Satyabhama Today Episode ఫుల్లుగా తాగి ఉన్న క్రిష్‌కి బాబీ రెచ్చగొట్టేస్తాడు. మగాళ్లు పెళ్లాల దగ్గర తగ్గకూడదు అని, పెళ్లాలు మనకు నచ్చినట్లు ఉండాలని అంటాడు. సిటీ అంత నీకు భయపడితే నువ్వు వదినకు భయపడటం ఏంటని అంటాడు. దీంతో అప్పటి వరకు ఏడ్చిన క్రిష్ తానేంటో చూపిస్తాను అని సత్య దగ్గరకు వెళ్తాడు. సత్య రేణుకలు అత్తామామ, రుద్రలకు భోజనం వడ్డిస్తారు. సత్య తన పెళ్లిని తలచుకొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అత్త కూర వేయమంటే పప్పు వేసేస్తుంది. దీంతో భైరవి తిడుతుంది. దీంతో రేణుక చిన్నా ఇంటికి రాలేదు కదా అత్తయ్య అందుకే పరధ్యానంలో ఉంది అంటుంది.
భైరవి: అంతే అంటావా.. మొగుడు చీకటి పడినాక ఇంటికి వచ్చేయాలి అంటే ఆ లెక్కలే వేరుంటాయ్.
రుద్ర: అర్థరాత్రి వరకు బలాదూర్ తిరగడం వాడికి అలవాటే కదా.. ఎప్పుడు జల్దీ వచ్చిండు.
మహదేవయ్య: అప్పటి సంగతి వేరు ఇప్పటి సంగతి వేరు. పెళ్లి అయినాక బలాదూర్ తిరుగుడేంటిరా..
రుద్ర: ఆ మాట నువ్వు అడగాలి బాపు.. మా మాట వింటాడా వాడు.
భైరవి: ఆ మాట అడగాల్సింది కట్టుకున్న పెళ్లం.
మహదేవయ్య: ఫోన్ కలపరా నేను మాట్లాడుతా..
సత్య: వద్దులేండి మామయ్య గారు.. ఇంటికి వచ్చాక నేను మాట్లాడుతాను. మనసులో.. ఇంటిళ్లపాది నేను క్రిష్ కోసమే దిగులు పెట్టుకుంటున్నా అనుకుంటున్నారు. కానీ అతను ఇంటికి రాకపోతే బాగున్ను అని నేను అనుకుంటున్నా అని వీళ్లకు తెలీదు.
భైరవి: చూడు ఇది ఒక్కరోజులో చల్లారే మంట కాదు. వాడు మారడు నువ్వే మారాలి.
సత్య గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే క్రిష్ తాగిన మైకంలో అక్కడికి వస్తాడు. క్రిష్‌ని అలా చూసి సత్య కంగారు పడుతుంది. తాగి వచ్చావా అని అడుగుతుంది. దీంతో క్రిష్ పీకల్దాకా తాగా.. నీతో డీల్ చేయాలి అంటే ఓపిక ఉండాలి అని అందుకే తాగా అని చెప్తాడు. రా కూర్చో అని క్రిష్ అంటాడు. దీంతో సత్య కూర్చొను అంటే పెళ్లం అంటే మొగుడు చెప్పినట్లు తోక ఆడించాలి అని అంటాడు. క్రిష్ మాటలకు సత్య చిరాకు పడుతుంది. తనకు మందు వాసన పడదు అని అంటుంది.
క్రిష్: అబ్బా.. నాకూ నీ మొండితనం పడదు మారుతావా.. నాకు నీ ఓవర్ యాక్షన్ నచ్చదు మానేస్తావా.. చెప్పు.. నువ్వేమో నీ ఇష్టం వచ్చినట్లు ఉంటావ్ నేను నా ఇష్టం వచ్చినట్లు ఉంటే తప్పా. పెళ్లి అయినప్పటి నుంచి చూస్తున్నా నీ ప్రాబ్లమ్ ఏంటో అర్థం కావడం లేదు. ఏదీ ఇంకోసారి చెప్పు.
సత్య: నీకు స్ఫృహలో ఉన్నప్పుడు చెప్పిందే అర్థంకావడం లేదు. ఇప్పుడు చెప్తే అర్థమవుతుందా. నీకు చెప్పినా ఒకటే ఆ గోడకు చెప్పినా ఒకటే.
క్రిష్: దిమాక్ తింటావ్.. అసలు నీ బాధ ఏంటే.. నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి అర్థం చేసుకుంటావ్. నేను తప్పు చేయలేదు అంటే చేశావ్ అంటావ్. నా ప్రేమ, నా మనసు, నా మాట నీకు ఏదో అర్థం కాదు. నా లైఫ్‌లో నీ అంత టార్చర్ నాకు ఎవరూ పెట్టలేదు. నోరు విప్పితే చాలా బలవంతంగా పెళ్లి చేసుకున్నా అంటావ్. ఇప్పుడు నీకు బలవంతం అంటే ఏంటో నేను చూపిస్తా. చూపించాలా.. చూడు.. అని సత్య మీదకు వెళ్తాడు. వద్దు అని సత్య వారిస్తుంది. దగ్గరకు రావొద్దు అని అంటుంది. దీంతో నువ్వు నా పెళ్లానివి నన్ను ఆపే హక్కు నీకు లేదు అంటాడు. సత్య బెడ్ చుట్టూ పరుగులు తీస్తే క్రిష్ కూడా సత్య వెనకే వెళ్తాడు. కాసేపు సత్యను కంగారు పెడతాడు. సత్య చాకు పట్టుకొని పొడిచేస్తా అంటే చాకు తీసుకొని తన మాటలతో నవ్వులు పూయిస్తాడు. ఇక బెడ్ మీదకు వెళ్లి పడుకుంటాడు.
సత్య: వామ్మో తాగినప్పుడు ఇంత డేంజర్‌గా ఉన్నాడు సత్య జాగ్రత్త. చాలా జాగ్రత్తగా ఉండాలి.
మరోవైపు నందిని జరిగింది తలచుకొని కోపంతో ఉంటుంది. ఇక హర్ష పాప్ కార్న్ పట్టుకొని నందిని దగ్గరకు వస్తాడు. పక్కనే కూర్చొంటే నందిని లేచి వెళ్లిపోతుంది. దీంతో హర్ష చేయి పట్టుకుంటాడు. నందినికి సారీ చెప్పి పాప్ కార్న్ ఇస్తాడు.
నందిని: నాకు కావాల్సింది పాప్‌కార్న్ కాదు. మర్యాద, గౌరవం, గుర్తింపు..
హర్ష: నేను అంతలా అరవకుండా ఉండాల్సింది. చెప్పాలి అనుకున్నది నెమ్మదిగా చెప్పాల్సింది. అతిగా ఆవేశపడ్డాను తప్పే.
నందిని: ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి చూస్తున్నా అందరూ నామీద అరుస్తున్నారు. ప్రవచనాలు చెప్తారు. ఎందుకు అలా. మీరే చదువుకున్నారు అన్న పొగరా.. గర్వమా..
హర్ష: నందిని ఎందుకు అలా అనుకుంటున్నావ్ ఈ ఇంట్లో అందరికీ నువ్వు అంటే ప్రేమ, గౌరవం ఉంది. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించి చెప్పు. మా నాన్న ముందు నువ్వు అలా బిహేవ్ చేయడం తప్పు అనిపించడం లేదా..
నందిని: నేను ఎందుకు మారాలి. నా అలవాట్ల ప్రకారం మీరు మారొచ్చు కదా..
హర్ష: కాసేపు నీ పెంకితనం పక్కన పెట్టి కుదురుగా ఆలోచించు. ఒప్పుకుంటాను. నువ్వు పెరిగిన వాతావరణం వేరు ఇక్కడ వేరు. నువ్వు మారడానికి సమయం పడుతుంది. అందుకు నీకు హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ నువ్వు అసలు మారే ప్రయత్నం చేయడమే లేదే.. ఎందుకు అర్థం చేసుకోవడం లేదు.
నందిని: ఎందుకు నువ్వు నాకు ఇప్పుడు నస పెడుతున్నావ్. చూడు అర్జెంటుగా నాకు ఒక టీవీ కావాలి.
హర్ష: ఎందుకు ఇంట్లో ఉంది కదా..
నందిని: కానీ కాళ్లు ఊపుకొని చూడటానికి కాదు కదా. బెడ్ రూంలో ఒక టీవీ సెటప్ పెట్టించు నాతో ఎవరికీ ఏ ప్రాబ్లమ్ ఉండదు.
హర్ష: సమస్యకు పరిష్కారం అది కాదు నందిని.
నందిని: లేకపోతే వేరే ఇళ్లు చూడు వేరు కాపురం పెడదాం. ఎందుకు అలా చూస్తున్నావ్ ఐడియా లేదా..పెళ్లాన్ని సుఖ పెట్టాలి. సంతోష పెట్టాలి అనుకుంటే నీకు ఇదే ఐడియా వస్తుంది.
హర్ష: మాది సాధారణ కుటుంబం. మా కుటుంబం తగ్గట్టే నువ్వు నీ ప్రవర్తన ఉండాలి. అర్థం చేసుకో..
నందిని: ఇలా సతాయిస్తేనే నువ్వు నాకు దూరంగా ఉంటావ్.. కొట్లాడుతావ్. తెగేదాకా గుంజుతాను. నాకు కావాల్సింది కూడా అదే.
సత్య క్రిష్ కాళ్లు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ పెట్టి ఉంటుంది. ఉదయం లేచి క్రిష్ కంగారు పడతాడు. సత్య తాగింది దిగిందా అని అడుగుతుంది. నోటికి ప్లాస్టర్ ఎందుకు వేశావ్ అని అడుగుతాడు. దానికి సత్య పెళ్లం ముంగిలా ఉండదు. ముంగిసలా ఉంటుందని అంటుంది. బుద్ధిగా ఉంటేనే కట్లు విప్పుతాను అంటుంది. సరే ఉంటాను అని క్రిష్ అనడంతో కట్లు విప్పుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.