Japan Launches e-Visa Program: జపాన్‌ పర్యాటకుల సంఖ్యను పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పలు దేశాల నుంచి వచ్చే వాళ్లకి e-Visaలు జారీ చేసేందుకు సిద్ధమైంది. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. ఈ వీసాతో ఒక్కసారి మాత్రమే జపాన్‌కి వెళ్లేందుకు అవకాశముంటుంది. ఈ వీసాకి 90 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఆర్డినరీ పాస్‌పోర్ట్‌తో జపాన్‌కి వెళ్లాలనుకునే వారికి ఇది (Japan e-Visa) ఉపకరించనుంది. కొద్ది రోజుల పాటు జపాన్‌లో పర్యటించాలనుకునే వాళ్లకి ఈ electronic visas జారీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా Japan e-Visa system ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే...ఇక్కడే ఓ మెలిక ఉంది. అందరికీ ఈ ఈ-వీసాలు ఇవ్వకుండా కొన్ని నిబంధనలు పెట్టింది. అర్హులైన వాళ్లకే ఈ వీసాలు అందిస్తామని వెల్లడించింది. 


ఎవరు అర్హులు..?


అన్ని దేశాల పౌరులకు ఈ అవకాశం లేదు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, సౌదీ అరేబియా, భారత్, సింగపూర్, సౌత్ ఆఫ్రికా, తైవాన్, యూఏఈ, కంబోడియా దేశాల పౌరులకు ఈ వెసులుబాటు ఉంటుంది. భారత్‌లో ఉంటున్న విదేశీయులకూ ఈ వీసాలు జారీ చేస్తామని జపాన్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లోని పౌరులు ఇప్పటికే షార్ట్ టర్మ్ వీసాలు అప్లై చేసి ఉంటారని, ఒకవేళ ఆ వీసాలు రిజెక్ట్ అయ్యుంటే...ఈ-వీసాలకు అప్లై చేసుకోవచ్చని స్పష్టం చేసింది. Japan e-Visa website ద్వారా ఈ వీసాని అప్లై చేసుకోవచ్చని వివరించింది. ఆ అప్లికేషన్‌లో అడిగిన డాక్యుమెంట్స్‌ని కచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వెరిఫికేషన్ పూర్తైన తరవాత మిగతా ప్రాసెస్‌ కంటిన్యూ అవుతుంది. దీంతో పాటు మరికొంత సమాచారాన్నీ అందించాల్సి ఉంటుంది. ఒక్కసారి ఈ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తైతే...వెంటనే రిజిస్టర్డ్ మెయిల్‌ ఐడీకి డీటెయిల్స్ వస్తాయి. ఆ తరవాత జపాన్ ఓవర్‌సీస్ విభాగం నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించాలి. ఈ పేమెంట్‌ పూర్తైన తరవాత e-Visa జనరేట్ అవుతుంది. అయితే...అప్లై చేసే వాళ్లు కచ్చితంగా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. జపాన్ ఓవర్‌సీస్ అధికారులు ఈ ఇంటర్వ్యూ చేస్తారు.