ఎస్‌యూవీ కార్లు భారతదేశంలో ప్రస్తుతం చాలా ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వాటి కోసం డిమాండ్ కూడా చాలా పెరిగింది. అందుకే కార్ల తయారీ కంపెనీలు కూడా ఎస్‌యూవీలను ఎప్పటికప్పుడు ఎక్కువ గ్యాప్ లేకుండా విడుదల చేస్తున్నాయి. ఎస్‌యూవీల ప్రత్యేకత ఏమిటంటే ఎక్కువ స్థలంతో రావడంతో పాటు, అద్భుతమైన పనితీరును కూడా కనబరుస్తాయి. ప్రస్తుతం మన దేశంలో అత్యధిక మైలేజీనిచ్చే ఎస్‌యూవీ కార్ల గురించి తెలుసుకుందాం.
కియా సెల్టోస్ 1.5 టర్బో
మంచి మైలేజ్ కావాలంటే మీరు కియా సెల్టోస్‌ని కూడా ఎంచుకోవచ్చు. కియా సెల్టోస్‌లో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 160 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఇది 6 స్పీడ్ iMT లేదా 7 స్పీడ్ DCT ఆప్షన్‌ను పొందుతుంది. ఇది ఈ సెగ్మెంట్లో శక్తివంతమైన ఇంజన్‌తో వస్తుంది. మైలేజీ గురించి చెప్పాలంటే సగటున లీటరుకు 17.8 కిలోమీటర్లు అందిస్తుంది.
మారుతి గ్రాండ్ విటారా / టయోటా హైరైడర్ 1.5 పెట్రోల్
మరొక ఆప్షన్‌గా మారుతి స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ అనే రెండు కార్లు ఉన్నాయి. ఈ రెండు ఎస్‌యూవీలు 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో రానున్నాయి. ఇవి 103 హెచ్‌పీ పవర్‌ని ఉత్పత్తి చేస్తాయి. రెండు కార్లు సగటున లీటరుకు 21.12 కిలోమీటర్ల మైలేజీని అందించనున్నాయి. దీంతో పాటు ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను పొందుతుంది.
మారుతి గ్రాండ్ విటారా / టయోటా హైరైడర్ 1.5 స్ట్రాంగ్ హైబ్రిడ్
ఈ రెండు ఎస్‌యూవీలు ఒక లీటర్ పెట్రోల్‌కు 27.97 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయి. రెండు కార్లు టయోటా స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో మార్కెట్లోకి వచ్చాయి. ఇది 1.5 లీటర్ 4 సిలిండర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. అయితే ఈ కారు కేవలం ఈ-సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను మాత్రమే పొందుతుంది. అధిక ట్రాఫిక్ ఉన్న రోడ్లపై ఈ కార్లు ఎక్కువ మైలేజీని ఇస్తాయి.
స్కోడా కుషాక్ 1.5 టీఎస్ఐ
స్కోడా కుషాక్ 1.5 లీటర్ 4 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో అమర్చబడి ఉంది. ఇది 150 హెచ్‌పీ పవర్‌ని పొందుతుంది. అలాగే 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉంది. కుషాక్ 1.5 టీఎస్ఐ లీటరుకు 17.83 కిలోమీటర్ల మైలేజీని పొందుతుందని తెలిసింది.
ఫోక్స్‌వ్యాగన్ టైగన్ 1.5 టీఎస్ఐ
మీరు టైగన్‌ని ఐదో ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. ఈ ఎస్‌యూవీ స్కోడా కుషాక్ ఫోక్స్‌వ్యాగన్ మోడల్. ఇది 150 హెచ్‌పీ పవర్‌తో 1.5 లీటర్ నాలుగు సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కూడా పొందుతుంది. అలాగే 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ డీసీటీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. మైలేజీ గురించి చెప్పాలంటే ఇది లీటరుకు 18.18 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial