FASTag Toll Pass Fee :  ఇండియాలో  హైవేలపై ప్రయాణించే వాళ్ల కోసం కేంద్రం కొత్త రూల్ తీసుకొస్తోంది. ఇప్పటి వరకు FASTagను రీఛార్జ్ చేసుకొని టోల్‌ ట్యాక్‌ పే చేసే వాళ్లు. ఇప్పుడు వాటి స్థానంలో ఈ కొత్త రూల్ ఏప్రిల్ నుంచి అమలులోకి రానుంది. హైవేలపై ఎన్నిసార్లు తిరిగినప్పటికీ FASTagతోనే టోల్‌ ఫీ చెల్లించే వాళ్లు దీని వల్ల తరచూ హైవేలపై ట్రాఫిక్ జామ్ అవుతూ వస్తోంది. ఈ రద్దీని మరింత తగ్గించేందుకు కేంద్రం ఈ సరికొత్త ఆలోచన చేసింది. 


ఫాస్టాగ్‌లోనే ఏడాది పాస్‌ తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. ఇలా చేయడం వల్ల పదే పదే రీఛార్జ్ చేయాల్సిన పని లేదు. ఏడాదికి ఒకసారి రీఛార్జ్ చేసి ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా ప్రయాణం చేయవచ్చు. అంతే కాకుండా డబ్బులు కూడా ఆదా చేయాలని చూస్తోంది. 


ఎక్కువ సమయం హైవేలపై తిరిగే వాళ్లకు ఇది మంచి ఛాన్స్‌గా కేంద్రం చెబుతోంది. ఏడాదికి ఒకసారి మూడు వేల రూపాయలతో రీఛార్జ్ చేసి పాస్ తీసుకుంటే చాలు. ఏడాదంతా మీరు ఎలాంటి టోల్‌ ఫీ లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరిగే ఛాన్స్ కల్పించనున్నారు. 


ఈ రూల్‌తో ఎవరికి ప్రయోజనం ?
ఈ కొత్త ఫాస్టాగ్ నిబంధనను ప్రవేశపెట్టడం వల్ల నిత్యం రోడ్డు ప్రయాణాలు చేసే వాళ్లకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. వ్యక్తిగత వాహనంలో తరచూ ప్రయాణించడానికి ఇష్టపడే వారికి కూడా లబ్ధి కలుగుతుంది. ఎందుకూ అంటే మీరు ఒక సారి టోల్‌ గేట్ దాటి ప్రయాణిస్తే దాదాపు రెండు వందల రూపాయుల చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ దూరం వెళ్లాలనుకుంటే మాత్రం అది వెయ్యి రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అదే ఒకేసారి మూడు వేల రూపాయలతో రీఛార్జ్ చేసుకొని ఏడాది పాస్ తీసుకుంటే మాత్రం మీకు టోల్‌ ఛార్జీల బాదుడు తగ్గుతుంది. ఇలా పాస్ తీసుకున్న వాళ్లు ఏ రోడ్డుపైనా అయినా టోల్‌ ఫీ లేకుండానే రయ్‌ను దూసుకెళ్లి పోవచ్చు.  


Also Read: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు వచ్చేది ఆరోజే.. ఆ లోపు ఈ పని చేసేయండి


సంవత్సరానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే తమ వ్యక్తిగత వాహనంలో ప్రయాణించే వారికి ఈ ఫాస్టాగ్ టోల్ పాస్ వల్ల యూజ్ లేకపపోవచ్చు. ఇలాంటి వారికి మూడు వేలు పెట్టి పాస్ తీసుకుంటే నష్టమే తప్ప లాభం కూడా ఉండదు. ఇలాంటి వాళ్లు ఏడాదికి పాస్ తీసుకోవడం కంటే వెళ్లినప్పుడల్లా రీఛార్జ్‌లు చేసుకోవడం ఉత్తమం. 


ప్రభుత్వానికి భారీ ప్రయోజనం 
ఫాస్టాగ్ కోసం తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం ప్రభుత్వానికి కూడా మేలు జరుగుతుంది. టోల్‌ ఫీ ముందుగానే వసూలు చేసుకున్నట్టు అవుతుంది. టోల్ ప్లాజాల వద్ద క్యూలు తగ్గుతాయి. ట్రాఫిక్ జామ్‌ అయ్యే సమస్య నుంచి గట్టెక్క వచ్చు. వార్షిక టోల్ పాస్‌తోపాటు, జీవితకాలం లేదా 15 సంవత్సరాల టోల్ పాస్‌ను కూడా తీసుకొచ్చే ఛాన్స్ లేకపోలేదని అంటున్నారు. ఇలాంటి లాంగ్‌ టెర్మ్‌ పాస్‌ ఖరీదు రూ. 30,000 కు చేసే అవకాశం ఉందంటున్నారు. ఈ జీవితకాల టోల్ పాస్ తీసుకున్న తర్వాత, టోల్ ప్లాజా వద్ద ఎవరూ ఆపబోరు. నేరుగా టోల్‌ ఫీ లేకుండానే ఆ వాహనానికి గమ్యస్థానానికి చేరుకుంటుంది. 


Also Read: ఈ యాప్ ఉంటే చాలు సైబర్ కాల్స్ రావు- కొట్టేసిన ఫోన్ బ్లాక్ అవుతుంది