UP Election 2022: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ను నాశనం చేయడానికి రాహుల్, ప్రియాంక గాంధీ చాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉత్తర్‌ప్రదేశ్,ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన ఏఎన్ఐ వార్త సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. హిజాబ్ సహా పలు వివాదాస్పద అంశాలపై యోగి తనదైన స్టైల్‌లో స్పందించారు.
కాంగ్రెస్‌ను నాశనం చేయడానికి ఆ ఇద్దరు అన్నాచెల్లెళ్లు (రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ) చాలు. ఇంకెవరూ అక్కర్లేదు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు అక్కడికి వచ్చిన ప్రజలను నేను ఒక్కటే ప్రశ్న అడిగాను. బేకార్ కాంగ్రెస్‌కు మీరు ఎందుకు మద్దతిస్తున్నారు అని ప్రశ్నించాను. - యోగి ఆదిత్యనాథ్, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం
హిజాబ్‌పై
కర్ణాటకలో మొదలై దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపిన హిజాబ్ వివాదంపై యోగి ఆదిత్యనాథ్ తనదైన రీతిలో స్పందించారు.
ప్రధాని నరేంద్ర మోదీ.. ముమ్మారు తలాక్ చట్టాన్ని రద్దు చేశారు. దీని ద్వారా మా ముస్లిం కూతుళ్లకు వారి హక్కులు దక్కాయి. అంతేకాదు సమాజంలో వారు కోరుకుంటోన్న గౌరవం కూడా వచ్చింది. కనుక అందరూ గౌరవంగా బతకాలంటే.. వ్యవస్థ, పాలన రాజ్యాంగం చెప్పినట్లు నడవాలి.. షరియత్ చట్టాలు చెప్పినట్లు కాదు. - యోగి ఆదిత్యనాథ్, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం
వాళ్లు తినేశారు
ఉత్తర్‌ప్రదేశ్‌ను గతంలో పాలించిన సమాజ్‌వాదీ, బహుజన్‌సమాజ్ పార్టీలపైనా యోగి విమర్శనాస్త్రాలు సంధించారు.
సమాజ్‌వాదీ పాలనలో ప్రజలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని ఆ పార్టీ గూండాలే తినేశారు. మరోవైపు మాయావతి ఏనుగు(బీఎస్పీ ఎన్నికల చిహ్నం) పొట్ట చాలా పెద్దది. దానికి ఎంతైనా తక్కువే. - యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం
Also Read: UP Election 2022: 'ఆ పాలకులు యూపీని కొల్లగొట్టారు- అందుకే ప్రజలు వెళ్లగొట్టారు'