ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ( CM Jagan Reddy ) రాష్ట్రానికి సంబంధించి అత్యంత కీలకమైన అంశాలపై నోరు తెరవకపోవడం రాజకీయవర్గాలనే కాదు సామాన్య ప్రజలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని తెలంగాణ సీఎం కేసీఆర్ ( TS CM KCR ) ఏకంగా కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. కానీ ఏపీ సీఎం మాత్రం బడ్జెట్‌పై తన స్పందనను కనీస మాత్రంగా కూడా తెలియచేయలేదు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ( AP SPECIAL STATUS ) అంశాన్ని చర్చకు పెట్టి అంతలోనే కేంద్రం ( Center ) తొలగించింది. తామే తొలగింప చేశామని బీజేపీ నేతలు ప్రకటించుకుంటున్నారు. హోదాయోధునిగా గతంలో ప్రచారం పొందిన జగన్ ఇప్పుడూ స్పందించడం లేదు. దీంతో రాష్ట్ర ప్రయోజనాల అంశంలో సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా లేకపోతే కేంద్రంపై విమర్శలు చేస్తే మొదటికే మోసం వస్తుందని భయపడుతున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉంది.
హోదా అంశాన్ని ఎజెండాలో పెట్టి తీసేసిన కేంద్ర హోంశాఖ !
ఏపీకి ప్రత్యేకహోదా అంశం అత్యంత సున్నితమైనది. సీఎం జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంపై హోదా విషయంలోనే తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంతకు ముంచి ఉద్యమాలు చేశారు. తమకు తిరుగులేని మెజార్టీ ఇస్తే కేంద్రం మెడలు వంచిహోదా తీసుకు వస్తామని ప్రకటించారు. ప్రజలు దానికి తగ్గట్లుగానే ఎంపీలను ( YSRCP MPS ) ఇచ్చారు. రాష్ట్రంలోనూ తిరుగులేని మెజార్టీ ఇచ్చారు. అయితే దాదాపుగా మూడేళ్లవుతున్నా హోదా అంశంలో కనీస ముందడుగు లేదు. ప్రభుత్వం అడుగుతూనే ఉంటామంటోంది కానీ ఎప్పుడు అడిగినా హోదా ముగిసిన అధ్యాయమనే కేంద్రం చెబుతూ వస్తోంది. అయితే హఠాత్తుగా కేంద్ర హోంశాఖ ( Central Home Minister ) విభజన సమస్యల పరిష్కారంకోసం ఏర్పాటు చేసిన కమిటీ చర్చల్లో ప్రత్యేకహోదాను చేర్చడంతో ప్రజలకు ఆశలు కలిగాయి. వైఎస్ఆర్‌సీపీ కూడా తమ నాయకుడి పట్టుదల, పోరాటం కారణంగానే ప్రత్యేకహోదా కల సాకారం కాబోతోందని ప్రకటించింది. కానీ అంతలోనే ఆహోదాను చర్చల ఎజెండా నుంచి తొలగించారు.
నోరు మెదపని సీఎం జగన్ !
ప్రత్యేకహోదా అనేది ముగిసిన అధ్యాయమని తామే తొలగింపచేశామని బీజేపీ నేతలు ( AP BJP Leaders ) నిర్మోహమటంగా చెబుతున్నారు. జీవీఎల్ నరసింహారావు ఈ విషయంలో తాను నేరుగా కేంద్ర హోంశాఖను సంప్రదించి తొలగింప చేశానని ప్రకటించారు. అయితే వైఎస్ఆర్‌సీపీ నేతలు కేంద్రంపై నోరెత్తడం లేదు., తెలుగుదేశం పార్టీ ( TDP ) కుట్రచేసిందని.. బీజేపీ నేతలతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ రాజకీయ ఆరోపణల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు ఎలాంటి ఉపయోగం ఉండదని.. తక్,ణం కేంద్రంపై యుద్ధం ప్రకటించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. హోదా అంశాన్ని మళ్లీ చేరిస్తేనే చర్చలకు వస్తామని ప్రభుత్వం స్పష్టం చేయాలంటున్నారు. కానీ ప్రభుత్వంకానీ వైఎస్ఆర్‌సీపీ కానీ స్పందించడం లేదు. ఈ విషయంపై సీఎం జగన్ ఏమైనా ఫాలో అప్ చేస్తున్నారా లేదా అన్నదానిపైనా క్లారిటీ లేదు.
బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగినా స్పందించని సీఎం !
సీఎం జగన్ ఒక్క ప్రత్యేకహోదా విషయంలోనే కాదు బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపైనా ప్రశ్నించడానికి సిద్దంగా లేరు. ఆ అంశంపై ప్రెస్ మీట్ పెట్టలేదు. వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు. కానీ వారి మాటలకు విలువ ఉండటం లేదు. సీఎం జగన్ ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చే్యకపోవడమే దీనికి కారణం. ముఖ్యమంత్రి నోరు తెరిచి కేంద్రం అన్యాయంపై ప్రశ్నిస్తే ఎంపీల వాయిస్‌కు మరింత బలం వస్తుంది. కానీ ఇక్కడ సీఎం జగన్ ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోతూడటంతో ఎంపీల ఆందోళలనూ పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది.
కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడుతున్నారని పెరుగుతున్న విమర్శలు !
రాష్ట్రానికి ( Andhra Pradesh ) అన్యాయం జరుగుతున్నా సీఎం జగన్ ఎందుకు నోరు మెదపడం లేదనే దానిపై ఎవరికీ స్పష్టమైన కారణం లేదు. కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే అంతో ఇంతో మేలు జరుగుతుందని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆర్థికపరిస్థితి దృష్ట్యా కేంద్రం సహకారం ఎంతో అవసరం అంటున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు మాత్రం అక్రమాస్తుల కేసుల్లో రిలీఫ్ కోసం రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతున్నా జగన్ నోరెత్తడంలేదని మండిపడుతున్నారు. ఈడీ కేసుల ( Jagan ED Cases )విచారణను ఆలస్యం చేసుకోవాలనే హోదాను మరోసారి తాకట్టు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి వైఎస్ఆర్‌సీపీ నేతలు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. సీఎం జగన్ నోరు తెలిస్తే కానీ ఈ విమర్శలకు సరైన సమాధానం చెప్పినట్లుగా ఉండదు.