Best Mileage Petrol Cars Under 10 Lakhs: గత కొంత కాలంగా భారతదేశంలో ఆటోమోటివ్ ఇండస్ట్రీ ఎన్నో మార్పులకు లోనయింది. వినియోగదారులు ఎస్‌యూవీ కార్లు కొనేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో పాటు అడ్వంచరస్ రోడ్ ట్రిప్స్ ఎక్కువ అయ్యాయి. దీంతో మంచి మైలేజీ ఉన్న కార్ల కోసం కూడా వినియోగదారులు వెతుకుతున్నారు. ప్రస్తుతం రూ.10 లక్షల లోపు ధరలో మంచి మైలేజీని అందించే పెట్రోల్ కార్లు ఇవే.


1. మారుతి సుజుకి బ్రెజా
ఇందులో 1.5 లీటర్ 1462 సీసీ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. ఈ కారు 25.5 కిలోమీటర్ల వరకు మైలేజీని డెలివర్ చేయనుంది. దీని ధర రూ.8.3 లక్షల నుంచి ప్రారంభం కానుంది. భారతీయ మార్కెట్లలో ఇది మోస్ట్ వాంటెడ్ కార్లలో ఒకటి రెండు ఎయిర్ బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈబీడీ, బ్రేక్ అసిస్ట్, ఈఎస్‌పీ, హిల్ హోల్డ్ కంట్రోల్, వెనకవైపు పార్కింగ్ సెన్సార్లు ఇందులో ఉన్నాయి.


2. టాటా నెక్సాన్
ఈ కారులో 1.2 లీటర్ 1199 సీసీ టర్బో పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంది. 24.07 కిలోమీటర్ల వరకు మైలేజీని టాటా నెక్సాన్ అందించనుంది. 5 స్టార్ గ్లోబల్ ఎన్‌సీఏపీ సేఫ్టీ రేటింగ్‌ను కూడా ఈ కారు పొందింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.8.1 లక్షల నుంచి ప్రారంభం కానుంది. రెండు ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, బ్రేక్ అసిస్ట్, ఈఎస్పీ, హిల్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, వెనకవైపు పార్కింగ్ సెన్సార్లు, కెమెరా కూడా ఉన్నాయి.


3. హ్యుందాయ్ వెన్యూ
1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఈ కారు మార్కెట్లోకి వచ్చింది. ఇది 23.4 కిలోమీటర్ల వరకు మైలేజీని అందించనుంది. ఏబీఎస్, ఈబీడీ, బ్రేక్ అసిస్ట్, ఈఎస్‌పీ, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, వెనకవైపు పార్కింగ్ సెన్సార్లు, రెండు ఎయిర్ బ్యాగులు కూడా ఉన్నాయి. దీంతోపాటు 8 అంగుళాల టచ్ స్క్రీన్, ఫాలో మీ హెడ్ ల్యాంప్స్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే ఫీచర్లు కూడా ఉన్నాయి.


4. మహీంద్రా ఎక్స్‌యూవీ300
ఇందులో 1.2 లీటర్ 1197 సీసీ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. 20.1 కిలోమీటర్ల వరకు మైలేజీని ఈ కారు అందించనుంది. ఈ కారు ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఈ కారు 5 స్టార్ గ్లోబల్ ఎన్‌సీఏపీ రేటింగ్‌ను పొందింది. ఏబీఎస్, ఈబీడీ, రెండు ఎయిర్ బ్యాగ్స్ ఇందులో ఉన్నాయి.


5. కియా సోనెట్
ఈ ఐదు సీట్ల కారులో 1.2 లీటర్ 1197 సీసీ పెట్రోల్ ఇంజిన్ అందించారు. దీని సగటు మైలేజీ 18.4 కిలోమీటర్లుగా ఉంది. నాలుగు ఎయిర్ బ్యాగ్‌లు, వెనకవైపు పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎస్, ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, వెనకవైపు ఏసీ వెంట్లు ఉన్నాయి. దీని ధర రూ.7.79 లక్షల నుంచి ప్రారంభం కానుంది. సింగిల్ పేన్ సన్ రూఫ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేను సపోర్ట్ చేసే 10.25 అంగుళాల డిస్‌ప్లే కూడా అందించారు.


6. టాటా పంచ్
ఇందులో 1.2 లీటర్ 1199 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను కంపెనీ అందించింది. ఇది 20.09 కిలోమీటర్ల మైలేజీని అందించనుంది. ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. 5 స్టార్ గ్లోబల్ ఎన్‌సీఏపీ సేఫ్టీ రేటింగ్‌ను ఈ కారు పొందింది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్‌ప్లే కూడా ఉంది. ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, వెనకవైపు కెమెరా కూడా ఉంది. దీని ధర రూ.7.6 లక్షల నుంచి ప్రారంభం కానుంది.


7. హ్యుందాయ్ ఎక్స్‌టర్
1197 సీసీ ఇంజిన్ ఉన్న ఈ కారు 19.4 కిలోమీటర్ల వరకు మైలేజిని డెలివర్ చేయనుంది. ఈ కారు ధర రూ. ఆరు లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఒక డ్యాష్ క్యామ్, సన్‌రూఫ్, లింక్డ్ కారు టెక్నాలజీలు కూడా ఉన్నాయి.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!