CNG Cars: భారతదేశంలో ప్రజలు ఎక్కువగా సీఎన్‌జీ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ప్రత్యామ్నాయ ఇంధన ఎంపిక ఇప్పుడు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లు, ఎస్‌యూవీలతో సహా ఖరీదైన కార్లకు కూడా చేరుకుంది. ఇప్పుడు సీఎన్‌జీ కార్లలో టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసీ, సన్‌రూఫ్ వంటి అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ క్రమంలో సింగిల్ పేన్ సన్‌రూఫ్‌తో వచ్చే నాలుగు బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఏవో చూద్దాం.
టాటా అల్ట్రోజ్ సీఎన్‌జీ (Tata Altroz CNG)
ఈ జాబితాలో ఉన్న ఏకైక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అయిన టాటా అల్ట్రోజ్ 2023 మేలో సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌ను పొందింది. సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌తో పాటు అల్ట్రోజ్ సింగిల్ పేన్ సన్‌రూఫ్‌ను కూడా పొందుతుంది. ఇది మిడ్ స్పెక్ ఎక్స్ఎం+ (ఎస్) ట్రిమ్‌లో లభిస్తుంది. దీని ధర రూ. 8.85 లక్షలతో ప్రారంభమవుతుంది. అల్ట్రోజ్ సీఎన్‌జీ ట్విన్ సిలిండర్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇది 210 లీటర్ల బూట్ స్పేస్‌ను అందిస్తుంది. 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్-సీఎన్‌జీ ఇంజిన్‌తో నడిచే ఈ కారు సీఎన్‌జీ మోడ్‌లో 73.5 పీఎస్, 103 ఎన్ఎం అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
టాటా పంచ్ సీఎన్‌జీ (Tata Punch CNG)
ఆల్ట్రోజ్ లాగానే టాటా పంచ్ కూడా సీఎన్‌జీ ఇంజిన్ వేరియంట్లో సన్‌రూఫ్‌ను అందిస్తుంది. అయితే సన్‌రూఫ్ పంచ్ సీఎన్‌జీ అకాంప్లిష్డ్ డాజిల్ ఎస్ వేరియంట్ వరకు మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధర రూ.9.68 లక్షలుగా ఉంది. 7 అంగుళాల టచ్‌స్క్రీన్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, ఆటోమేటిక్ ఏసీ వంటి ఫీచర్లు పంచ్ సీఎన్‌జీ అందుబాటులో ఉన్నాయి. దీని సెక్యూరిటీ ఫీచర్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్ ఉన్నాయి.
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?
హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ (Hyundai Exter CNG)
సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్ ఆప్షన్ హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లో లాంచ్ అయినప్పటి నుంచి అందుబాటులో ఉంది. ఎక్స్‌టర్ ఎస్ఎక్స్ సీఎన్‌జీ వేరియంట్ సింగిల్ పేన్ సన్‌రూఫ్‌తో వస్తుంది. దీని ధర రూ. 9.06 లక్షలుగా ఉంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఈ వేరియంట్‌లో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసీ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెక్యూరిటీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా కూడా అందుబాటులో ఉన్నాయి.
మారుతి బ్రెజా సీఎన్‌జీ (Maruti Brezza CNG)
మారుతి బ్రెజా భారతదేశంలో సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్, సింగిల్ పేన్ సన్‌రూఫ్‌తో వచ్చిన ఏకైక సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ. జెడ్ఎక్స్ఐ సీఎన్‌జీ వేరియంట్‌లో ఇది అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 12 లక్షలుగా నిర్ణయించారు. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో కూడిన 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6 స్పీకర్ ఆర్కమీస్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసీ వంటి ఫీచర్లతో మారుతి బ్రెజా సీఎన్‌జీని కలిగి ఉంది.