మీ డ్రైవింగ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్సీ) లేదా ఇతర మోటార్ వెహికిల్ డాక్యుమెంట్స్ ఎక్స్ పైర్ అయ్యాయా? అయితే మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఈ నెలాఖరులోపు వాటిని రెన్యువల్ చేసుకోవచ్చు. కరోనావైరస్ సెకండ్ వేవ్ కారణంగా.. ఇటువంటి డాక్యుమెంట్లన్నీ సెప్టెంబర్ 30వ తేదీ వరకు చెల్లుతాయని కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో వీటి వ్యాలిడిటీ జూన్ 30వ తేదీ వరకు మాత్రమే చెల్లుబాటయ్యేది. ఇప్పుడు దాన్ని మరింత పొడిగించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కోట్లాది మంది ప్రజలకు ఊరట లభించనుంది.
కేంద్ర రోడ్డు, రవాణా శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. 2020 ఫిబ్రవరి 1వ తేదీ, ఆ తర్వాత ఎక్స్ పైర్ అయి.. లాక్ డౌన్ ఆంక్షల కారణంగా రెన్యువల్ చేయని డాక్యుమెంట్లన్నీ.. 2020 సెప్టెంబర్ 30వ తేదీ వరకు చెల్లుబాటు అవుతాయి.
డాక్యుమెంట్లు ఎక్స్ పైరీ అవ్వడం కారణంగా.. సామాన్య ప్రజలకు రవాణా విషయంలో ఎటువంటి సమస్యలూ తలెత్తకూడదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రవాణాదారులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వెంటనే ఈ ఉత్తర్వులను అమలు చేయాలని కోరింది.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి డాక్యుమెంట్ల వ్యాలిడిటీని ఇప్పటికే పలుమార్లు పెంచింది. 2020 మార్చి 30వ తేదీ, జూన్ 9వ తేదీ, ఆగస్టు 24వ తేదీ, డిసెంబర్ 27వ తేదీ, 2021 మార్చి 26వ తేదీల వరకు ఈ డాక్యుమెంట్ల వ్యాలిడిటీని పెంచుతూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది.
లాక్ డౌన్ నిబంధనల కారణంగా ప్రజలు తమ వాహనాల డాక్యుమెంట్లను రెన్యువల్ చేసుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయిం తీసుకుంది.
కొత్త డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేసే ప్రక్రియ ఇప్పటికే దేశంలోనే పలు రాష్ట్రాల్లో ప్రారంభం అయింది. లైసెన్స్ రెన్యువల్, లెర్నింగ్ లైసెన్స్ వంటి వాటికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.
Also Read: Whatsapp: లుక్ అందంగా.. ప్రైవసీ పటిష్టంగా.. వాట్సాప్ తీసుకురానున్న కొత్త ఫీచర్లు ఇవే!
Also Read: రూ.15 వేలలోపే భారతీయ బ్రాండ్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు!
Also Read: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. 64 మెగాపిక్సెల్ కెమెరా, ఆండ్రాయిడ్ 11 వంటి ఫీచర్లు!
Also Read: జియో ఫోన్ సేల్ వాయిదాకు కారణం ఇదే.. ల్యాప్‌టాప్‌ల రేట్లు పెరిగే అవకాశం!