CNG Cars Under 10 Lakh: దేశవ్యాప్తంగా ఫెస్టివల్ సేల్స్ జోరుగా సాగుతున్నాయి. ధన్‌తేరాస్, దీపావళి సందర్భంగా ప్రజలు కొత్త కార్లు లేదా బైక్‌లను కూడా కొనుగోలు చేయడానికి సిద్ధం అవుతారు. ముఖ్యంగా మనదేశంలో ప్రస్తుతం కార్లకు బాగా మార్కెట్ పెరిగింది. సిటీల్లో ఎక్కువ తిరిగేవారు తక్కువ ఖర్చులో తిరగడానికి సులభంగా ఉంటాయని సీఎన్‌జీ కార్ల కొనుగోలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. మీ బడ్జెట్ రూ. 10 లక్షలుగా ఉండి మెరుగైన సీఎన్‌జీ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మార్కెట్లో ఈ రేంజ్‌లో అనేక గొప్ప కార్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్ల జాబితాలో హ్యుందాయ్, మారుతి, టాటా... ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి.


టాటా పంచ్ ఐసీఎన్‌జీ (Tata Punch iCNG)
టాటా పంచ్ పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. పంచ్ ఐసీఎన్‌జీని ఐకానిక్ ఆల్ఫా ఆర్కిటెక్చర్‌పై ఆధారంగా రూపొందించారు. ఇది అత్యుత్తమ సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ కారులో ఐసీఎన్‌జీ కిట్ ఉంది. ఇది కారును ఎలాంటి లీకేజీ కాకుండా కాపాడుతుంది. కారులో ఎక్కడైనా గ్యాస్ లీక్ అయితే ఈ టెక్నాలజీ సాయంతో ఆటోమేటిక్ గా కారు సీఎన్‌జీ మోడ్ నుంచి పెట్రోల్ మోడ్ లోకి మారిపోతుంది.


టాటా పంచ్‌లో భద్రత కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు అందించారు. దీంతో పాటు కారులో వాయిస్-ఎనేబుల్డ్ సన్‌రూఫ్ కూడా ఉంది. ఈ టాటా కారులో ఆర్16 డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉపయోగించారు. ఈ కారు ఐదు కలర్ వేరియంట్లలో మార్కెట్లో లభ్యమవుతోంది. టాటా పంచ్ ఎక్స్ షోరూమ్ ధర రూ.7,22,900 నుంచి ప్రారంభం అవుతుంది.


మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift CNG)
మారుతి సుజుకి స్విఫ్ట్ ఇటీవలే సీఎన్‌జీ వేరియంట్‌లో మార్కెట్లోకి విడుదలైంది. ఈ కారు జెడ్-సిరీస్ ఇంజిన్, ఎస్-సీఎన్‌జీ కాంబినేషన్‌లో ఉంది. దీని కారణంగా ఈ కారు ఏకంగా కేజీ ఇంధనానికి 32.85 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ మూడు వేరియంట్లలో మార్కెట్లో లభ్యమవుతోంది. దాని బేస్, మిడ్ వేరియంట్‌లలో స్టీల్ వీల్స్ అందించారు. అయితే టాప్-వేరియంట్‌లో పెయింట్ చేసిన అల్లాయ్ వీల్స్ ఇన్‌స్టాల్ చేశారు.


మారుతి స్విఫ్ట్ స్మార్ట్‌ప్లే ప్రోతో 17.78 సెం.మీ టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ కారులో యూఎస్‌బీ, బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ కూడా అందించారు. దీని టాప్ వేరియంట్‌లో వెనుక ఏసీ వెంట్‌లు చూడవచ్చు. ఈ మారుతి కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 8.19 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.



Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే


హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter CNG)
హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ కూడా రూ. 10 లక్షల రేంజ్‌లో అందుబాటులో ఉంది. ఈ కారులో పారామెట్రిక్ ఫ్రంట్ గ్రిల్ ఉంది. కారు వెనుక భాగంలో స్పోర్టీ స్కిడ్ ప్లేట్ ఉంది. ఈ కారులో వాయిస్ అసిస్టెడ్ స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఉంది. కారుకు డ్యాష్‌క్యామ్‌తో పాటు డ్యూయల్ కెమెరాను అందించారు. హ్యుందాయ్ ఎక్స్‌టర్ యొక్క ట్విన్ ఫ్యూయల్ సీఎన్‌జీ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.9.60 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.



Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?