Bajaj Chetak 2026 Updates:భారతీయ రోడ్లపై ఒకప్పుడు రారాజుగా వెలిగిన చేతక్‌ ఇప్పుడు ఎలక్ట్రిక్‌ రూపంలో సరికొత్త సంచలనాలు క్రియేట్ చేస్తోంది. బజాజ్‌ ఆటో తన పాపులర్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ పోర్ట్‌పోలియోను తాజాగా అప్‌డేట్ చేసింది. ఈసారి కేవలం ఒక మోడల్ మాత్రమే కాదు ఏకంగా నాలుగు విభిన్న వేరియంట్లను(C3501 C3502 C3503 C3001) వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 

Continues below advertisement

కొత్తగా మారెక్ట్‌లోకి వచ్చిన బజాజ్

టెక్నాలజీ మారుతున్న కొద్దీ వినియోగదారుల అవసరాలు కూడా మారుతుంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బజాజ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్లలో గణనీయమైన మార్పులు చేసింది. అటు రేంజ్ పరంగా, ఇటు ఫీచర్ల పరంగా ఈ కొత్త మోడళ్లు ఎలా ఉన్నాయో లోతుగా ఒకసారి చూడండి. 

Continues below advertisement

సీ 35, సీ30తో లైనప్ అప్‌డేట్

బజాజ్‌ చేతక్ తన ప్రస్తుత లైనప్‌ను సీ 35, సీ30 అనే రెండు ప్రధాన సిరీస్‌లుగా డివైడ్ చేసింది. సి35లో మూడు మోడల్స్‌ ఉన్నాయి. ఇవి సీ 3501, సీ 3502, సీ 3503. ఇవి ప్రధానంగా ఎక్కువ రేంజ్, హై ఎండ్ ఫీచర్లు కోరుకునే వారి కోసం తీర్చిదిద్దారు. 

సీ 30 సిరీస్‌లో సి 3001 మోడల్ ఉంది. ఇది బడ్జెట్‌, పనితీరు మధ్య సమతుల్యతను కోరుకునే వారికి సరైన ఎంపిక. ఈ అప్‌డేట్‌లో ప్రధానంగా బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ సమయం, డిజిటల్ డిస్‌ప్లేలలో మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సీ 3501 మోడల్‌ 8-ఇంచ్‌ టచ్‌స్క్రీన్‌ టీఎఫ్‌టీ డిస్‌ప్లేతో రావడం ఈ అప్‌డేట్‌లో హైలైట్‌. 

ఎక్కువ మంది చదివిన ఈ టాప్ వార్తలు మిస్ అవ్వొద్దు

1Ola, Uberలను టెన్షన్ పెడుతున్న VinFast.!
2టాటా టియాగో ఈవీ కొనేందుకు డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి ?
3పెట్రోల్‌ కాదు, కొత్త ఇంధనంతో దూసుకుపోనున్న Maruti Fronx!
4Electric Scooter కొనేముందు ఇది తెలుసుకోండి..
5ట్రయంఫ్ బైకుల ధరలు భారీగా పెంపు

ఈ కొత్త లైనప్‌ స్కూటర్లను బజాజ్‌ ఏప్రిల్‌ నెలలోనే అధికారికంగా ప్రకటించినప్పటికీ ఇప్పుడు వాటి పూర్తి ధరలు, స్పెసిఫికేషన్‌లను తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం ఇవి ప్రధాన నగరాల్లో బజాజ్‌ షోరూమ్స్‌లలో అందుబాటులో ఉన్నాయ. 

మార్కెట్‌లో పెరుగుతున్న పోటీని ఎదుర్కోవడానికి, వినియోగదారులకు మెరుగైన క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌ అనుభూతిని అందించడానికి బజాజ్‌ ఈ మార్పులను చేసింది. గతంలో ఉన్న మోడళ్లతో పోలిస్తే, ప్రస్తుతం మోడళ్లలో రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ మెరుగుపరచడానికి టెక్ ప్యాక్‌ వంటి అదనపు ఫీచర్లను కూడా జోడించారు. 

కొత్త అప్‌డేట్‌ల కారణంగా ధరలలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. 

మోడల్‌

కొత్త ధర

పాత ధర

వ్యత్యాసం

సీ 35011,44,3051,39,3056500 పెరిగింది.
సీ 3502  134,105  1 27 605  6500 పెరిగింది.
సీ 3503120605118 6052000 పెరిగింది
సీ3001  110006   107 6062400 పెరిగింది. 

 ధరలు కొంత మేర పెరిగినప్పటికీ అందించే ఫీచర్లు, పెరిగిన రేంజ్‌తో పోలిస్తే ఇది సమంజసమేనని నిపుణులు అభిప్రాయం. 

మోడల్స్ మధ్య తేడాలు ఏంటీ 

నాలుగు మోడళ్ల మధ్య ఉన్న ప్రధాన తేడాను తెలుసుకోవడం చాలా ముఖ్యం. రేంజ్ విషయానికి వస్తే సీ 3501, సీ 3502 గరిష్టంగా 153 కిలోమీటర్ల రేంజ్ అందిస్తాయి. సీ 3503 మోడల్‌ 151 కిలోమీటర్లు, ఇక ఎంట్రీ లెవల్‌ సీ 3001 మోడల్ 127 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయి. 

సీ 35 సిరీస్ మోడళ్లలో 3.5kWh బ్యాటరీ ఉండగా, సీ 3001లో 3.0kWh బ్యాటరీ ఉంటుంది. ఛార్జింగ్‌ విషయానికి వస్తే సీ 3501 మోడల్ ఆన్‌బోర్డ్‌ ఛార్జర్‌తో వస్తుంది. ఇది 0 నుంచి 80 శాతం ఛార్జ్ అవ్వడానికి 3 గంటల సమయం తీసుకుంటుంది. మిగిలిన మోడల్స్ ఆఫ్‌ బోర్డ్‌ ఛార్జర్‌తో వస్తాయి. 

సీ3501 మోడల్ 5 ఇంచ్‌ టచ్‌స్క్రీన్‌ టీఎఫ్‌టీ కలిగి ఉంది. సీ 3502 మోడల్‌లో 5 ఇంచ్‌ల టీఎఫ్‌టీ స్క్రీన్ ఉంది కానీ టచ్‌ సౌకర్యం లేదు. సీ 3503, సీ 3001లో కలర్‌ ఎస్డీసీ డిస్‌ప్లే మాత్రమే ఉంది. 

ఈ స్కూటర్లన్నీ బజాజ్ సిగ్నేచర్‌ స్టీల్ బాడీతో వస్తున్నాయి. ఇది ప్లాస్టిక్‌ బాడీ స్కూటర్ల కంటే గట్టిగా ఉంటాయి. వానలో తడిసినా నీటిలో వెళ్లినా బ్యాటరీకి ఎలాంటి ప్రమాదం ఉండదు. పార్కింగ్ సమయంలో స్కూటర్లను వెనక్కి తీసుకోవడం కోసం రివర్స్ మోడ్‌ కూడా కలిగి ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో లేదా ఎత్తులో స్కూటర్‌ వెనక్కి వెళ్లిపోకుండా హిల్‌ హోల్డ్స్‌ ఉన్నాయి. 35 లీటర్ స్టోరేజ్‌ సామర్థ్యంతో పెద్ద హెల్మెట్‌ను కూడా సులభంగా పెట్టుకోవచ్చు.