ప్రస్తుతం మనదేశంలో ఎలక్ట్రిక్ బైకుల విభాగం మంచి గ్రోత్‌ను చూస్తుంది. కేవలం పెద్ద కంపెనీలు మాత్రమే కాకుండా ఎన్నో స్టార్టప్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఫీల్డ్‌లోకి అడుగుపెడుతున్నాయి. ఇప్పటికే ఓలా ఎస్1 స్కూటర్లతో ఈ విభాగంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు బౌన్స్ కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. అదే బౌన్స్ ఇన్‌ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్.
ఒకవేళ మీరు బ్యాటరీని సర్వీస్ ఆప్షన్‌గా ఎంచుకుంటే.. దీని ధర రూ.36,000 రేంజ్‌లో ఉండనుంది. ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే వినియోగదారులు బ్యాటరీ లేకుండా స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు. బ్యాటరీని కొనేబదులు దాన్ని కంపెనీ నుంచి రెంట్‌కు తీసుకోవచ్చు. స్వాపింగ్ నెట్‌వర్క్ ఉపయోగించడానికి సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకోవచ్చు.
ఒకవేళ బ్యాటరీ, చార్జర్‌తో కలిపితే దీని ధర రూ.79,999గా ఉండనుంది. ఇది ఎక్స్-షోరూం ధర మాత్రమే. అయితే మనదేశంలోని పలు రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్ వాహనాలపై సబ్సిడీలు కూడా ఉన్నాయి. దీంతో ఈ స్కూటర్‌ను రూ.59,999కే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతానికి రూ.499 చెల్లించి దీన్ని బుక్ చేసుకోవచ్చు. 2022 మార్చి నుంచి దీని డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
మిగతా కంపెనీ స్కూటర్ల నుంచి ఈ స్కూటర్‌ను వేరు చేసే ఆప్షన్ ఇదే. దీనికోసం కంపెనీ పార్క్+ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. 10కి పైగా నగరాల్లో 3,500 లొకేషన్లలో ఈ బ్యాటరీ స్వాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. అంటే వినియోగదారులు తమ బ్యాటరీ అయిపోతే దాన్ని స్వాపింగ్ స్టేషన్ దగ్గర ఉంచి.. పూర్తిగా చార్జ్ అయిన బ్యాటరీని తీసుకువెళ్లవచ్చన్న మాట. అయితే ఇది ఉచితం మాత్రం కాదు. దీనికి వినియోగదారులు నగదు చెల్లించాల్సి ఉంటుంది.
ఇందులో 2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. 83 నానోమీటర్ పీక్ టార్క్‌ను ఈ బైక్ అందించనుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 85 కిలోమీటర్ల రేంజ్‌ను ఇది అందించనుంది. దీని టాప్ స్పీడ్ గంటలకు 65 కిలోమీటర్లుగా ఉంది. ఒకవేళ బ్యాటరీతో దీన్ని కొనుగోలు చేస్తే పూర్తిగా చార్జ్ అవ్వడానికి ఐదు గంటల సమయం పడుతుంది. ముందువైపు, వెనకవైపు డిస్క్ బ్రేకులు కూడా అందించారు.
ఎరుపు, తెలుపు, నలుపు, గ్రే, సిల్వర్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, ప్రత్యేకమైన స్మార్ట్ ఫోన్ యాప్, దగ్గరలో ఉన్న స్వాపింగ్ స్టేషన్‌ను తెలిపే జియో ఫెన్సింగ్ మోడ్ కూడా ఉన్నాయి. రివర్సింగ్ మోడ్ కూడా ఇందులో అందించారు. ఒకవేళ టైర్ పంక్చర్ అయితే స్కూటర్‌ను డ్రాగ్ చేసేందుకు డ్రాగ్ మోడ్ ఇందులో ఉంది.
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?