Hyundai Creta Electric: ఒక్క ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగదారుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈ నేపధ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను మరింత విస్తరించేందుకు పోటీలోకి దిగాయి. ఈ చర్యలో హ్యుందాయ్ కూడా ముందు నిలిచింది. హ్యుందాయ్ ఇప్పటికే ఐఓనిక్ 5 ఎలక్ట్రిక్ వాహనంతో మార్కెట్ లో మంచి ఆదరణ దక్కించుకున్న తర్వాత.. తాజాగా క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్ ను లాంచ్ చేసింది. ఈ క్రెటా ఈవీ భారతదేశంలో రూ. 17.99 లక్షలు నుండి రూ. 24.38 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరలో అందుబాటులో ఉంది.
బ్యాటరీ, రేంజ్, ఛార్జింగ్క్రెటా ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ లతో లభిస్తుంది. ఒకటి 42 kWh, మరొకటి 51.4 kWh. 42 kWh బ్యాటరీ ARAI ప్రకారం ఒక సారి ఛార్జి చేస్తే 390 కిమీ వరకు ప్రయాణించవచ్చు. అదే 51.4 kWh బ్యాటరీని ఒకసారి ఫుల్ ఛార్జీ చేస్తే 473 కిమీ మేర ప్రయాణించవచ్చు. రియల్ టైమ్ ఈ బ్యాటరీ ప్యాక్ లతో ఒక్కసారి ఛార్జి చేస్తే 340 కిమీ నుండి 450 కిమీ వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ వాహనంలో AC, DC ఛార్జింగ్ ఆప్షన్లు ఉన్నాయి. 11 kW AC ఛార్జర్ తో పూర్తి ఛార్జింగ్ చేయడానికి 4 గంటలు సమయం పడుతుంది, 50 kW DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 10-80శాతం ఛార్జింగ్ ఒక గంటలో పూర్తవుతుంది.
పవర్, పర్ఫామెన్స్51.4 kWh బ్యాటరీ వెర్షన్ లో 169 bhp పవర్ ఉత్పత్తి చేస్తూ, ఈ వాహనం 0 నుంచి 100కిలోమీటర్ల వేగాన్ని 7.9 సెకన్లలో అందుకుంటుంది. 42 kWh వెర్షన్ లో 133 bhp పవర్ ఉత్పత్తి అవుతుంది, కానీ 0 నుంచి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సమయం మాత్రం రెండింటిలో సమానమే.
క్యాబిన్, ఫీచర్లుక్రెటా ఈవీలో కొత్తగా సరికొత్త డిజైన్ లో సీటింగ్, స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇది ఆపరేటింగ్ ను మరింత సులభం చేస్తుంది. వాహనంలో డ్యూయల్ కర్విలినియర్ స్క్రీన్లు ఉన్నాయి. వాటిలో 10.25" HD ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ప్లే, కంప్లీట్ డిజిటల్ క్లస్టర్ ఉన్నాయి. ఈ డిస్ప్లే ద్వారా అన్ని ఈవీ-స్పెసిఫిక్ డేటా సులభంగా అందించబడుతుంది. ఈ వాహనంలో బోస్ సౌండ్ సిస్టమ్, జియో సావన్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందించింది కంపెనీ. హ్యుందాయ్ బ్ల్యూలింక్ కనెక్టివిటీ ద్వారా వాహనాన్ని ఎప్పటికప్పుడు కనెక్ట్ చేయవచ్చు.
Also Read: సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు ఏం పరిశీలించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
నోటబుల్ ఫీచర్లుఇన్-కార్ పేమెంట్స్ సిస్టమ్ కూడా క్రెటా ఈవీలో యాడ్ చేశారు. దీని ద్వారా డ్రైవర్ ఛార్జింగ్ అప్లికేషన్లను డౌన్లోడ్ చేయకుండా, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మీదనే చెల్లింపులు చేయవచ్చు. 1,150+ ఛార్జింగ్ పాయింట్లను యాక్సెస్ చేయడానికి ఈ సిస్టమ్ సహాయపడుతుంది. ఇక Vehicle-to-Load (V2L) ఫీచర్ ద్వారా, వాహనాన్ని పవర్ బ్యాంక్ లేదా పోర్టబుల్ పవర్ సోర్స్ గా ఉపయోగించవచ్చు.
కంఫర్ట్ఇది 5 సీటర్ల e-SUVగా వచ్చినప్పటికీ ఇది భద్రత, సౌకర్యంగా అన్ని ప్రయాణీకుల కోసం చాలా సరిపోయేలా తయారైంది. దీని లోపల మంచి లెగ్‌రూమ్, నీజ్‌రూమ్, హెడ్‌రూమ్ ఉన్నాయి, తద్వారా ఆరు అడుగుల ఎత్తు కలిగిన డ్రైవర్ కూడా సౌకర్యంగా ప్రయాణించగలరు. హ్యుందాయ్ క్రెటా ఈవీ స్టైల్, పర్ఫామెన్స్, సౌకర్యాన్ని ఒకటి చేసింది. ఇందులో ఉన్న అద్భుతమైన ఫీచర్లు ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు చేయాలనుకునే వారిలో ఆసక్తిని కలిగిస్తున్నాయి.
Also Read: బుక్ చేస్తే నేరుగా ఇంటికే స్కోడా కార్ డెలివరీ.. 10నిమిషాల్లోనే టెస్ట్ డ్రైవ్ బుకింగ్