Sathyabhama Serial today episode


క్రిష్‌ సత్యభామ పేరు తెలుసుకోవడానికి తిప్పలు పడుతుంటాడు. సత్యభామ రాసిన కంప్లైంట్ పేపర్‌ పట్టుకొని అందులోని సత్యభామ సంతకం అర్థంకాక తలపట్టుకుంటాడు. ఇక క్రిష్‌ ఫ్రెండ్ బాబీ ఏకంగా ఓ మెడికల్ షాపులో పనిచేసే వాడిని తీసుకువచ్చి అదేంటో చెప్పమని అడుగుతాడు. వాడు సత్యభామ పేరు చెప్పలేకపోతాడు. దీంతో క్రిష్‌  బాబీని ఒక్కటిస్తాడు. 


మరోవైపు సత్య వాళ్లు భోజనాలకు ఏర్పాట్లు చేస్తారు. ఇక సత్య నానమ్మని పిలిచే ధైర్యం లేదని ఆమెను మీరే పిలవండి అని సత్యభామ తల్లి విశ్వానికి చెప్తుంది. ఆయన వెళ్లి తన తల్లిని పిలుస్తాడు. దీంతో బామ్మ తన మాటకు విలువ ఇవ్వరని కసుబుసులాడుతుంది. సత్య వచ్చి చెప్పినా బామ్మ వినదు. సత్యకు వెంటనే పెళ్ల చేసి పంపిస్తేనే తాను తింటాను అని చెప్తుంది. ఇక నాన్ వెజ్ వండలేదు అని రుద్ర ఇంట్లో అతని తండ్రి మహదేవయ్య, కూతురు నందిని రచ్చ రచ్చ చేస్తారు. ఇక రేణుక నందినికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది. రేపు పెళ్లి అయిన తర్వాత అత్తారింట్లో ఇలానే చేస్తావా అని అడుగుతుంది. దీంతో రుద్ర భార్య మీద ఫైర్ అవుతాడు. 


విశాలాక్షి: ఏవండీ అత్తయ్య మందులు వేసుకోవాలి.. మందులు వేసుకోవాలి అంటే భోజనం చేయాలి. ఒక్క పూట మానేసినా తెల్లవారి లేవరు అన్న సంగతి మీకు తెలుసు. మరి ఎందుకు ఏమనకుండా వచ్చారు. ఆవిడ తినకున్నా పర్లేదు అని మనం అనుకున్నట్లే కదా.
విశ్వనాథం: అమ్మ తినకపోయినా పర్లేదు అని మనం ఎందుకు అనుకుంటాం విశాల. కానీ జరిగిన సంఘటనలన్నీంటికి అమ్మ బాగా బెదిరిపోయింది. అందుకే సత్యకు పెళ్లి చేయమని మొండి పట్టు పట్టింది. మాటిస్తే కానీ వినేలా లేదు.. లేచి తినేలా లేదు. 
విశాలాక్షి: ఆవిడ భయం అర్థమవుతుంది. మీ బాధ్యత అర్థమవుతుంది. కానీ నేను ఇప్పుడు కోడలిగా మాట్లాడనా.. భార్యగా మాట్లాడనా.. లేక తల్లిగా మాట్లాడనా.. ఏం చేయాలో నాకే అర్థంకావడం లేదు. అలా అని పిల్లల్ని ఇబ్బంది పెట్టలేక అన్ని విని అలాగే ఊరుకున్నాను.
విశ్వనాథం: మా అమ్మ అన్నదాంట్లో అర్థముంది అందుకే ఏం మాట్లాడలేకపోతున్నాను. మన మంచి కోసమే చెప్తున్నదని తెలుసు. మన మీద ప్రేమతోనే చెప్తుంది అనీ తెలుసు. సత్య నోరు తెరచి తనకు ఓ ఆశయం ఉందని అనుకున్నది సాధించాలి అని అడిగితే కాదు అనలేకపోయాను. ఇప్పుడు సత్య తను అనుకున్నది సాధించకముందే తన ఆశల్ని చిదిమేస్తే.. ఎంత బాధ పడుతుంది. ఎవడో వచ్చి బెదిరించాడు అని హడావుడిగా పెళ్లి చేసేస్తే సత్య అనుకున్నది ఏదీ సాధించలేదు. మనం ఇప్పుడు సత్య చేతులు కట్టేస్తే జీవితాంతం ఆ బాధను తాను అనుభవించాల్సిందేనా.. 
సత్యభామ: దూరం నుంచి తల్లిదండ్రుల మాటలు విని.. నా వల్ల ఇంట్లో ఎవరికీ మనస్శాంతి లేకుండా పోతుంది. ఇంత మందిని బాధ పెట్టి నేను అనుకున్నది సాధిస్తే అది నాకు బాధనే తప్ప ఆనందాన్ని ఇవ్వదు. ఈ సమస్యలన్నింటికీ నేను ఈ ఇంట్లో ఉండటమే కారణం అయితే నేను పెళ్లి చేసుకొని వెళ్లిపోవడమే మంచిది. కనీసం నా కుటుంబం అయినా సంతోషంగా ఉంటుంది. ఎస్ నా వాళ్ల సంతోషం కోసం నేనే నా నిర్ణయాన్ని మార్చుకుంటాను. 


ఇక సత్యభామ ప్లేట్‌లో భోజనం పట్టుకొని తన నానమ్మ దగ్గరకు వెళ్లి తినమని చెప్తుంది. బామ్మ వద్దు అంటే పెళ్లి చేసుకుంటా అన్నా తినవా అని అడుగుతుంది. దీంతో బామ్మ లేచి నిజమేనా.. అని అడిగి భోజనం అందుకుంటుంది. ఇక సత్య అయితే నువ్వు కోరుకున్నట్లే నేను పెళ్లి చేసుకొని నీ భారం అంతా దించేస్తా అని పెళ్లికి ఒకే చెప్తుంది. తనకు తన గోల్స్ కంటే తన ఫ్యామిలీనే ముఖ్యం అని సత్య చెప్తుంది. దీంతో ఇంట్లో అందరూ చాలా సంతోషిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: మహేష్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్, నటుడిగా వేణు స్వామి ఫ్లాప్ షో - అందుకే, ఇండస్ట్రీ మీద పడ్డారా?