Best Hatchback Cars Under Rs 10 Lakhs: ప్రస్తుతం మనదేశంలో బడ్జెట్ ధరలో కార్లకు మంచి డిమాండ్ పెరుగుతోంది. ఈ ధరలో హ్యాచ్‌బ్యాక్‌లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. దీనికి తగ్గట్లే బడ్జెట్ రేంజ్‌లో అందుబాటులో ఉన్న హ్యాచ్‌బ్యాక్‌ల లిస్ట్ కూడా ఎక్కువగా ఉంది. రూ.10 లక్షల లోపు మనదేశంలో అందుబాటులో ఉన్న టాప్-5 హ్యాచ్‌బ్యాక్‌లు ఏవో ఇప్పుడు చూద్దాం.


హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios)
ఈ జాబితాలో హ్యుందాయ్ కారు కూడా ఉంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మనదేశంలో ఉన్న బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటి. ఈ హ్యాచ్‌బ్యాక్ సీఎన్‌జీ, ఏఎంటీ రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.92 లక్షల నుంచి మొదలై రూ. 8.56 లక్షల వరకు ఉంటుంది.


సిట్రోయెన్ సీ3 (Citroen C3)
సిట్రోయెన్ సీ3 అనేది మిడిల్ క్లాస్‌ ఫ్యామిలీస్‌కు పర్‌ఫెక్ట్‌గా సరిపోయే ఒక హ్యాచ్‌బ్యాక్ కారు. 2024 సిట్రోయెన్ సీ3 ఎక్స్ షోరూమ్ ధర రూ. 6.16 లక్షల నుంచి మొదలయి రూ. 8.96 లక్షల వరకు ఉంటుంది. ఇది ఎక్స్ షోరూం ధర అన్నది గుర్తుంచుకోవాలి.


టాటా టియాగో (Tata Tiago)
ఈ జాబితాలో టాటా టియాగో కూడా చేరింది. టాటా టియాగోకు సంబంధించి మొత్తం 27 వేరియంట్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ కారులో ఆర్15 డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ అందించారు. టాటా టియాగో ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.64 లక్షల నుంచి ప్రారంభం కానుంది.


రెనో క్విడ్ (Renault Kwid)
2024లో అందుబాటులో ఉన్న మంచి హ్యాచ్‌బ్యాక్ కార్ల జాబితాలో రెనో క్విడ్ కూడా ఉంది. ఈ కారు ఏకంగా 279 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. రెనో క్విడ్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 4.70 లక్షల నుంచి మొదలై రూ. 6.45 లక్షల వరకు ఉండటం విశేషం.


మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift)
మారుతి సుజుకి స్విఫ్ట్ కారులో క్రూయిజ్ కంట్రోల్, ఆటో గేర్ షిఫ్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర మనదేశంలో రూ. 5.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!