Affordable Two Wheelers: దేశంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. ప్రస్తుతం మీరు కూడా కొత్త బైక్ కొనుగోలు చేయాలనుకున్నప్పుడు మీ బడ్జెట్ రూ. లక్ష లోపు ఉంటే టాప్-5 కార్ల గురించి తెలుసుకుందాం.


హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus)
హీరో స్ప్లెండర్ ప్లస్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్‌సైకిల్. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.75,141గా ఉంది. ఇది భారతదేశంలో మూడు వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ 97.2 సీసీ బీఎస్6 2.0 ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 8.02 పీఎస్ పవర్‌ని, 8.05 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. హీరో స్ప్లెండర్ ప్లస్ 112 కిలోల బరువు, 9.8 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కలిగి ఉంది.


హోండా యాక్టివా 6జీ (Honda Activa 6G)
హోండా యాక్టివా 6జీ స్కూటర్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.76,234గా  నిర్ణయించారు. ఇది ఐదు వేరియంట్లు, ఎనిమిది రంగులలో లభిస్తుంది. ఇది 109.51 సీసీ బీఎస్6-2.0 ఇంజిన్‌ను కలిగి ఉంది. హోండా యాక్టివా 6జీ స్కూటీ 7.84 పీఎస్ పవర్‌ని, 8.90 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ముందు వెనుక డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది. ఇందులో 5.3 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది.


సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125)
సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.79,899గా ఉంది. ఇది భారతదేశంలో నాలుగు వేరియంట్లు, 15 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. యాక్సెస్ 125లో 124 సీసీ బీఎస్6-2.0 ఇంజిన్‌ను కలిగి ఉంది. సుజుకి యాక్సెస్ 125 స్కూటీ 8.7 పీఎస్ పవర్‌ని, 10 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. సుజుకి యాక్సెస్ 125 బరువు 103 కిలోలు కాగా, ఐదు లీటర్ల ఇంధన ట్యాంక్ కలిగి ఉంది.


హోండా ఎస్పీ 125 (Honda SP 125)
హోండా ఎస్పీ 125 ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.86,017గా నిర్ణయించారు. ఇది మూడు వేరియంట్లు, ఏడు రంగులలో లభిస్తుంది. ఎస్పీ 125లో 123.94 సీసీ బీఎస్6-2.0 ఇంజిన్‌ను కలిగి ఉంది. హోండా ఎస్పీ 125 బైక్ 10.87 పీఎస్ పవర్‌ని, 10.9 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీనికి ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. హోండా ఎస్‌పీ 125 బరువు 116 కిలోలు కాగా, 11.2 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌ను కలిగి ఉంది.


హోండా షైన్ 125 (Honda Shine 125)
హోండా షైన్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.79,800. ఇది రెండు వేరియంట్లు, ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. హోండా షైన్‌లో 123.94 సీసీ బీఎస్6-2.0 ఇంజిన్‌ను కలిగి ఉంది. హోండా షైన్ 125 బైక్ 10.74 పీఎస్ పవర్‌ని, 11 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌ 10.5 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!


Also Read: బైక్ నడిపేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవుతున్నారా? - అయితే సరిగ్గా నడుపుతున్నట్లే!