Cars With Six Airbags Below Rs 15 Lakh: మనదేశంలో విక్రయించే కార్లకు ఆరు ఎయిర్ బ్యాగ్స్ కంపల్సరీగా ఉండాల్సిందేనని నిబంధనలు మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తక్కువ ధరలో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్న కార్లు కొన్ని ఉన్నాయి. రూ.15 లక్షలలోపు ధరలో ఆరు ఎయిర్ బ్యాగులు అందించే కార్లు ఇవే..


1. హ్యుండాయ్ ఐ20 (Hyundai i20)
ప్రస్తుతం ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్న కార్లలో అత్యంత చవకైనది ఇదే. హ్యుండాయ్ ఐ20లో ఆస్టా (ఓ) వేరియంట్‌లో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉండనున్నాయి. దీని ధర రూ.9.5 లక్షలుగా ఉండనుంది. ఇది ఐ20లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు. ఇందుల్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.


2. హ్యుండాయ్ వెన్యూ (Hyundai Venue)
ఇది ఒక సబ్‌కాంప్టాక్ ఎస్‌యూవీ. ఇందులో కూడా ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. వెన్యూలో ఎస్ఎక్స్ (ఓ) ట్రిమ్ వేరియంట్‌లో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. డీజిల్, పెట్రోల్ ఇంజిన్లు ఇందులో ఉన్నాయి. వీటితోపాటు టర్బో పెట్రోల్ వేరియంట్ కూడా ఉంది. దీని ధరను రూ.11.3 లక్షలుగా నిర్ణయించారు.


3. హ్యుండాయ్ వెర్నా (Hyundai Verna)
హ్యుండాయ్ వెర్నా ఒక మిడ్ సైజ్ సెడాన్. కానీ ఇందులో కూడా ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. వెర్నా ఎస్ఎక్స్ (ఓ) ట్రిమ్ వేరియంట్‌లో ఆరు ఎయిర్ బ్యాగ్స్ అందించారు. ఇందులో రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు ఉన్నాయి. దీని ధర రూ.11.1 లక్షల నుంచి ప్రారంభం కానుంది.


4. హోండా సిటీ (Honda City)
ఈ కొత్త తరం హోండా సిటీలో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇది టాప్ ఎండ్ ట్రిమ్ వేరియంట్. దీని ధర రూ.15 లక్షలలోపే ఉండనుంది. ఇందులో సిటీ వీఎక్స్ వేరియంట్‌లో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇందులో కూడా డీజిల్, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లో సీవీటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ కూడా ఉంది.


5. కియా సోనెట్ (Kia Sonet)
కియా సోనెట్ సబ్ కాంప్టాక్ ఎస్‌యూవీ కారు. అయినా ఇందులో కూడా ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. దీని జీటీఎక్స్+ ట్రిమ్ వేరియంట్‌లో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇందులో రెండు పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లు ఉండనున్నాయి. దీంతోపాటు టర్బో పెట్రోల్ వేరియంట్, డీజిల్ ఇంజిన్ కూడా ఉండనున్నాయి. దీని ధర రూ.12.3 లక్షల నుంచి ప్రారంభం కానుంది.


5. కియా కారెన్స్ (Kia Carens)
ఇందులో కూడా ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్న వేరియంట్ అందుబాటులో ఉంది. ఇందులో రెండు పెట్రోల్ ఇంజిన్లు, ఒక డీజిల్ ఇంజిన్ ఉండనుంది. ఆటోమేటిక్ ఆప్షన్లను కూడా ఇందులో కంపెనీ అందించింది. దీంతోపాటు ఇందులో 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా రానుంది.


6. ఎంజీ ఆస్టర్ (MG Astor)
ఎంజీ ఆస్టర్ షార్ప్ ట్రిమ్ వేరియంట్‌లో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉండనున్నాయి. ఇది ఒక కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఇందులో చాలా ఫీచర్లు ఉన్నాయి. దీని ధర మనదేశంలో రూ.14.28 లక్షల నుంచి ప్రారంభం కానుంది.


7. మహీంద్రా ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300)
ఇందులో ఏడు ఎయిర్ బ్యాగ్స్ అందించారు. ప్రస్తుతం అందుబాటులో అత్యంత సురక్షితమైన ఎస్‌యూవీల్లో ఇది కూడా ఒకటి. దీని డబ్ల్యూ8 (ఓ) ట్రిమ్ వేరియంట్‌లో ఈ ఫీచర్ ఉంది. దీంతోపాటు ఇందులో డ్రైవర్ నీ(knee) ఎయిర్ బ్యాగ్ కూడా ఉండటం విశేషం. దీని ధర రూ.12.85 లక్షల నుంచి ప్రారంభం కానుంది.


Also Read: Tata Altroz: రూ.8 లక్షల్లోపే టాటా కొత్త కారు, అల్ట్రోజ్‌లో కొత్త వేరియంట్ వచ్చేసింది!


Also Read: Skoda Kodiaq: ఈ సూపర్ హిట్ కారు అవుట్ ఆఫ్ స్టాక్.. 2022లో అస్సలు కొనలేరు!