Top Selling Two Wheelers: భారతదేశంలో ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే, హీరో స్ప్లెండర్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ బైక్ ప్రతి నెలా రికార్డు స్థాయిలో అమ్ముడవుతోంది. 2024 ఆగస్ట్ అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, హీరో స్ప్లెండర్ బైక్ పేరు టాప్ లిస్ట్‌లో వస్తుంది. ఇప్పుడు మనకు హీరో స్ప్లెండర్‌కు ఉన్న ఆదరణ గురించి తెలుసు. అయితే ఇది కాకుండా ఏ ఇతర బైక్‌లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయో మీకు తెలుసా?


2024 ఆగస్ట్ అమ్మకాల గణాంకాల గురించి మాట్లాడితే గత నెలలో 3,02,234 హీరో స్ప్లెండర్ బైక్‌లు అమ్ముడయ్యాయి. గతేడాది ఆగస్టు నెలలో 2,89,093 హీరో స్ప్లెండర్ బైక్‌లు అమ్ముడయ్యాయి. దేశంలో ఈ స్థాయి విక్రయాలను చూసిన ఏకైక బైక్ హీరో స్ప్లెండర్. హీరో స్ప్లెండర్ తర్వాత హోండా, బజాజ్, సుజుకీ లాంటి కంపెనీల పేర్లు వస్తాయి.


Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే


స్ప్లెండర్ కాకుండా ఇంకేం ఉన్నాయి?
హీరో స్ప్లెండర్ (Hero Splendor) తర్వాత హోండా యాక్టివా (Honda Activa) రెండో స్థానంలో నిలిచింది. ఆగస్టు నెలలో హోండా యాక్టివా మొత్తం 2,27,458 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గతేడాదితో పోలిస్తే 5.8 శాతం పెరిగింది. అమ్మకాల పరంగా హోండా షైన్ మూడో స్థానంలో ఉంది. మొత్తం 1,49,697 ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది 31.15 శాతం అధికం కావడం విశేషం.


ఇది కాకుండా బజాజ్ పల్సర్ నాలుగో స్థానం పొందింది. గత నెలలో బజాజ్ పల్సర్‌కు సంబంధించి మొత్తం 1,16,250 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గతేడాది కంటే 28.19 శాతం ఎక్కువ. ఐదో స్థానాన్ని టీవీఎస్ జూపిటర్ దక్కించుకుంది. గత నెలలో టీవీఎస్ జూపిటర్‌కు సంబంధించి మొత్తం 89,327 యూనిట్ల బైక్‌లు విక్రయించగా, గతేడాదితో పోలిస్తే 27.49 శాతం వృద్ధిని కనబరిచింది. దీంతో పాటు అత్యధికంగా అమ్ముడైన బైక్‌ల పేర్లలో హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్, సుజుకి యాక్సెస్, బజాజ్ ప్లాటినా, హోండా డియో కూడా ఉన్నాయి.



Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?