సీఎం జగన్మోహన్ రెడ్డి నటనకు అబ్బుర పడిపోయి చిరంజీవి,  ప్రభాస్ లాంటి వాళ్లు కూడా దండాలు పెట్టేశారని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ( MP Ram Mohan Naidu ) సెటైర్ వేశారు. ఆకలి రాజ్యం సినిమాలో కమల్ హాసన్ లా పోరాడుతామని  ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చి .... తీరా స్వాతి ముత్యంలో కమల్ హాసన్ లా యాక్ట్ చేస్తుంటే  సినీ హీరోలు సైతం  దండం పెట్టేశారన్నారు. రాష్ట్రం లో జగన్ ని  ఏవరూ పోగిడే పరిస్థితి లేక .. పులకేశిలా   సమస్యలు సృష్టించి .. సినిమా వాళ్లని పిలిపించుకుని పొగిడించుకుంటున్నారని విమర్శించారు.  చిరంజీవి ( Chiranjeevi ) ఆత్మాభిమానం చంపుకుని జగన్ కి  దండంపెట్టలేదని .. జగన్ మాకంటే గోప్పనటుడుగా ఉన్నారనే  దండం పెట్టారని రామ్మోహన్ నాయుడు విశ్లేషించారు. వైజాగ్ కి  సినిమావారిని ఆహ్వానించింది చంద్రబాబు అయితే ..రామానాయుడు స్టూడియోలను సైతం లాక్కోనే ప్రయత్నం చేసింది జగన్ ( CM Jagan ) అని ఎంపీ గుర్తు చేశారు. 
 
మూడేళ్లుగా జగన్ చేస్తున్న పరిపాలనపై  ప్రజలకు మోజు పోయిందని... తీవ్ర వ్యతిరేకత వచ్చిదంన్నారు. ప్రజలు టీడీపీ ( TDP ) వైపు చూస్తున్నారని  ప్రజలనుండి వస్తున్న ఫిర్యాదులు స్వీకరించి పరిష్కార మార్గం వెతుకుతున్నామని రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.  నవరత్నాల మ్యాని ఫేస్టో ( YSRCP Manifesto ) అన్నారు .. ఆ నవరత్నాలు సైతం సక్రమంగా చేయడంలేదు .. అనేక మంది పెన్షన్ , రేషన్ కట్ చేస్తున్నారని విమర్శించారు. వాలంటీర్ , సచివాలయ వ్యవస్థలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయి... గ్రామ స్థాయిలో వ్యవస్థలు సరిగా పనిచేయడం లేదని  అందుకే అనేక మంది  సమస్యలతో ఫిర్యాదులు చేస్తున్నారని రామ్మోహన్ నాయుడు విశ్లేషించారు.  


పార్లమేంట్ సమావేశాల్లో ఓక్క వైఎస్ఆర్‌సీపీ ఎంపీ ( YSRCP MP )  కూడా గట్టిగా ప్రత్యేక హొదా అడగలేదని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. కేంద్రం సబ్ కమిటి వేసి ఏజేండాలో హోదా అంశం పెట్టారు ..పెట్టన వెంటనే వైసిపి ఏంపిలంతా ..మా పోరాటం అంటూ హడావిడి చేశారన్నారు.  ఎజెండాలో  తీసివేసినా ఓక్క వైఎస్ఆర్‌సీపీ  నేత కూడా కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని రామ్మోహన్  నాయుడు నిలదీశారు.  తెలంగాణా సిఎం కేసిఆర్ సైతం కేంద్రం పై ఎదురుతిరిగి  తమ రాష్ట్రానికి  అన్యాయం  జరుగుతుందని కేంద్రం పై పోరాడుతున్నారు ..కాని సిఎం జగన్ మాత్రం నోరు తెరవడం లేదని విమర్శించారు.   కేంద్రం పై వత్తిడి తేవడానికి  వైసిపి ఏంపిలు రాజీనామా చేస్తే టీడీపీ ఎంపీలు కూడా వెంటనే రాజీనామా చేస్తామని రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఈ సవాల్‌ను స్వీకరించాలన్నారు.