక్‌ను సరిగ్గా ఆపవచ్చు.
మరోవైపు భారతదేశ మార్కెట్లో ఉన్న ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఇటీవల తన కొత్త టూ ఇన్ వన్ కారుతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది టూ వీలర్, త్రీ వీలర్ల కలయిక అని చెప్పవచ్చు. దీన్ని కావాలంటే రెండు విధాలుగా కూడా ఉపయోగించవచ్చు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్/ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో ఈ ప్రత్యేకమైన త్రీ వీలర్‌ను స్కూటర్ అవతార్‌గా మార్చడానికి కేవలం మూడు నిమిషాలు మాత్రమే పడుతుందని కంపెనీ అధికారికంగా ప్రకటించారు. హీరో తన ప్రత్యేకమైన కన్వర్టిబుల్ వాహనానికి ‘సర్జ్’ అని పేరు పెట్టడం విశేషం. ఇది సర్జ్ ఎస్32 సిరీస్‌లో భాగంగా భారతీయ మార్కెట్లోకి రానుంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మొదటి షిఫ్టింగ్ వెహికిల్‌గా ఇది నిలిచింది. దీన్ని వ్యక్తిగతంగా, వాణిజ్యపరంగా కూడా ఉపయోగించవచ్చు. ప్రస్తుతానికి హీరో ఈ ప్రత్యేక వాహనం ధర గురించి లేదా దాని లాంచ్ ఎప్పుడు అనే విషయం గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.