Chandramukhi 2 Release Date Postponed: రజనీకాంత్ హీరోగా నటించిన ‘చంద్రముఖి' చిత్రం అప్పట్లో సంచనల విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలైన 18 ఏళ్లకు ఆ మూవీ సీక్వెల్ రూపొందుతోంది. ‘చంద్రముఖి 2’గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పి.వాసు  దర్శకత్వం వహిస్తున్నారు. లారెన్స్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ చంద్రముఖిగా కనిపించబోతోంది. తమిళ స్టార్ కమెడియన్ వడివేలు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.  


సినిమా విడుదల వాయిదాకు కారణం ఏంటంటే?


లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని, పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రం  వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ముందుగా ప్రచారం జరిగింది. అయితే, తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది.  సెప్టెంబర్ 28న విడుదల చేయాలని తాజాగా చిత్రబృందం నిర్ణయించింది. దీంతో ఈ హార్రర్-కామెడీ మూవీ ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, సినిమా విడుదల వాయిదాకు కారణాలు ఏంటనే దానిపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ సినిమాలో చాలా వరకు విజువల్ ఎఫెక్ట్స్ ఉండనున్నాయి. ప్రస్తుతం టెక్నికల్ టీమ్ విజువల్ ఎఫెక్ట్స్ కు మరిన్ని హంగులను అద్దుతోంది. ఇందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా సినిమా విడుదలను మేకర్స్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.






‘చంద్రముఖి 2’ మూవీ గురించి..


‘చంద్రముఖి 2’  పి వాసు దర్శకత్వంలో తెరకెక్కింది. రజనీకాంత్,  జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘చంద్రముఖి’ చిత్రానికి సీక్వెల్ గా వస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో తాజాగా మేకర్స్ ట్రైలర్ ను ఆవిష్కరించారు. ట్రైలర్ ఆశించిన స్థాయిలో లేనప్పటికీ, రజినీకాంత్ నటించిన హారర్ కామెడీ చిత్రానికి సీక్వెల్ కావడంతో 'చంద్రముఖి 2' పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఉప్పుటూరి, వెంక‌ట ర‌త్నం రిలీజ్ చేయనున్నారు.


సంచలన విజయాన్ని అందుకున్న ‘చంద్రముఖి’


2005లో విడుదలైన ‘చంద్రముఖి’ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక నటించారు. ఈ సినిమాలో చంద్రముఖిగా జ్యోతిక కనబర్చిన నటనకు అప్పట్లో ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యారు. గంగ అనే క్యారెక్టర్ లో చాలా అమాయకంగా కనిపస్తూనే చంద్రముఖి అనే భయానక పాత్రలో నటించి మెప్పించింది. చంద్రముఖిగా ఆమె డ్యాన్సును చూసి.. ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకున్నాయి.  అప్పట్లో రూ. 9 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.  


Read Also: సౌత్ బాటపడుతున్న బాలీవుడ్ స్టార్స్, విజయ్ దళపతి మూవీలో విలన్‌గా అమీర్ ఖాన్?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial