Long Drive Tips For Car: కారు ఉండటం గొప్ప కాదు దాన్ని మెంటెయిన్ చేయడం చాలా అవసరం. నార్మల్ టూవీలర్‌ చూసినట్టు చూస్తే మాత్రం చాలా వేగంగా కారు గ్యారేజీకి వెళ్తుంది. అంతేకాదు మీ కుటుంబం కూడా ప్రమాదంలో పడుతుంది. అందుకే కారు తీసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు. అసలు కారులో బయటకు వెళ్లే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. 


ఇంజిన్ ఆయిల్ 
కారు తీయడానికి ముందు ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకోండి. గేజ్‌ స్టిక్‌ను ఓ క్లాత్‌తో తుడిచి ఎంత వరకు ఇంజిన్ ఆయిల్ ఉందో పరిశీలించండి. తక్కువ ఉంటే ఇంజిన్ ఆయిల్ వేయించడం మంచిది లేకుంటే మార్గ మధ్యలో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. 


టైర్లు చెక్ చేయండి 
కారులో డ్రైవ్‌కు వెళ్లేటప్పుడు ముఖ్యంగా చూడాల్సినవి టైర్లు. వీటని చెక్ చేసేటప్పుడు మూడు ముుఖ్యవిషయాలు గుర్తు పెట్టుకోవాలి.  టైర్లలో గాలి ఎంత ఉందనే విషయాన్ని జాగ్రత్తగా చూడాలి. సరిపడా గాలి ఉంటే కారు మంచి మైలేజీ ఇస్తుంది. టైర్ల అరుగుదలను కూడా తగ్గిస్తుంది. అందుకే టైర్లు కూల్‌గా ఉన్నప్పడుకే ఈ గాలిని చెక్ చేయాలి. రెండోది టైర్లలో ఉండే త్రెడ్‌ డెప్త్‌ 1.6 ఎంఎం ఉండేలా చూసుకోండి. అంత కంటే తక్కువగా ఉంటే మీ టైర్లు మార్చాల్సిన టైం వచ్చినట్టే. అలానే డ్రైవ్ చేస్తే ప్రమాదంలో ఉన్నారని గ్రహించండి.  మూడోది అలైన్ మెంట్‌, బ్యాలెన్స్ చెక్ చేయాలి. ఈ రెండు లేకపోతే టర్నింగ్స్‌ వద్ద, లేదా ఓవర్ టేక్ చేసే సమయంలో ఇబ్బంది పడతారు. 



రేడియేటర్‌ను చెక్ చేయాలి
రేడియేటర్‌ను తరచూ చెక్ చేస్తుండాలి. ఏమైనా లిక్‌లు కనిపిస్తే వెంటనే షోరూమ్‌కు తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి. ఇలా ఈ సమస్యను పరిష్కరించకుంటే రన్నింగ్‌లో ఇంజిన్ హీటెక్కి ఆగిపోవడం జరుగుతుంది. దీని వల్ల జర్నీకి బ్రేకులు పడుతుంటాయి. 


కారులో ఫ్లూయిడ్‌ చెక్ చేయాలి 
ఆయిల్, రిఫ్రిజెరంట్ (ఎయిర్ కండిషనింగ్ కోసం), వైపర్ ఫ్లూయిడ్‌ ఒకసారి చెక్ చేయాలి. ఆయిల్ లేక పోతే ఇంజిన్‌కు హాని కలుగుతుంది. రిఫ్రిజెరంట్ లేకపోతే ఏసీ వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ రెండూ తర్వాత మీకు భారీ మూల్యం చెల్లించేలా చేస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు ఈ రెండింటినీ చెక్ చేస్తూ ఉండాలి.  


పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్, ట్రాన్స్‌మిషన్ ఫ్లూయిడ్‌ను కూడా తనిఖీ చేయాలి. డ్రైవ్ చేసినప్పుడు స్టీరింగ్‌ తిప్పడంలో ఇబ్బంది ఉన్నా లేకుండా ఆపినప్పుడు స్టీరింగ్ వీల్ వైబ్రేట్ అయితే పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్స్‌లో సమస్య ఉందని గ్రహించారు. ట్రాన్స్‌మిషన్ ఫ్లూయిడ్‌ను కూడా తనిఖీ చేయాలి.


డ్రైవింగ్ బెల్ట్‌ చెక్‌ చేశారా
డ్రైవింగ్ బెల్ట్ పాడయ్యే వరకు దీని గురించి చాలా మంది పట్టించుకోరు. కానీ ఈ బెల్ట్‌ 75 వేల కిలోమీటర్ల నుంచి లక్షా 30వేల కిలోమీటర్ల మధ్య బెల్ట్ చెక్ చేయాలి. ఇది పెద్దగా కాస్ట్ ఉండదు కానీ నిర్లక్ష్యం వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 


రోడ్లపై ఎలాంటి కుదుపులు లేకపోయినా కొన్ని కార్లలో వెళ్తుంటే సౌండ్ వస్తుంది. అలాంటి టైంలో ముందుగా ఎగ్జాస్ట్ పైపు పరిశీలించండి ఎక్కడో చోట క్రాక్ ఉంటుంది. తుప్పుపట్టడం వల్ల లేదా గుంతలు రోడ్డుల్లో కారు ఎక్కువగా నడపడం వల్ల ఇది జరిగి ఉంటుంది. అంతేకాకుండా కారు కింది భాగాన్ని బాగా పరిశీలించండి. తుప్పు పట్టిన ఏరియా ఉంటే సరి చేసుకోండి.  


మీ భద్రత కారులో ఉన్న వారి సేఫ్టీకి ముఖ్యమైనవి బ్రేక్స్. మీరు కారును ఎన్నిసార్లు తప్పినా, తిప్పకపోయినా కచ్చితంగా ఆరు నెలలకోసారి బ్రేకింగ్ వ్యవస్థను చెక్ చేపించాలి. లాంగ్ డ్రైవ్‌కు వెళ్లేటప్పుడు కూడా చెక్ చేసుకోవడం మంచిది. 


Also Read: సరికొత్త అడ్వెంచర్ బైక్ లను లాంచ్ చేసిన కేటీఎం... వాటి ఫీచర్స్ ఇవే


బ్యాటరీని చెక్ చేశారా
నార్మల్‌ సమయంలో వోల్టేజ్ 12.5v, రన్నింగ్‌లో 14.5v మధ్య ఉండాలి. 12.0vకి తగ్గింది అంటే మీ బ్యాటరీని ఛార్జ్ చేయాలి అని సంకేతం. కారు నెమ్మదిగా స్టార్ట్ అయితే లేదా స్టార్టింగ్ ట్రబుల్ ఉంటే బ్యాటరీలో సమస్య ఉన్నట్టే. కుళ్ళిన గుడ్డు వాసన వస్తోంది అంటే బ్యాటరీ లీక్ అవుతున్న గ్రహించాలి. కొన్నిసార్లు వైర్లు కట్ అయినా కూడా సమస్య ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనిపై అవగాహన లేకుంటే మీ మెకానిక్‌ను అడగండి. కానీ ప్రతి 3 నెలలకు ఒకసారి బ్యాటరీని చెక్ చేస్తూ ఉండాలి.  


వైపర్‌లు చెక్ చేయాలి
మీరు బయటుకు వెళ్లే ముందు వైపర్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో చూడాలి. లేకుంటే సడెన్‌గా వర్షాలు పడితే ఇబ్బంది పడాతరు. ఒక వేళ వైపర్‌ జారుతున్నా, పని చేసే టైంలో సౌండ్ వస్తున్నా మార్చుకోవాలి. అన్నీ బాగుంటే లాంగ్ డ్రైవ్‌కు వెళ్లే ముందు ఒక క్లాత్ తీసుకొని నీట్‌గా తుడుచుకోండి.  


హెడ్‌లైట్‌ల, ఇండికేటర్స్‌ 
లాగ్ డ్రైవ్‌కు వెళ్లే ముందు హెడ్‌లైట్లు, ఇండికేటర్లు, బ్యాక్‌ లైట్లు చెక్ చేయాలి. అవి సరిగా పని చేస్తుంటే మీరు సాఫీగా డ్రైవ్ చేయగలుగుతారు.  


Also Read: FASTag ని పదే పదే రీఛార్జ్ చేసుకోవడం మంచిదా లేదా పాస్ తీసుకోవడం మేలా?