KTM 390 Adventure : కేటీఎం సరికొత్త 390 అడ్వెంచర్, 390 అడ్వెంచర్ X అనే పేర్లతో లాంచ్ చేసింది. ఈ రెండు మోడల్స్ ఒకే క్యాటగిరీకి చెందినవి అయినప్పటికీ వాటి ధరలు, ప్రత్యేకతలు, ఫీచర్లలో తేడాలు ఉన్నాయి. KTM 390 అడ్వెంచర్, KTM 390 అడ్వెంచర్ X రెండు మోడల్స్ రైడర్స్ కి అడ్వెంచర్ బైకింగ్ లో రైడర్లకు సరికొత్త అనుభవాన్ని అందించడానికి ప్రత్యేకంగా రూపొందించారు.
KTM 390 అడ్వెంచర్
కొత్తగా విడుదల చేసిన KTM 390 అడ్వెంచర్ ధర రూ. 3.68 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ ఒక కొత్త ప్లాట్‌ఫారమ్ మీద ఆధారపడి కంపెనీ దీనిని రూపొందించింది. ప్రీమియం ఫీచర్లతో ఈ బైక్ రాబోతుంది. దీని పవర్‌ఫుల్ 399cc, సింగిల్-సిలిండర్ ఇంజిన్, 390 డ్యూక్ నుంచి తీసుకున్నది. ఇది 46 bhp శక్తిని, 39Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్, బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ తో ఈ బైక్ రైడింగ్‌ను మరింత సులభతరం చేస్తుంది.
ఈ బైక్ లో ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్ (21/17-inch, ఫ్రంట్, రియర్) ప్రత్యేకత ఉంది. ఇది ఈ క్లాస్‌లో తొలిసారి అందించడం. అదేవిధంగా, ఈ బైక్ క్రూఇజ్ కంట్రోల్ ఫీచర్‌ను అందిస్తుంది. ఇది లాంగ్-డిస్టెన్స్ రైడింగ్‌లో మరింత కంఫర్ట్‌ను అందిస్తుంది. 390 అడ్వెంచర్ గ్రౌండ్ క్లియరెన్స్ (227mm), సీటు ఎత్తు (830mm) తో మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
390 అడ్వెంచర్ బరువు 183 కిలోలు. ఇది దాని పాత వెర్షన్ కన్నా 6 కిలోలు ఎక్కువ. స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్, యాడ్జస్టబుల్ డబ్ల్యూ పీ సస్పెన్షన్ ఈ బైక్ ను ఆఫ్-రోడ్ పర్ఫామెన్స్ లో అత్యుత్తమంగా చేస్తాయి. ప్రస్తుతం ఈ బైక్ కు డైరెక్ట్ కాంపిటిటేషన్ అయితే లేదు, కానీ దాని దగ్గరనుంచి పోటీగా ఉండే మోడల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 (ధర సమానంగా) ఉంటుంది.. అయితే ఈ బైక్ కొన్ని ప్రీమియమ్ ఫీచర్లను అందిస్తుంది.
KTM 390 అడ్వెంచర్ X
KTM 390 అడ్వెంచర్ X ధర రూ. 2.91 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ మోడల్ 390 అడ్వెంచర్ కంటే బడ్జెట్-ఫ్రెండ్లీ ఎంపికగా ఉంటుంది. 390 అడ్వెంచర్ X లో కూడా అదే 399cc ఇంజిన్, ఫ్రేమ్ ఉన్నాయి. ఇది 46bhp శక్తి, 39Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఈ బైక్ కొంత తక్కువ బరువు (182kg) తో వస్తుంది.
Also Read: బుక్ చేస్తే నేరుగా ఇంటికే స్కోడా కార్ డెలివరీ.. 10నిమిషాల్లోనే టెస్ట్ డ్రైవ్ బుకింగ్
390 అడ్వెంచర్ X లో 390 అడ్వెంచర్ పోలి చాలా స్టైలింగ్ ఉంటుంది.. కానీ దీని ఎలక్ట్రానిక్స్ సరళమైనవి. ఈ బైక్ 19/17-inch అలాయ్ వీల్స్ తో వస్తుంది. 390 అడ్వెంచర్ X లో సస్పెన్షన్ యాడ్జస్టబుల్ కాదు, అయినప్పటికీ 200mm ఫ్రంట్, 205mm రియర్ ట్రావెల్ ఇక్కడ కూడా కంపెనీ అందించింది. 2025 మోడల్ లో ఒక ప్రత్యేకతగా TFT డిస్‌ప్లే, బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ ఈ బైక్‌లో స్టాండర్డ్‌గా అందించారు. 390 అడ్వెంచర్ X ధర రూ. 2.91 లక్షలు, ఇది 390 అడ్వెంచర్ కన్నా రూ. 77,000 తక్కువ. ఈ బైక్ కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 (ధర రూ.2.85 లక్షలు - రూ.2.98 లక్షలు, ఎక్స్-షోరూమ్, చెన్నై) కి డైరెక్ట్ పోటీగా ఉంటుంది.
KTM 390 అడ్వెంచర్, 390 అడ్వెంచర్ X రెండు వేరే వేరే రైడింగ్ అనుభవాలను అందించాయి. 390 అడ్వెంచర్ ప్రత్యేకమైన ప్రీమియమ్ ఫీచర్లతో, లుక్ తో రూపొందించబడింది.అలాగే 390 అడ్వెంచర్ X అనేది బడ్జెట్-ఫ్రెండ్లీ ఎంపికగా, కనీస ఫీచర్లు, శక్తిని అందిస్తుంది. ఇవి ఒకదానితో మరొకటి పోటీ పడే రెండు ప్రీమియమ్ ఆఫ్-రోడ్ బైకింగ్ ఎంపికలు.
Also Read: హ్యుందాయ్ క్రెటా ఈవీ.. హైప్ వచ్చినంత మేటర్ ఉందా ఈ కారులో ?