Naga Panchami Today Episode: పంచమిని వెతుక్కుంటూ నాగ సాధువు దగ్గరకు వచ్చిన మోక్ష పంచమి కనిపించకపోవడంతో తనకు ఏ దిక్కు తోచక మీరు గుర్తొచ్చి వెంటనే మీ దగ్గరకు వచ్చానని నాగసాధువుకు చెప్తాడు. పంచమి గురించి మీకు బాగా తెలుసు తాను ఇప్పుడు ఎక్కడుందో చెప్తే నాకు మీరు చాలా సాయం చేసిన వాళ్లు అవుతారని అంటాడు. 


నాగసాధువు: పంచమి శివయ్య వరప్రసాదం.. అందుకే శివుడి కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి మీద అంత ప్రేమ పుట్టి ఉంటుంది. తనకు సుబ్రహ్మణ్య స్వామి అంటే ఎనలేని భక్తి. చిన్న కష్టం వచ్చినా ఆ స్వామికే చెప్పుకుంటుంది. 
మోక్ష: పంచమి ఎప్పుడు వెళ్లే ఆ స్వామి గుడి దగ్గరకు కూడా వెళ్లి వెతికాను. 
నాగసాధువు: ఇక్కడికి దగ్గర్లో ఆ స్వామి తపస్సు చేసుకొని అక్కడే వెలశారు. అక్కడికి పంచమి వెళ్తుంటుంది. ఇప్పుడు కూడా అక్కడికే వెళ్లుంటుందని నా మనసుకు తోస్తుంది. ఆ స్వామే నీకు దారి చూపిస్తారు ఇలా వెళ్లు.


పంచమి: నువ్వు తోడు ఉన్నప్పుడు నాకు ఏ కష్టం వచ్చినా నీకు చెప్పుకునేదాన్న సుబ్బు.
సుబ్బు: ఇప్పుడు కూడా రోజూ చెప్పుకుంటూనే ఉన్నావ్ కదా పంచమి. పంచమి షాక్ అయి చూస్తే.. నువ్వు రోజూ గుడికి వెళ్లి ఆ స్వామికి నీ కష్టం చెప్పుకుంటావు కదా పంచమి.
పంచమి: నీకు ఎలా తెలుసు సుబ్బు.
సుబ్బు: నాకు చెప్పుకున్నా ఆ స్వామికి చెప్పుకున్నా ఒక్కటే.
పంచమి: నువ్వు తోడు ఉంటే నాకు చాలా బాగుంటుంది సుబ్బు. ఇప్పుడు నువ్వు నాతో వస్తే బాగున్ను. సుబ్బు ఏం ఆలోచిస్తున్నావ్.. 
సుబ్బు: మోక్ష పంచమిని పిలవడం గుర్తించి.. నువ్వు మీ ఇంటికి వెళ్లడానికి ఇక నీకు నా తోడు అవసరం లేదు పంచమి. నేను ఇటు నుంచే మా ఇంటికి వెళ్లిపోతా. నీ కోసం మోక్ష.. మోక్ష కోసం నువ్వు ఏం చేయడానికి అయినా సిద్ధపడుతున్నారు. కానీ ఇద్దరు కలిసి మాత్రం ఏ ప్రయత్నం చేయరు. మీ ఇద్దరినీ నేను చూశాను కదా పంచమి. పైగా మీ కథ అంతా నాకు చెప్పావు అందుకే చెప్తున్నా మోక్ష ప్రాణాలతో ఉండాలని అందుకోసం నువ్వు ఏం చేయడానికి సిద్ధం. ఇక మోక్ష కూడా అంతే.. ఇద్దరూ కలిసి ప్రయాణం మొదలు పెట్టారు. చివరి వరకు కలిసే ఉండాలి అనుకోవాలి కానీ ఒకరి కోసం మరొకరు త్యాగాలు చేస్తే మీకు మీరే విడిపోయినట్లు కదా.. సరే పంచమి ఇక నేను వెళ్తాను. 


మరోవైపు పంచమిని వెతుక్కుంటూ వచ్చిన మోక్ష పంచమిని చూస్తాడు. పంచమి అని పిలిచి పంచమి దగ్గరకు వస్తాడు. ఇద్దరూ ప్రేమతో కౌగిలించుకుంటారు. ఇక పంచమిని కొట్టినందుకు మోక్ష క్షమాపణ చెప్తాడు. ఇక పంచమి మాటకు తాను ఎదురు చెప్పను అని మాటిస్తాడు. ఒకరికోసం ఒకరు త్యాగాలు మాని చివరి వరకు కలిసే ఉందాం అంటాడు. అదంతా చూసిన సుబ్బు సంతోషిస్తాడు.   


మేఘన: యువరాణి ఆచూకి తెలిసిందా ఫణేంద్ర. 
ఫణేంద్ర: లేదు మేఘన అంతా వెతికాను ఎక్కడా తన ఆచూకి తెలీడం లేదు. ఎక్కడైనా బలమైన దైవశక్తి రక్షణలో ఉంటే తప్ప ఇంకెక్కడున్నా నా శక్తులతో పసిగట్టగలను. 
మేఘన: ఎక్కడున్నా ప్రాణాలతో ఉంటే పర్లేదు.. లేకపోతేనే కష్టం. 
ఫణేంద్ర: నీకేం పర్లేదు మేఘన కానీ నేనే నాగదేవతకు సమాధానం చెప్పుకోలేను. పంచమి త్వరగా వస్తే పర్లేదు మేఘన కానీ ఈ విషయం నాగదేవతకు తెలిస్తే.. నాకు ఎలా శక్తులు ఉండకూడదు అని శపించినా ఆశ్చర్యం లేదు.


ఇక ఫణేంద్రతో మాట్లాడి మేఘన వెళ్లిపోయిన తర్వాత ఫణేంద్ర అక్కడ ఉండగా.. జ్వాల చూస్తుంది. ఎవరని ప్రశ్నిస్తుంది. ఫణేంద్ర సమాధానం చెప్పకుండా పాములా మారిపోతాడు. దాంతో జ్వాల గట్టిగా అరుస్తూ ఇంట్లోకి వెళ్తుంది. అందరూ వస్తారు. ఇక ఇంట్లో వాళ్లకి ఫణేంద్ర మనిషి కాదు పాము అని చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. ఎవరూ నమ్మరు. జ్వాల మనిషి పాముగా మారడం స్వయానా చూశాను అని గట్టిగా చెప్తుంది. అయితే చిత్ర తాను నమ్ముతాను అని అంటుంది. ఇంట్లో జరిగిన సంఘటనలు గుర్తుచేస్తుంది. ఇక ఫణేంద్ర వల్ల పంచమి విషయం కూడా బయటపడుతుంది అని కంగారు పడుతుంది. ఇక ఆ సంభాషణ అంతా ఫణేంద్ర పాములా మారి వింటుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.