Sedan Sales Report June 2023: మనదేశంలో అనేక సెగ్మెంట్లలో కార్లు దాదాపు బాగా అమ్ముడుపోతున్నాయి. దేశంలో సెడాన్ కార్లకు ఉన్న డిమాండ్ ఎస్‌యూవీల కంటే తక్కువగా ఉన్నప్పటికీ, అవి పెద్ద మొత్తంలో అమ్ముడు పోతున్నాయి. 2023 జూన్‌లో అమ్ముడుపోయే టాప్ 10 సెడాన్ కార్ల జాబితాను తెలుసుకుందాం.


గత నెలలో సెడాన్ కార్ల విక్రయాలు 11.50 శాతం తగ్గి 32,024 యూనిట్లకు చేరుకున్నాయి. 2022 జూన్‌లో దీనికి సంబంధించి 36,186 యూనిట్లు అమ్ముడుపోయాయి. అయితే 2023 మేలో అమ్ముడుపోయిన 31,530 యూనిట్లతో పోలిస్తే ఇది నెలవారీ ప్రాతిపదికన 1.57 శాతం అమ్మకాలు క్షీణించాయి. 


టాప్‌లో డిజైర్
2023 జూన్‌లో అమ్ముడుపోయిన టాప్ 10 సెడాన్ కార్ల జాబితాలో మారుతి డిజైర్ అగ్రస్థానంలో ఉంది. 2022 జూన్‌తో పోలిస్తే దాని అమ్మకాలు తగ్గాయి. 2023 జూన్‌లో ఈ కారు అమ్మకాలు 9,322 యూనిట్లుగా ఉన్నాయి. 2022 జూన్‌లో ఇది 12,597 యూనిట్లుగా ఉంది. దీని మార్కెట్ వాటా కూడా అంతకు ముందు నెలలో 35.89 శాతం నుంచి 29.11 శాతానికి పడిపోయింది.


హ్యుందాయ్ ఆరా 4,907 యూనిట్ల విక్రయాలతో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. 2022 జూన్‌లో విక్రయించిన 4,102 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది 19.62 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. 2023 మేలో విక్రయించిన 4,707 యూనిట్లతో పోలిస్తే నెలవారీ ప్రాతిపదికన కూడా 4.25 శాతం పెరుగుదలను చూపించింది. దీని తర్వాత హ్యుందాయ్ వెర్నా 4,001 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానంలో నిలిచింది. ఇక 2022 జూన్‌లో 1,703 యూనిట్లతో పోలిస్తే 134.94 శాతం వార్షిక వృద్ధి సాధించింది. నెలవారీగా చూసుకున్నప్పటికీ 2023 మేలో అమ్ముడుపోయిన 3,687 యూనిట్లతో పోలిస్తే 8.52 శాతం వృద్ధిని నమోదు చేశాయి.


హోండా అమేజ్ విక్రయాలు 3,602 యూనిట్లుగా ఉంది. ప్రస్తుతం అమేజ్ మార్కెట్ వాటా 11.25 శాతంగా ఉంది. అదే సమయంలో టాటా టిగోర్ అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 32.37 శాతం తగ్గి 3,335 యూనిట్లకు చేరుకుంది. 2022 జూన్‌లో 4,931 యూనిట్లు అమ్ముడుపోయాయి. అదేవిధంగా ఫోక్స్‌వ్యాగన్ వర్ట్యూస్ అమ్మకాలు గత నెలలో 1,812 యూనిట్లుగా ఉంది.


2023 జూన్‌లో సియాజ్ అమ్మకాలు 15.73 శాతం పెరిగి 1,744 యూనిట్లకు చేరుకున్నాయి. 2023 మేలో అమ్ముడుపోయిన 992 యూనిట్ల నుంచి 75.81 శాతం నెలవారీ పెరుగుదల సాధించింది. 2023 జూన్‌లో స్కోడా స్లావియా అమ్మకాలు 1,639 యూనిట్లుగా ఉంది. హోండా సిటీ విక్రయాలు 1,478 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ జాబితాలో 10వ స్థానంలో టొయోటా క్యామ్రీ ఉంది. దీనికి సంబంధించి గత నెలలో 184 యూనిట్లు అమ్ముడుపోయాయి.










Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial