Best Bikes Under Rs 1 lakh: మనదేశంలో ఎన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్‌లు, ఎన్ని కేటీయంలు, ఎన్ని స్పోర్ట్స్ మోడల్స్ లాంచ్ అయినా, రూ.లక్షలోపు బైక్స్‌కు డిమాండ్ ఉంటూనే ఉంటుంది. హీరో, హోండా, టీవీఎస్, బజాజ్ వంటి బ్రాండ్లు ఇప్పటికీ బడ్జెట్ విభాగంలో మంచి బైక్స్‌ను లాంచ్ చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ బైక్స్ మంచి మైలేజీని అందిస్తాయి.


హీరో గ్లామర్ (Hero Glamour)
ప్రస్తుతం హీరో విక్రయిస్తున్న సూపర్ హిట్ బైకుల్లో ఇది కూడా ఒకటి. ఎప్పటినుంచో హీరో గ్లామర్ మార్కెట్లో తన ఉనికిని కాపాడుకుంటూ వచ్చింది. సొంత బ్రాండ్‌లోనే స్ప్లెండర్ నుంచి గట్టి పోటీని తట్టుకుని మరీ గ్లామర్ నిలబడింది. ఇందులో 124.5 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఇది 10.73 బీహెచ్‌పీ పవర్‌ను డెలివర్ చేయనుంది. 10.6 ఎన్ఎం పీక్ టార్క్‌ను కూడా ఇది డెలివర్ చేయనుంది. 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌ను ఈ ఇంజిన్ డెలివర్ చేయనుంది. సెల్ఫ్ స్టార్ట్ డ్రమ్ వేరియంట్ ధర రూ.78,768గా (ఎక్స్-షోరూం) ఉంది. ఇక సెల్ఫ్ స్టార్ట్ డిస్క్ వేరియంట్ ధర రూ.82,768గా (ఎక్స్-షోరూం) నిర్ణయించారు.


హోండా షైన్ (Honda Shine)
ఎన్నో సంవత్సరాలుగా హోండా షైన్ మనదేశంలో టూ వీలర్స్ విషయంలో ముందంజలో ఉంటూ వచ్చింది. ఇందులో 123.94 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అందించారు. ఇది 10.59 బీహెచ్‌పీ మ్యాగ్జిమం పవర్, 11 ఎన్ఎం టార్క్‌ను అందించారు. హోండా షైన్ డ్రమ్ వేరియంట్ ధర రూ.78,687 కాగా (ఎక్స్-షోరూం), డిస్క్ వేరియంట్ ధర రూ.82,697గా (ఎక్స్-షోరూం) నిర్ణయించారు.


బజాజ్ ప్లాటినా 110 ఏబీఎస్ (Bajaj Platina 110 ABS)
బజాజ్ బైకుల్లో ఎక్కువగా అమ్ముడుపోయే మోడల్స్‌లో ఇది కూడా ఒకటి. 115.4 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను ఈ బైక్‌లో అందించారు. ఇది 8.71 బీహెచ్‌పీ పవర్‌ను, 9.81 ఎన్ఎం టార్క్‌ను డెలివర్ చేయనుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 10.5 లీటర్లుగా ఉంది. దీని ధర రూ.72,224 (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభం కానుంది.


టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)
టీవీఎస్ స్పోర్ట్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. సెల్ఫ్ స్టార్ట్, కిక్ స్టార్ట్. దీని ధర రూ.64,050 (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభం కానుంది. 109.7 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అందించారు. 8.1 బీహెచ్‌పీ పవర్, 8.7 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఇది డెలివర్ చేయనుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 10 లీటర్లుగా ఉంది.


టీవీఎస్ రెయిడర్ 125 (TVS Raider 125)
టీవీఎస్ లాంచ్ చేసిన మరో అద్భుతమైన బడ్జెట్ బైక్ ఇదే. ఇందులో ఎన్నో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. సింగిల్, స్ల్పిట్ సీట్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ, ఫుల్ డిజిటల్ స్క్రీన్, రైడింగ్ మోడ్స్ కూడా అందించారు. 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.9 సెకన్లలోనే అందుకోనుంది. ఇందులో 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అందించారు. ఇది 11.22 బీహెచ్‌పీ పవర్, 11.2 ఎన్ఎం పీక్ టార్క్‌ను డెలివర్ చేయనుంది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!


Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!