BSA Gold Star Launch Soon In India: దేశీయ మార్కెట్లో రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థకు గట్టి పోటీ ఎదురుకాబోతోందా? రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులను తలదన్నే మోటార్ సైకిళ్లు విడుదల కాబోతున్నాయా? అవును.. అనే సమాధానం వినిపిస్తోంది. ప్రముఖ టూవీలర్ మేకింగ్ కంపెనీ క్లాసిక్ లెజెండ్స్ సరికొత్త బీఎస్ఏ 650 సీసీ బైకును భారత మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఈ ఏడాది ఆగష్టులోనే విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సంస్థ భారత్ లో జావాతో పాటు యెడ్జీ బైకులను తయారు చేస్తోంది.  


గోల్డ్ స్టార్ 650 పేరుతో విడుదల.. ధర ఎంత అంటే?


క్లాసిక్ లెజెండ్స్ సంస్థ బీఎస్ఏ మోటార్ సైకిళ్లను తమ మూడో బ్రాండ్ గా భారత మార్కెట్లోకి తీసుకురాబోతోంది. రాబోయే కొత్త బైక్ కు గోల్డ్ స్టార్ 650 అనే పేరును ఫిక్స్ చేసింది. ఈ బైక్ 60వ దశకంలో పాపులర్ అయిన డిజైన్ ను కలిగి ఉంది. భారత్ లో ఈ బైక్ ధర విషయానికి వస్తే.. రూ. 3 నుంచి 4.5 లక్షల వరకు ఉంటుందని ఆటో మోబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.  


గోల్డ్ స్టార్ 650 ప్రత్యేకతలు


గోల్డ్ స్టార్ 650 బైక్‌ 652 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో రాబోతోంది. సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్, DOHC 4 వాల్వ్ ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 6,000 RPM దగ్గర 44.27 BHP పవర్, 4,000 RPM దగ్గర 55 NM టార్క్ ను ఉత్పత్తి చేయనుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్‌ తో యాడ్ చేయబడి ఉంటుంది.  ఫ్రంట్ వైపు 41 NM టెలిస్కోపిక్ ఫోర్క్, బ్యాక్ సైడ్ ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి.


బైక్ ముందు భాగంలో 320 MM డిస్క్, వెనుక భాగంగాలో 255 MM డిస్క్ తో రన్ అవుతుంది. డ్యూయల్ ABS ఫీచర్‌ ను కలిగి ఉంటుంది. ముందు భాగంలో 18 ఇంచులు, వెనుక భాగంలో 17 ఇంచుల వీల్స్ ఉంటాయి. చూడ్డానికి రెట్రో లుక్‌ ను కలిగి ఉంటుంది. LCD డిస్ ప్లే,  స్లిప్పర్ క్లచ్, USB ఛార్జర్, LED టెయిల్‌ ల్యాంప్‌ సహా పలు అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ చూడ్డానికి గుండ్రంగా ఉంటుంది. వెడల్పుగా ఉండే హ్యాండిల్ బార్, ప్లాట్ సీటును కలిగి ఉంటుంది. టియర్ డ్రాప్ రూపంలోని యూనిట్ డిజైన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. యువతను ఆకట్టుకునేలా ఈ బైకును తీర్చిదిద్దారు.   


రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ తప్పదా?


కాసిక్ లెజెండ్స్ నుంచి త్వరలో విడుదలకాబోతున్న గోల్డ్ స్టార్ 650 రాయల్ ఎన్ ఫీల్డ్ 650 ట్విన్ మోడల్స్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టార్ 650 మీద బాగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ మోడల్ ను దేశీయ మార్కెట్లోకి తీసుకురావడం వల్ల తమ మార్కెట్ ను మరింత పెంచుకోవాలని క్లాసిక్ లెజెండ్స్ కంపెనీ ప్రయత్నిస్తోంది. 



Read Also: అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న ఓలా నుంచి 4 ఎలక్ట్రిక్ బైకులు, ఇంకా కొన్ని రోజులే వెయిట్ చెయ్యండి