Cars Under 7 Lakh Rupees: భారతీయ మార్కెట్లో ఏడు లక్షల రూపాయల రేంజ్‌లో అనేక మంచి కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి తక్కువ ధరలో ఉంటాయి. అలాగే ఆధునిక సౌకర్యాలు, గొప్ప పనితీరు అనుభవాన్ని అందిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా మంచి మైలేజీని ఇస్తాయి. ఈ కార్లు సిటీ రోడ్లపై డ్రైవింగ్ చేయడానికి మాత్రమే కాకుండా దూర ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంటాయి. కస్టమర్లు తమ బడ్జెట్, అవసరాలకు సరిపోయే కార్లను తరచుగా ఈ రేంజ్‌లోనే కొనుగోలు చేస్తూ ఉంటారు.


మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift)
మారుతి సుజుకి స్విఫ్ట్ చాలా ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కారు. ఇది ఆకర్షణీయమైన డిజైన్, గొప్ప పనితీరుకు ప్రసిద్ధి చెందింది. దీని ధర రూ.6.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంది. ఇది సుమారుగా 23 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. స్విఫ్ట్ స్మార్ట్ రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కార్ కనెక్టివిటీ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఈ కారు లోపల చాలా స్థలం కూడా ఉంది. ఇది ఫ్యామిలీలకు అద్భుతమైన ఆప్షన్‌గా ఉంటుంది.


హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai EXTER)
హ్యుందాయ్ ఎక్స్‌టర్ దాని స్టైలిష్ డిజైన్, గొప్ప ఫీచర్లకు మంచి పేరు చెందింది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా లీటరు పెట్రోలుకు 21 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ.5.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. దాని స్మార్ట్ రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, పెద్ద టచ్ స్క్రీన్ డిస్‌ప్లేతో... ఎక్స్‌టర్ ఆధునిక కారు అనుభూతిని ఇస్తుంది. సెక్యూరిటీ పరంగా... ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.


Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?


టాటా పంచ్ (Tata Punch)
టాటా పంచ్ ఒక కాంపాక్ట్ ఎస్‌యూవీ. దాని బలం, ఆకర్షణీయమైన స్టైలింగ్‌కు పేరుగాంచింది. దీని ధర దాదాపు రూ.6.12 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. పంచ్ ఏడు అంగుళాల టచ్ స్క్రీన్, రివర్స్ పార్కింగ్ కెమెరా, అనేక స్మార్ట్ కనెక్టివిటీ ఎంపికలను కలిగి ఉంది. దాని క్యాబిన్‌లో చాలా స్థలం ఉంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది సుమారుగా లీటరుకు 18 నుంచి 19 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.


రెనో ట్రైబర్ (Renault Triber)
రెనో ట్రైబర్ ఒక ఎంపీవీ. ఇది ఎక్కువ స్థలానికి ప్రసిద్ధి చెందింది. దీని ధర రూ.5.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది దాదాపు 19-20 km/l మైలేజీని ఇస్తుంది. ట్రైబర్‌లో 8 అంగుళాల టచ్ స్క్రీన్, స్మార్ట్ రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇది ఏడు సీట్లతో వస్తుంది. ఈ కారు పెద్ద కుటుంబాలకు గొప్ప ఆప్షన్.



Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే