Chennais Amirtha Group Of Institutions Brand Ambassador: హోటల్ మేనేజ్‌మెంట్ విద్యా బోధనలో అగ్రగామిగా ఉన్న చెన్నైస్ అమిర్త గ్రూప్ విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ హీరోయిన్ శ్రీలీల వ్యవహరిస్తారని, సంస్థ చైర్మన్ భూమీనాథన్ ప్రకటించారు. విజయవాడలో గ్రాండ్ బైజిరెట్ హోటల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 'గత 14 ఏళ్లుగా చెన్నై ప్రధాన కేంద్రంగా బెంగళూరు, హైదరాబాద్, ఖైరతాబాద్, విజయవాడల్లో ఉన్న మా కాలేజీల్లో వేలాది మంది విద్యార్థులకు అత్యంత నాణ్యతా ప్రమాణాలతో కూడిన హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ కోర్సులను బోధిస్తున్నాం. సాంకేతిక ఆవిష్కరణలతో అత్యంత  వేగంగా ప్రపంచం నింగిలోకి దూసుకెళ్తున్న తరుణంలో మా విద్యా బోధనలో అనేక మార్పులకు శ్రీకారం చుడుతున్నాం. ఈ ఏడాది నుంచి వైమానిక రంగ విద్యను కూడా ప్రవేశపెడుతున్నాం. దీని కోసం అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విలువలతో అత్యంత ఆధునిక ప్రమాణాలు కలిగిన మలేషియాకు చెందిన ప్రముఖ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఏవియేషన్ మేనేజ్మెంట్ కళాశాలతో (UNICAM), హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ విద్యను అందిస్తున్న సింగపూర్‌కు చెందిన బిర్మింగ్ హామ్ అకాడమీతో భాగస్వామ్య ఒప్పదం కుదుర్చుకున్నాం' అని భూమీనాథన్ వివరించారు.


స్కాలర్షిప్ సైతం..


ఈ ఒప్పందాల ద్వారా మా కళాశాలలో చదివే విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు అనుభవ పూర్వక అభ్యాసం పొందుతూ ప్రతి నెలా తగిన పారితోషకాన్ని పొందుతారని భూమీనాథన్ అన్నారు. 'చెన్నైస్ అమిర్త కళాశాల ప్రారంభించిన నాటి నుంచి ఈ పద్నాలుగేళ్లలో మా విద్యార్థులు వేలాది మంది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో అనేక సంస్థల్లో వివిధ హోదాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య రంగం, టూరిజం బాగా విస్తరిస్తోంది. దానితో విమానయానం మరింత పోటీగా రాణిస్తోంది. ఆ దిశగా ఉపాధి అవకాశాలు మెండుగా పెరుగుతున్నాయి. అందుకే మా అకాడమీలో హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీతో పాటు ఈ ఏడాది నుంచి ఏవియేషన్ విద్యను ప్రవేశ పెట్టాం.' అని చెప్పారు.


ఆరు నెలల పాటు బర్మింగ్‌హామ్ అకాడమీ నుంచి డిప్లొమా కోర్సును ఇంటర్న్‌షిప్ పొందుతూ చెన్నైస్ అమిర్తలో మొదటి సంవత్సరంలో చదువుకోవచ్చు. ఆరు నెలల పాటు అడ్వాన్స్‌డ్ డిప్లొమాతో బర్మింగ్‌హామ్ అకాడమీలో సింగపూర్‌లో ఉండి రెండో సంవత్సరంలో చదువుకోవచ్చు. ఆరునెలల పాటు ఇంటర్న్‌షిప్ అందిస్తారు. అలాగే, నెలకు SGD 1,500 వరకు సంపాదించవచ్చు. సుమారు లక్ష INR, ఇది విదేశాల్లో డిగ్రీ ఎంపికలకు దారి తీస్తుంది. విద్యార్థి UKలోని డిమోంట్‌ ఫోర్ట్ విశ్వవిద్యాలయంలో ఒక సంవత్సరం పాటు డిగ్రీ ప్రోగ్రామ్‌లో చేరవచ్చు. మూడేళ్ల కోర్సు పూర్తయ్యాక అత్యంత అర్హత కలిగిన గ్రాడ్యుయేట్‌ నిపుణులుగా సిద్ధమై వస్తారని వివరించారు.


ప్రచారకర్తగా ప్రముఖ నటి శ్రీలీల


మా చెన్నైస్ అమిర్త అందిస్తున్న బోధనలు, ఉపాధి అవకాశాలు మరింతగా విస్తరించాలని అందుకోసం ప్రచార కర్తగా నేటి వర్ధమాన హీరోయిన్ శ్రీలీలను నియమించామని సంస్థ చైర్మన్ భూమీనాథన్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ లీలతో రూపొందించిన ఓ వీడియోను ఆవిష్కరించి ప్రదర్శించారు. బెంగుళూరులో జరిగిన SICA (సౌత్ ఇండియా క్యులినరీ అసోసియేషన్) పోటీల్లో లైవ్ వంట విభాగంలో బంగారు పతకం సాధించిన విజయవాడ క్యాంపస్ విద్యార్థి శ్రీ బసంత కుమార్ జెనాకు ముఖ్య అతిథి సత్కరించి, మొమెంటో అందజేశారు. మొత్తం 55 పతకాలు, 2 స్వర్ణాలతో డిస్టింక్షన్, 7 బంగారు పతకాలు, 13 రజత పతకాలు, 33 కాంస్య పతకాలను అన్ని క్యాంపస్‌ల నుంచి చెన్నైస్ అమిర్త విద్యార్థులు గెలుచుకున్నారని అన్నారు. ఈ సమావేశంలో ముఖ్య అతిధులుగా విజయవాడ హయత్ హోటల్ మేనేజర్ కమల్ దీప్ శర్మ, విజయవాడ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎం.ఎల్.కే రెడ్డి పాల్గొన్నారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ MLK రెడ్డి, ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్, విజయవాడ, విమానయాన పరిశ్రమ భవిష్యత్తు వృద్ధిని, రాబోయే కొత్త విమానాశ్రయాలను గుర్తించి, సమర్థవంతమైన మానవ వనరుల కోసం పెరుగుతున్న డిమాండ్‌ గురించి  చెప్పారు. యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఏవియేషన్ మలేషియా (యూనికామ్)తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని ఆయన స్వాగతించారు. ఈ భాగస్వామ్యం వల్ల ఏవియేషన్ పరిశ్రమలో కెరీర్‌ల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. చెన్నైస్ అమిర్త గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌కు చెందిన  సీఏడీ లియో ప్రసాద్, డీన్ డా.టి.మిల్టన్, హెడ్ అఫ్ యూనివర్సిటీ అఫైర్స్ భానుమతి, విజయవాడ క్యాంపస్ ప్రిన్సిపాల్ ఆనంద రవికుమార్, ఏరియా మేనేజర్ కృష్ణ కిషోర్ తదితరులు పాల్గున్నారు. వివరాలకు 9393200600 సంప్రదించాలన్నారు.