Under Budget Cars With Luxury Look: భారతదేశంలో మధ్యతరగతి ప్రజలకు లగ్జరీ కారును కొనుగోలు చేయడం అనేది ఆలోచనల్లోకి కూడా రాదు. ఎందుకంటే ఈ కార్ల ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ ధరకు ఎక్కువ మైలేజీనిచ్చే కార్లను ప్రజలు ఇష్టపడతారు. తక్కువ ధరకే లగ్జరీ లుక్‌ని, మంచి మైలేజీని కూడా ఇచ్చే కార్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం...


మారుతి సుజుకి బలెనో (Maruti Suzuki Baleno)
వీటిలో మొదటి కారు మారుతి సుజుకి బలెనో. ఈ కారు మీకు సౌకర్యవంతమైన సీట్లతో లగ్జరీ లుక్‌ను అందిస్తుంది. మారుతి బలెనోలో హెడ్-అప్ డిస్‌ప్లే ఉంది. ఈ కారులో 22.86 సెంటీమీటర్ల హెచ్‌డీ స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ ఫీచర్ కూడా ఉంది. దీంతో పాటు కారును సరిగ్గా పార్క్ చేయడానికి 360 డిగ్రీ వ్యూ కెమెరా ఫీచర్ కూడా అందించారు. ప్రజల భద్రత కోసం కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను కూడా ఏర్పాటు చేశారు.


ఈ కారు ఏడు కలర్ వేరియంట్లలో మార్కెట్లో లభ్యమవుతోంది. మారుతి బలెనో డెల్టా సీఎన్‌జీ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.8.40 లక్షలుగా ఉంది. అదే సమయంలో మారుతి బలెనో జీటా సీఎన్‌జీ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.9.33 లక్షలుగా ఉంది.


హోండా ఎలివేట్ (Honda Elevate)
రెండో కారు హోండా ఎలివేట్. ఇందులో 1.5-లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఇది 119 బీహెచ్‌పీ పవర్‌ని, 145 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎస్‌యూవీ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, టూ టోన్ డైమండ్ కట్ 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఏడు అంగుళాల హెచ్‌డీ ఫుల్ కలర్ టీఎఫ్‌టీ క్లస్టర్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హోండా సెన్సింగ్ సూట్ వంటి ఫీచర్లతో వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 11.91 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇందులో మీరు సౌకర్యవంతమైన సీట్లతో పాటు ప్రీమియం డిజైన్ కూడా పొందుతారు.


Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి


హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta)
హ్యుందాయ్ ఈ కారు అప్‌డేటెడ్ వెర్షన్‌ను 2024 జనవరి నెల ప్రారంభంలో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు మూడు 1.5 లీటర్ ఇంజన్ వేరియంట్‌లతో మార్కెట్లో అందుబాటులో ఉంది. నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి.


అప్‌డేటెడ్ క్రెటా 6 స్పీడ్ మాన్యువల్, ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (IVT), 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT), 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో మార్కెట్లోకి వచ్చింది. హ్యుందాయ్ క్రెటా ఎక్స్ షోరూమ్ ధర రూ. 13.24 లక్షల నుంచి మొదలై రూ. 24.37 లక్షల వరకు ఉంది.


టాటా నెక్సాన్ (Tata Nexon)
టాటా మోటార్స్ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటైన నెక్సాన్ మీకు చాలా ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. ఈ కారులో కంపెనీ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. దీని ఇంజన్ గరిష్టంగా 120 బీహెచ్‌పీ పవర్‌తో 170 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.


ఇది 10.25 అంగుళాల డిజిటల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 8.15 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టాప్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 15.80 లక్షల వరకు ఉంది.


Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్‌ వెర్షన్‌ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్