2023 Kia Seltos Facelift SUV Rivals: ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా తన కొత్త మిడ్-సైజ్ ఫేస్‌లిఫ్ట్ సెల్టోస్ SUV ధరలను ప్రకటించింది. భారతదేశంలో 2023 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 10.89 లక్షలుగా ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మూడు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. అవే టెక్ లైన్, జీటీ లైన్, ఎక్స్ లైన్. ఈ మూడు ట్రిమ్‌ల్లో కూడా చాలా వేరియంట్లు ఉన్నాయి.


హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి కార్లతో 2023 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ పోటీపడుతుంది. కొత్త కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్, దాని ప్రత్యర్థి కంపెనీలు అందిస్తున్న మిడ్ సైజ్ ఎస్‌యూవీల ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.


కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటాలతో పాటు...
కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా మాత్రమే ఇప్పుడు భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో వస్తున్న మిడ్ రేంజ్ ఎస్‌యూవీలు మాత్రమే. అదనంగా మారుతి సుజుకి గ్రాండ్ విటారా హైబ్రిడ్ ఆప్షన్‌ను కూడా పొందుతుంది. సెల్టోస్ ధర గురించి చెప్పాలంటే దీని ఎక్స్ షోరూమ్ రూ.10.89 లక్షల నుంచి రూ.19.99 లక్షల మధ్య ఉంది.


హ్యుందాయ్ క్రెటా ఎక్స్ షోరూం ధర రూ.10.87 లక్షల నుంచి రూ.18.35 లక్షల మధ్య, మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎక్స్ షోరూమ్ ధర రూ. 10.70 లక్షల నుంచి రూ. 19.95 లక్షల మధ్య ఉంటుంది. స్కోడా కుషాక్ కారును రూ. 11.59 లక్షల నుంచి రూ. 19.69 లక్షల మధ్య కొనుగోలు చేయవచ్చు. ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ధర రూ. 11.62 లక్షల నుంచి రూ. 19.46 లక్షల మధ్య మధ్య ఉంటుంది. ఇది ఎక్స్ షోరూం ధర.


ఎలివేట్ ఎస్‌యూవీ ధరను హోండా ఇంకా వెల్లడించలేదు. అయితే దీని ధర రూ. 11.49 లక్షల నుంచి రూ. 17.99 లక్షల మధ్య ఉండవచ్చు. ఇది కూడా ఎక్స్ షోరూమ్ ధరనే. 


2023 కియా సెల్టోస్ ఇంజన్ వివరాలు
కొత్త 2023 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ 113 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేసే 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చింది. 6-స్పీడ్ ఎంటీ, ఐవీటీ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది. ఇది కాకుండా 113 బీహెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేసే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ కూడా ఉంది. ఇది ఐఎంటీ, ఏటీ వేరియంట్లతో వస్తుంది.






Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial