Mahindra Bolero Neo+: మీరు ఒక పెద్ద కుటుంబానికి తక్కువ బడ్జెట్‌లో కొత్త కారును కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే మీకు ఒక మంచి ఆప్షన్ ఉంది. బొలెరో నియో అప్‌డేటెడ్ మోడల్ అయిన 9 సీటర్ ఎస్‌యూవీ గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈ ఎస్‌యూవీ మూడు వరుసల్లో (2-3-4 సీటింగ్ లేఅవుట్) అందుబాటులో ఉంది.
బొలెరో నియో ప్లస్ ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ. 11.39 లక్షలుగా ఉంది. మీరు స్కార్పియో క్లాసిక్ కాకుండా వేరే ఆప్షన్ కావాలనుకుంటే బొలెరో నియో ప్లస్ కారును కొనుగోలు చేయవచ్చు. ఇందులో పీ4 వేరియంట్ ధర రూ. 11.39 లక్షలు కాగా, పీ10 వేరియంట్ ధర రూ. 12.49 లక్షలుగా ఉంది.
మహీంద్రా బొలెరో నియో+ ఇంజిన్ ఇలా...
మహీంద్రా బొలెరో నియో ప్లస్‌లో 2.2 లీటర్ ఇంజన్ అందించారు. ఈ ఇంజన్ 120 పీఎస్ పవర్, 280 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో ట్రాన్స్‌మిషన్ కోసం 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అందించారు. ఇది రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది.
Also Read: మాకు సీఎన్‌జీ కార్లే కావాలంటున్న ప్రజలు - భారీగా పెరుగుతున్న డిమాండ్!
మహీంద్రా బొలెరో నియో ప్లస్ క్యాబిన్ గురించి చెప్పాలంటే ఇది ట్విన్ పాడ్ డిస్‌ప్లేతో కొత్త స్టీరింగ్ వీల్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది. ఇది 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌తో పాటు క్లైమేట్ కంట్రోల్ డయల్‌లను కూడా పొందుతుంది.
బొలెరో నియో ప్లస్ డిజైన్ చూడటానికి బొలెరో నియో తరహాలోనే ఉంటుంది. అయితే దీని ఫ్రంట్ బంపర్‌కి ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, బుల్ బార్ వంటి ఫీచర్లు జోడించారు. ఈ కారులో కొత్త 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ అమర్చారు. బొలెరో నియో ప్లస్... బొలెరో నియో కంటే 405 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. బొలెరో నియో ప్లస్ పొడవు 4,400 మిల్లీమీటర్లుగా ఉంది. అయితే దీని వీల్ బేస్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
మహీంద్రా బొలెరో నియో ప్లస్ 2-3-4 సీటింగ్ కాన్ఫిగరేషన్‌తో మూడు వరుసల సెటప్‌ను కలిగి ఉంది. ఈ కారు చివరి వరుసలో సైడ్ ఫేసింగ్ సీట్లు ఉన్నాయి. ఈ మహీంద్రా కారులో బ్లూటూత్, యూఎస్‌బీ, ఆక్స్ కనెక్టివిటీ కూడా అందించారు.
మరో వైపు మహీంద్రా థార్ మనదేశంలో లాంచ్ అయినప్పటి నుంచి సేల్స్‌లో ఒక్కసారిగా దూసుకుపోతుంది. దేశీయ మార్కెట్లో ఇప్పటికే రెండు లక్షల యూనిట్ల సేల్స్ మార్కును దాటిందంటే మహీంద్రా థార్ ఎంత ప్రజాదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు లక్షల సేల్స్‌లో తాజాగా లాంచ్ అయిన థార్ రాక్స్ సేల్స్ కూడా ఉండటం విశేషం. సియామ్ ఇండస్ట్రీ హోల్‌సేల్ డేటా ప్రకారం 2024 అక్టోబర్ నెల చివరి నాటికి మహీంద్రా థార్, థార్ రాక్స్ మొత్తం అమ్మకాలు కలిపి ఏకంగా 2,07,110 యూనిట్లుగా ఉంది. 2020 సంవత్సరం అక్టోబర్ నెలలో మహీంద్రా థార్ మొట్టమొదటి సారిగా భారతీయ మార్కెట్లో లాంచ్ అయింది. ఈ కారు లాంచ్ అయిన నాలుగు సంవత్సరాల్లోనే మొత్తంగా రెండు లక్షల సేల్స్ మార్కును దాటడం విశేషం.
Also Read: టాటా అల్ట్రోజ్ రేసర్‌పై భారీ డిస్కౌంట్ - ఎంత తగ్గుతుందో తెలుసా?