Krishna Mukunda Murari Serial Today April 4th Episode Written Update In Telugu: ఇంట్లో అందరికీ కాఫీ ఇచ్చిన రేవతి ముకుంద చనిపోయి 11 రోజులు అవుతుందని పిండ ప్రదానం చేయాలి అని పంతులు చెరువు దగ్గరకు రమ్మన్నారు అని చెప్తుంది. దీంతో భవాని ఉన్నప్పుడు తాను ప్రశాంతంగా ఉండలేదు. ఎవర్నీ ప్రశాంతంగా ఉంచనివ్వలేదు కనీసం ఆత్మ అయినా ప్రశాంతంగా ఉండాలి కదా పిండ ప్రధానం చేసేద్దాం అంటుంది. ఇక ఆ కార్యక్రమానికి ముకుంద తండ్రి శ్రీనివాస్‌ని కూడా పిలవమని చెప్తుంది. 


మధు: ఏం మాట్లాడుతున్నారు పెద్దమ్మ ఆ మహానుభావుడు మురారికి ఏం చేశాడో మర్చిపోయారా. ఆయన చేసిన దానికి ముందు ఆయన్ను చంపి పిండం పెట్టాలి అలాంటిది బొట్టుపెట్టి మరీ పిలవమంటారు. 
భవాని: ఆయన బుద్ధి ఆయన చూపించాడు. మన సంస్కారం మనం చూపించాలి కదా. 
నందూ: ఇంత జరిగినా ఏం ముఖం పెట్టుకొని వస్తాడు.
భవాని: వస్తే వస్తాడు లేకపోతే లేదు పిలవడం మన ధర్మం. మనసులో కోరిక తీరకుండా ఉంది అయిన వాళ్లు అందరూ ఉంటే ఆత్మ శాంతిస్తుంది కదా..
కృష్ణ: నిజమే అత్తయ్య ఏమీ అనుకోకండి నేను ఏసీపీ సార్ రావడం లేదు.
భవాని: ఎందుకు శ్రీనివాస్ వస్తాడని భయపడుతున్నారా. 
మురారి: ఆయనకు ఎవరు భయపడతారు పెద్దమ్మ. ముకుంద తండ్రి కాబట్టి ఊరుకున్నా లేదంటే ఆయన పని అయిపోయేది. 
కృష్ణ: ఒక్కోసారి బాగా ఆలోచిస్తుంటే నా మనసు ఏదోలా అయిపోతుంది అత్తయ్య. ముకుందకు సంబంధించిన విషయాలకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. 
ఆదర్శ్: అందుకే ఎప్పటికీ దగ్గర కాని అంత దూరం చేసేశారు కదా.
నందూ: పిండం పెట్టాల్సింది ఆదర్శ్ అన్నయ్యే కదా తను రాకపోతే ఎలా.
భవాని: వాళ్లిద్దరూ ఎప్పుడు భార్యభర్తల్లా ఉన్నారు. రాకపోతే పర్లేదులే. ముకుంద తండ్రి వస్తాడు కదా ఆయనతో పెట్టిద్దాం. లేదంటే పంతులు చూసుకుంటారు. ఇక మీరాకి ఈ విషయం చెప్పారా అని అడిగితే రేవతి చెప్పాను అంటుంది. 


మరోవైపు బతికుండగానే పిండం పెట్టించుకోబోతున్న మీరా తనని తాను తిట్టుకుంటుంది. మీరా అంతరాత్మ మీరాని ప్రశ్నిస్తుంది. మురారి ఇష్ట పడ్డ రూపాన్నే వద్దునుకున్న మురారి మీరాని ఎలా ఇష్టపడతాడు అని అనుకుంటుంది. మురారి కోసం దేనికైనా రెడీగా ఉండాలి అని ఇలాంటి పిండ ప్రధానాలు ఎన్ని వచ్చిన ఎదుర్కొంటేనే మురారి తన వాడు అవుతాడని సర్దిచెప్పుకుంటుంది.


మరోవైపు కృష్ణ, మురారి, ఆదర్శ్‌ల తప్ప అందరూ పిండ ప్రధానం చేయడానికి వస్తారు. ఇక శ్రీనివాస్ కూడా అక్కడికి వస్తాడు. ముకుందకు పిండ ప్రధానం చేయడానికి పిలిచారు అని తెలిసి షాక్ అవుతాడు. ముకుంద ఫొటోకి దండ వేసి పిండం ఏర్పాట్లు చూసి కుమిలిపోతాడు. పిండ ప్రధానానికి కూర్చొమని భవాని చెప్తుంది. దీంతో నా వల్ల కాదు నేను వెళ్లను అని శ్రీనివాస్ అందరి మీద అరుస్తాడు. దీంతో మీరా తన తండ్రి ఆవేశంలో నా కూతురు బతికే ఉంది అని చెప్పేస్తాడేమో అని టెన్షన్ పడుతుంది. 


శ్రీనివాస్: ఎవరు చెప్పారు ముకుంద చనిపోయిందని. నాకూతురు చనిపోలేదు. చనిపోలేదూ.. ఇంకా బతికే ఉంది. 
మీరా: అంకుల్ అవును అంకుల్ ముకంద బతికే ఉంది. మన ఆలోచనల్లో మన జ్ఞాపకాల్లో మనం చేసే పనుల్లో ముకుంద బతికే ఉంది. ఎప్పటికీ అలా బతికే ఉండాలి అన్నా తన ఆత్మ శాంతించాలి అన్నా జరగాల్సిన కార్యక్రమం జరిపించండి. (నాన్నతో.. ఎక్కడ నిజం చెప్పేస్తావో అన్న భయంతో ఇక్కడే చనిపోయేలా ఉన్నాను. చిన్నప్పుడు నాకు గోరుముద్దలు పెట్టాను అనుకొని వెళ్లి పిండం పెట్టు వెళ్లు నాన్న)


శ్రీనివాస్ పిండం పెట్టడానికి సిద్ధమవుతాడు. అందరూ ముకుంద చేసిన గొడవలు గుర్తు చేసుకొని ఇకనైనా నీ ఆత్మకు శాంతి కలగాలి అని కోరుకుంటారు. శ్రీనివాస్ బాధ పడుతుంటే మీరా తన మనసులో బాధ పడకు నాన్న నీ కన్నా వంద రెట్ల బాధనాకు ఉంది కానీ మురారిని దక్కించుకున్నరోజు ఆ బాధంతా పోతుందని అనుకుంటుంది. ఇక శ్రీనివాస్ పిండాలను తీసుకొని వెళ్లి కాకులకు పెట్టాలని పెడతాడు. అయితే ఒక్క కాకి కూడా రాదు. దీంతో పంతులు ఏదో బలమైన కోరిక తీరకుండా చనిపోయింది అని అది తీర్చడానికి ప్రయత్నించండి అంటారు. దీంతో మధు అది తీరేది కాదు పంతులు అది తీరకే పోయిందని అంటాడు. 


మరోవైపు ఆదర్శ్‌ ముకుంద ఫొటోను తీసి పట్టుకొని ఫొటో దండ తీసేస్తాడు. ఇక మీరా అంకుల్ అని కన్నతండ్రిని పట్టుకొని ఏడుస్తుంది. దీంతో శ్రీనివాస్ నా చేత బతికున్న నా కూతురికి పిండం పెట్టించావ్ నిన్ను ముట్టుకోవాలి అంటేనే అసహ్యంగా ఉంది దూరం వెళ్లు అంటాడు. దానికి ముకుంద ఓవర్ యాక్షన్ కాదు నాన్న నా పరిస్థితికి నాకు నిజంగానే ఏడ్వాలి అని ఉంది అంటుంది. ఎవరికీ ఏ అనుమానం రాకుండా నన్ను ఓదార్చమని అంటుంది. ఇక శ్రీనివాస్ ఏడవకు అమ్మా ఇక నుంచి నేను నీలోనే ముకుందని చూసుకుంటా అంటాడు. దానికి మీరా మనసులో తెలిసో తెలీకో మంచి ఐడియా ఇచ్చావు నాన్న దీన్నిఎలా వాడుకుంటానో చూడు అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్‌ 4th: చంపేస్తావా అని కార్తీక్‌ను ప్రశ్నించిన దీప.. సౌర్యకు తాను అమ్మమ్మ అని చెప్పిన సుమిత్ర, నిజం తెలిసిపోయిందా..!