Discount On BYD Seal: చైనీస్ కార్ తయారీదారు బీవైడీ తన వాహనాలపై తగ్గింపు అందిస్తున్నారు. బీవైడీ సీల్ ఈవీపై రూ.2.5 లక్షల విలువైన ప్రయోజనాలు అందజేస్తున్నారు. బీవైడీ సీల్ కారు మార్కెట్‌లో డైనమిక్, ప్రీమియం, పెర్ఫార్మెన్స్ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ మూడు వేరియంట్‌లతో పాటు దాని ఎలక్ట్రిక్ మోడల్‌పై క్యాష్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది.
బీవైడీ సీల్‌పై తగ్గింపు ఆఫర్
బీవైడీ సీల్‌పై రూ.రెండు లక్షల వరకు నగదు రాయితీ ఇస్తోంది. ముఖ్యంగా దీని ప్రీమియం వేరియంట్‌పై రూ.50,000 క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అదే సమయంలో ఈ పండుగ సీజన్‌లో బీవైడీ సీల్ టాప్-స్పెక్ పెర్ఫార్మెన్స్ వేరియంట్ ధర రూ. రెండు లక్షలు తగ్గనుంది. బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ సెడాన్‌పై కూడా గొప్ప ప్రయోజనాలు ఇస్తున్నారు. ఈ వాహనాలపై రూ.50,000 వరకు మెయింటెయిన్స్ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే
బీవైడీ సీల్ పెర్ఫార్మెన్స్
బీవైడీ సీల్ అప్‌డేటెడ్ మోడల్ 800వీ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడింది. దీంతో ఈ వాహనం పనితీరు మరింత మెరుగు అయింది. ఈ వాహనం టాప్ ఎండ్ వేరియంట్ కేవలం 3.8 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని లగ్జరీ ఆటోమేకర్ పేర్కొంది. ఈ బీవైడీ కారు గరిష్ట వేగం గంటకు 240 కిలోమీటర్లుగా ఉంది. ఈ కారు రెండు బ్యాటరీల కెపాసిటీతో వస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్‌తో ఈ కారు 510 కిలోమీటర్ల నుంచి 650 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది.
బీవైడీ సీల్ ధర
బీవైడీ సీల్ డైనమిక్ వేరియంట్ ఒకే ఛార్జింగ్‌లో 510 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ వేరియంట్ రియర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది. ఆఫర్ కాకుండా ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.41 లక్షలుగా ఉంది. దీని ప్రీమియం వేరియంట్ 650 కిలోమీటర్లుగా ఉంది. ఈ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.45.55 లక్షలుగా నిర్ణయించారు. బీవైడీ సీల్ పెర్ఫార్మెన్స్ వేరియంట్ సింగిల్ ఛార్జింగ్‌తో 580 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ మోడల్ ఆల్ వీల్ డ్రైవ్ ఫంక్షన్‌తో వస్తుంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.53 లక్షలుగా ఉంది.
Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?