Nexon Tops The List Of Best Selling Cars: బలమైన కార్ల తయారీకి టాటా మోటార్స్ సరైన చిరునామా & భారతదేశంలోని ప్రసిద్ధ ఆటోమొబైల్ కంపెనీలలో ఇది ఒకటి. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన పాపులర్ కారు టాటా నెక్సాన్ గత నెలలో అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డు సృష్టించింది. జూన్ 2025లో ఇది ఫస్ట్ ప్లేస్ సాధించినా, విచిత్రంగా, జూన్ 2024లోని అమ్మకాల కంటే ఇప్పుడు తక్కువ యూనిట్లే అమ్మడయ్యాయి. అయినప్పటికీ, నెక్సాన్ తన పనిని అద్భుతంగా చేసింది & అత్యధికంగా అమ్ముడైన కారుగా తొలి స్థానం సాధించింది. టాటా బ్రాండ్‌లోని టియాగో & ఆల్ట్రోజ్ అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే కొద్దిగా పెరిగాయి.
టాటా కార్ల అమ్మకాల నివేదిక - జూన్ 2025
టాటా నెక్సాన్
- జూన్ 2025లో 11,602 యూనిట్ల అమ్మకాలతో, టాటా బ్రాండ్ కార్లలో, టాటా నెక్సాన్ అగ్రస్థానంలో నిలిచింది.
- అంటే, రోజుకు సగటున 387 మంది ఈ కారును కొన్నారు.
- గత నెలలో అమ్ముడైన 11,602 యూనిట్లు, జూన్ 2024 నాటి 12,066 యూనిట్ల కంటే కొంచెం తక్కువ.
- గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి అమ్మకాలు స్వల్పంగా 4% తగ్గాయి.
- అయినప్పటికీ, నెక్సాన్ ఇప్పటికీ టాటా బ్రాండ్‌లో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది.
టాటా పంచ్
- టాటా పంచ్ జూన్ 2025లో 10,446 యూనిట్ల సేల్స్‌తో రెండో స్థానంలో నిలిచింది.
- గత సంవత్సరం జూన్ 2024లో దీని అమ్మకాలు 18,238 యూనిట్లు.
- అంటే, ఈసారి ఏకంగా 43% తగ్గుదల కనిపించింది.
- ఈ క్షీణతను, మైక్రో SUV విభాగంలో పెద్ద ఎదురుదెబ్బగా పరిగణిస్తున్నారు.
టాటా టియాగో
- టియాగో జూన్ 2025లో మంచి రీఎంట్రీ ఇచ్చింది.
- గత నెలలో, ఈ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ 6,032 యూనిట్లు అమ్ముడయ్యాయి.
- ఇది గత సంవత్సరంలో రికార్డ్ అయిన 5,174 యూనిట్ల కంటే 17% ఎక్కువ.
- కస్టమర్లు ఇప్పుడు మళ్ళీ చిన్న కార్ల ట్రెండ్‌లోకి తిరిగి వస్తున్నారనడానికి ఇది మంచి సంకేతం.
టాటా ఆల్ట్రోస్
- ఆల్ట్రోజ్ అమ్మకాలు కూడా స్వల్పంగా పెరిగాయి.
- జూన్ 2025లో 3,974 యూనిట్లను విక్రయించింది, ఇది జూన్ 2024లో 3,937 యూనిట్ల నుండి 1% మాత్రమే పెరిగింది.
- ఈ ప్రసిద్ధ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ యొక్క స్థిరమైన అమ్మకాలు మార్కెట్లో దాని పట్టు బలంగా ఉందని చూపిస్తున్నాయి.
టాటా కర్వ్
- గత నెలలో, టాటా కొత్త SUV కర్వ్ 2,060 యూనిట్లు అమ్ముడయ్యాయి.
- ఈ సంఖ్య మే 2025లో 3,063 యూనిట్ల కంటే 33% నెలవారీ తగ్గుదలను సూచిస్తుంది.
- కానీ ఇది కొత్త కారుకు సంతృప్తికరమైన ప్రారంభంగానే పరిగణిస్తున్నారు.
జూన్ 2025లో సఫారీ, హారియర్ & టిగోర్ వరుసగా 922, 1,259 & 788 యూనిట్లను విక్రయించాయి. ఈ మోడళ్లను కూడా కలిపితే, టాటా మోటార్స్ గత నెలలో మొత్తం 37,083 యూనిట్లను విక్రయించింది. జూన్ 2024లో అమ్ముడైన 43,527 యూనిట్ల కంటే ఈ సంఖ్య దాదాపు 15% తక్కువ.