BYD vs Tesla EV Sale: అమెరికన్ అగ్ర ఈవీ కంపెనీ టెస్లా అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తున్నట్లుగా ఉన్న తన మొదటి స్థానాన్ని కోల్పోయింది. ఇప్పుడు దీన్ని చైనాకు చెందిన బీవైడీ సంస్థ స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఈవీ విక్రయాల పరంగా బీవైీ ముందంజ వేసింది.


టెస్లా విడుదల చేసిన అమ్మకాల డేటా ప్రకారం 2023 నాలుగో త్రైమాసికంలో కంపెనీ 4,84,507 యూనిట్లను విక్రయించింది. ఇది అంతకు ముందు త్రైమాసిక అమ్మకాల కంటే 11 శాతం ఎక్కువ. కానీ అదే కాలానికి చైనాకు చెందిన బీవైడీ ఏకంగా 5,26,409 యూనిట్లను విక్రయించింది. దీంతో టెస్లా రెండో స్థానానికి పడిపోయింది. అమ్మకాల పరంగా మాత్రమే కాకుండా ఈవీ ఉత్పత్తి పరంగా కూడా బీవైడీ కంటే టెస్లా వెనుకబడి ఉంది. టెస్లా 2024లో మరింత ఎక్కువ ప్రత్యర్థి కంపెనీలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది అతి పెద్ద సవాల్‌గా నిలవనుంది.


బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్స్) కంపెనీ ఈవీల విభాగంలో చైనా, యూరప్‌ల్లో టెస్లాకు గట్టి పోటీనిస్తుంది. చైనా ప్రభుత్వం సపోర్ట్ బీవైడీకి ఉండటం వారికి పెద్ద ప్లస్ పాయింట్. ఇది వారి దేశీయ మార్కెట్లో చాలా సహాయాన్ని అందిస్తుంది. బీవైడీ ఇంతవరకు అమెరికాలో తన విక్రయాలను ప్రారంభించలేదు. భారతదేశంలో కూడా ఈ కంపెనీకు సంబంధించిన కార్లు రోడ్ల మీద చూడవచ్చు.


వార్షిక విక్రయాల్లో టెస్లానే టాప్
గత త్రైమాసికంలో బీవైడీ కంటే వెనుకబడినప్పటికీ టెస్లా వార్షిక విక్రయాలలో ముందుంది. 2023 డిసెంబర్ నాటికి 1.8 మిలియన్ కార్లను విక్రయించింది. ఇది 2022 కంటే 38 శాతం ఎక్కువ. అయితే 2023లో బీవైడీ ఈవీ వార్షిక అమ్మకాల సంఖ్య దాదాపు 1.6 మిలియన్లుగా ఉంది.


భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఈవీలకు మంచి డిమాండ్ పెరుగుతోంది. ఇది గ్రీన్ ఎనర్జీగా మంచి ఆప్షన్‌గా కనిపిస్తుంది. అయితే దీనితో పాటు ఈ విభాగంలో పోటీ కూడా పెరుగుతోంది. కొత్త ప్లేయర్స్ కూడా ఈ విభాగంలో అడుగుపెడుతున్నారు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!