Best CNG Cars For Office: భారతీయ మార్కెట్‌లలో కార్ల వినియోగం పెరుగుతోంది. సొంత అవసరాల కోసం కార్లు కొంటున్న వారి సంఖ్య రోజు రోజుకూ ఎక్కువ అవుతుంది. మధ్యతరగతి ప్రజలు తమ బడ్జెట్‌, రోజువారి అవసరాలను బట్టి ఏ కారు కొనాలనే ఆలోచన చేస్తున్నారు. వీటికి తోడు మైలేజ్, ఇతర సౌకర్యాలను కూడా ప్రాధాన్యత క్రమంలో తీసుకుంటున్నారు.


ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు పెరుగుతూ ఉంది. వాటి ధరలు ఎక్కువగా ఉండటంతో మధ్యతరగతి వాళ్లు వాటి జోలికి వెళ్లేందుకు కాస్త వెనకడుగు వేస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలతో పోలిస్తే మాత్రం సీఎన్జీ తక్కువ ధరకు లభిస్తున్నాయి. అందుకే వాటి మొగ్గు చూపుతున్నారు. కచ్చితంగా రోజూ కారు బయటకు తీసి వెళ్లాల్సిన వారికి ఈ కింద ఇచ్చిన లిస్ట్‌ మంచి ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ఇంటి నుంచి రోజూ ఇరవై కిలోమీటర్లు దాటి ఆఫీస్‌కో, వేరే పనుల మీదో బయటకు వెళాల్సి వచ్చిన వారికి ఈ కార్లు సూటబుల్ అవుతాయి. పెట్రోల్-డీజిల్ కార్ల కంటే CNG కార్లు చౌకగా ఉండటం కలిసి వచ్చే అంశం. మీరు కూడా కాస్త తక్కువ ధరల కార్ల కోసం చూస్తున్నట్టు అయితే ఈ CNG కార్లపై ఓ లుక్ వేయండి.


మారుతి సుజుకి ఆల్టో K10 CNG


ఈ జాబితాలో ఉన్న మొదటి కారు పేరు మారుతి సుజుకి ఆల్టో K10 CNG. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత చౌకైన CNG కారు ఆల్టో K10. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 5 లక్షల 96 వేలు. భారీ ట్రాఫిక్‌ జామ్‌లో కూడా ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు. చిన్న కుటుంబానికి ఇది సరైన ఎంపిక. 4 మంది సౌకర్యవంతంగా ఈ కారులో కూర్చొని జర్నీ చేయవచ్చు. మారుతి సుజుకి ఆల్టోలో AC, ఫ్రంట్ పవర్ విండో, పార్కింగ్ సెన్సార్, సెంట్రల్ కన్సోల్ ఆర్మ్‌రెస్ట్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, అడ్జస్టబుల్ హెడ్‌ల్యాంప్, హాలోజన్ హెడ్‌ల్యాంప్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్‌లు, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు ఇలా ముఖ్యమైన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి.


Also Read: FASTag ని పదే పదే రీఛార్జ్ చేసుకోవడం మంచిదా లేదా పాస్ తీసుకోవడం మేలా?


మారుతి సుజుకి సెలెరియో CNG


ఆల్టోలో కాదనుకుంటే మారుతి సుజుకి సెలెరియో CNG ట్రై చేయవచ్చు. మారుతి సుజుకి సెలెరియో CNG కారు ఎక్కువ ఇంధన సామర్థ్యం కలిగి ఉంది. ఇది కిలోకు 34.43 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.69 లక్షలు. దీని నిర్వహణ ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. టూవీలర్ కంటే తక్కువే ఉంటుంది. ఈ కారులో 5 మంది సౌకర్యవంతంగా కూర్చొని ప్రయాణం చేయవచ్చు. భద్రత కోసం ఈ కారులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తోపాటు EBD, ఎయిర్‌బ్యాగ్‌ల సౌకర్యం కూడా ఉంది.


టాటా టియాగో iCNG


టాటా టియాగో iCNG కిలోకు 27 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కారులో 5 మందికి సౌకర్యవంతంగా జర్నీ చేయవచ్చు. ఈ కారులో 1.2 లీటర్ ఇంజన్ ఉంది. ఇది CNG మోడ్‌లో 73hp పవర్, 95nm టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్‌లో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 


Also Read: కారులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లే ముందు వీటిని చెక్ చేయండి