Krishna Mukunda Murari Today Episode
మురారి ఈ కేసు ఇప్పుడే క్లోజ్ చేసేస్తా ఇప్పుడే క్రైం జరిగిన ప్లేస్‌కి వెళ్తా అని అంటే భవాని అడ్డుకుంటుంది. ఏ క్రైం జరిగినా ముందు అనుమానితుల్ని అదుపులోకి తీసుకోవాలని అని ఇక్కడ అందరూ ఆ లారీ డ్రైవర్‌ని అనుమానిస్తున్నారు అని అంటుంది. అందుకు నువ్వు అతని దగ్గరకు వెళ్లి విచారించాలి కానీ స్పాట్‌కి వెళ్లి ఏం చేస్తావు అని ప్రశ్నిస్తుంది.
మురారి: నాకు మీరు అనుకున్నట్లు.. మీరు అంటున్నట్లు పెద్దపల్లి ప్రభాకర్ మీద అస్సలు అనుమానం లేదు. పైగా ఆయన చేయడు అనే నమ్మకం కూడా ఉంది. అదే నిజంకూడా.. మీరే అన్నారు కదా అనుమానితుల్ని అదుపులోకి తీసుకోవాలి అని ఆ అనుమానం కలగాల్సింది మీకు కాదు నాకు. అదే పోలీసులకు.
మధు: మనసులో బ్రో నువ్వు కేక బ్రో ఇరగదీశావ్..
మురారి: సారీ పెద్దమ్మ రెండు రోజుల్లో నా భార్యని కాదని వేరే వాళ్లని పెళ్లి చేసుకోవాలి అని నాకు ఇంకా గుర్తుంది. గుర్తుండి కూడా ఇలా మాట్లాడుతున్నాను అంటే దయచేసి అర్థం చేసుకోండి.
భవాని: ఓకే మురారి అదే మాట మీద అదే నమ్మకంతో వెళ్లు.
మురారి: నేను ఏమో ఎవరి హెల్ప్ తీసుకున్నా వారికి ఏమవుతుందా అనే భయంలో ఉన్నాను. పాపం మనకోసం వెళ్లిన దేవ్ తలపగలగొట్టారు. ఇంకా కొంచెం ఉంటే చంపేసేవారు అన్నాడు.
కృష్ణ: మనసులో.. ముకుంద గురించి చెప్తే.. చెప్తా కాకపోతే ఎవరికీ అడగొద్దు అని చెప్తా.. ఏసీపీ సార్ నాకు ఒక డౌట్ ఉంది. కానీ మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. నేను చెప్పింది మన ఇద్దరి మధ్యే ఉండాలి. నాకు ముకుంద మీద అనుమానంగా ఉంది ఏసీపీ సార్.
మురారి: అదేంటి అంత మాట అనేశావ్.. నిజమా..
కృష్ణ: నిజమా కాదా అనేది పక్కన పెడితే నేను అనుమానించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి చెప్తా వినండి అని గతంలో తనకి అనుమానం వచ్చిన సంఘటనలు చెప్తుంది. లేకపోతే అవతలి వారికి దేవ్ అన్నయ్య మన మనిషి అని ఎవరికి తెలుస్తుంది.
మురారి: సొంత అన్నయ్యని ఎవరు అయినా అలా చేస్తారా.. ఇక తన టెన్షన్ అంటావా ఎక్కడ నువ్వు నిర్దోశి అని తేలిపోతే తన పెళ్లి ఆగిపోతుందేమో అని టెన్షన్ పడుతుంది. అంతే.. సరే పద పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చింది చూద్దాం అక్కడ ఏమైనా క్లూ దొరకొచ్చు.
ఇక కృష్ణ తన చిన్నాన్నతో మాట్లాడాలి అని మురారితో చెప్పి జైలర్‌కి కాల్ చేయమని చెప్తుంది. మురారి జైలర్‌కి కాల్ చేసి ప్రభాకర్‌కి ఫోన్ ఇమ్మని చెప్తాడు. కృష్ణ మాట్లాడి తర్వాత మురారి మాట్లాడి జాగ్రత్తలు చెప్తాడు.
భవాని: ఒంటరిగా.. ఎంత దుర్మార్గుడీ ప్రభాకర్ అమాయకుడైన ఆర్టిస్ట్‌ని చంపించాడు అంటే అతను ఎంత కిరాతకుడు అయిండాలి.
రేవతి: అక్కా నాకు ఎందుకో భయంగా ఉంది అక్కా. ఎన్నడూ లేదని ఈ హత్యలు ఏంటీ ఈ కుట్రలు ఏంటీ..
భవాని: వీటికి ముందు ఓ భారీ కుట్ర జరిగింది అది మర్చిపోయావా రేవతి. మన మురారికి యాక్సిడెంట్ చేసి రూపం మార్చే కుట్రతో పోల్చితే ఇది చాలా చిన్నది. దీని అంతటికి కారణం ఎవరూ అనేది నీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది.
రేవతి: లేదు అక్క. ఆ ప్రభాకర్ ఇలాంటి దారుణాలు చేసే మనిషి కాదు అనిపిస్తుంది. మీరు ఏమీ అనుకోను అంటే ఒక మాట. నాకు ఎందుకో ఇవన్నీ ముకుంద మనుషులు చేస్తున్నారు అనిపిస్తుంది.
భవాని: గుడ్ రేవతి. బాగుంది నేను కృష్ణ మనుషులు అంటుంటే నువ్వు ముకుంద మనుషులు అంటున్నావ్ నాకు రివర్స్‌లో వస్తున్నావా.
రేవతి: అది కాదు అక్క. ప్రభాకర్‌కు శ్రీధర్‌ని చంపాల్సిన అవసరం ఏమోస్తుంది. ఆయన కోరుకునేది కృష్ణ, మురారి కలిసి ఉండాలి అనేకదా..
భవాని: అదే రేవతి తనే అన్నది భయటపడితే అప్పుడు తన జీవితంతో పాటు తన కూతురు జీవితం కూడా పాడవుతుందని.. అదే శ్రీధర్‌ని చంపేస్తే కృష్ణ మనింట్లో కనీసం పనిమనిషిగా అయినా ఉంటుంది అనుకున్నాడు. ఇదే నిజం రేవతి వెళ్లు. త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయి.
కానిస్టేబుల్ పోస్ట్‌మార్టం రిపోర్టులు తీసుకొని వచ్చి మురారికి ఇస్తాడు. కృష్ణ, మురారిలు ఆ ఫొటోలు రిపోర్ట్‌లు చూస్తారు. ఓ ఫొటో దగ్గర శ్రీధర్ చెంప మీద మార్క్ చూస్తుంది కృష్ణ. దాన్ని మురారికి చెప్తుంది.
మురారి: శ్రీధర్‌ని పిడికిలి బిగించి కొడితే వాడి ఉంగరానికి ఉన్న ముద్ర అక్కడ పడింది. అదే ఈ ముద్ర.
కృష్ణ: పాపం కదా ఏసీపీ సార్.. ఆయన ఎంత బాధ అనుభవించాడో..
మురారి: వాడిని మాత్రం వదలకూడదు. ఇంతలో మురారికి ఫోన్ వస్తుంది. ముకుంద అకౌంట్‌లో రెండు లక్షల రూపాయలు క్రెడిట్ అయ్యాయని.. ఆ ఫోన్ నెంబరు ద్వారా ఎంక్వైరీ చేస్తే అది కాశ్మీర్ నెంబరు అంట అని మురారి కృష్ణకు చెప్తాడు.
కృష్ణ: కాశ్మీర్ నెంబరు అక్కడ ఎవరు ఉన్నారు. కాశ్మీర్ అంటే మనకు తెలిసి ఆదర్శ్..
మురారి: నో వాడు కాదు.. ఎవరో మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ వేలుకి ఉన్న ఉంగరం ఎవరిదో తేల్చాలి. పద వెళ్దాం.
దేవ్: ముకుంద ఎందుకు ఏడుస్తున్నావ్.. ఇప్పుడు ఏం అయింది.
ముకుంద: ఏమవుతుందో అని భయమేస్తుంది అన్నయ్య.
దేవ్: ఏం కాదు అన్నయ్య నేను దొరికిపోను. ఎందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నావ్.
ముకుంద: నేను ఉద్యోగం కోసమో.. ఇంకా దేని కోసమో లాగా నీ చేత ఒకలా.. అత్తయ్య చేత మరో రకంగా ఇన్ఫులియన్స్ చేస్తున్నాను. ప్రేమ, పెళ్లి, వ్యవహారం మేము ఇద్దరం తేల్చుకోవాలి కానీ మురారితో మాట్లాడకుండా ఇలా వెనక ఉండి నడిపిస్తుంటే టెన్షన్ కలుగుతుంది.
దేవ్: మరి మురారికి ఇష్టం లేకపోతే ఇలానే చేయాలి. ఎలాగోలా పెళ్లి చేసే బాధ్యత నాది ప్రామిస్. నా ఫోన్ నెంబరు కూడా కాశ్మీర్‌ది. దాన్ని ట్రేస్ చేసినా కాశ్మీర్ నెంబరు అనే వస్తుంది. టెన్షన్ పడకు.
కృష్ణ: ఆ ఉంగరం ఎవరిదై ఉంటుంది. ముకుంద పెళ్లి చేయాలి అనే పట్టుదల ఎవరికి ఉంటుంది. ఏసీపీ సార్ ముకుందతో మీ పెళ్లి చేయాలి అని అంత బలంగా కోరుకున్నది పెద్దత్తయ్య మాత్రమే కదా.. పెద్దత్తయ్య కాకుండా ఇంకా ఎవరు ఉన్నారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Read Also: ‘హనుమాన్’ను రిలీజ్ ఎందుకు వాయిదా వేయలేదంటే? అసలు విషయం చెప్పిన ప్రశాంత్ వర్మ