Bajaj Auto Sales Report 2024: బజాజ్ బైక్‌లు, స్కూటర్‌లు భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా గొప్ప మార్కెట్‌ను కలిగి ఉన్నాయి. కంపెనీ లాంచ్ చేసిన వాహనాలు వాటి బలమైన పెర్ఫార్మెన్స్, చవకైన ధరకు మంచి పేరు పొందాయి. దీంతో పాటు ఇప్పుడు బజాజ్ ఆటో 2024 నవంబర్ అమ్మకాల రిపోర్ట్‌ను విడుదల చేసింది. 2024 నవంబర్‌కి బజాజ్ విక్రయాల రిపోర్ట్‌లో ఏం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

గత నెలలో ఎన్ని వాహనాలు అమ్ముడయ్యాయి?బజాజ్ ఆటో లిమిటెడ్ విడుదల చేసిన డేటా ప్రకారం కంపెనీ గత నెలలో అంటే 2024 నవంబర్‌లో 4,21,640 వాహనాలను విక్రయించింది. గతేడాది కంటే ఈ సంఖ్య ఐదు శాతం ఎక్కువ. 2023 నవంబర్‌లో ఈ సంఖ్య 4,03,003గా ఉంది. ఈ గణాంకాలలో దేశీయ మార్కెట్‌లో అమ్ముడుపోయిన వాహనాలతో పాటు ఎగుమతి చేసిన వాహనాల అమ్మకాలు కూడా ఉన్నాయి. 

Also Read: రూ.10 లక్షల్లో బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే - ఆల్టో కే10 నుంచి పంచ్ వరకు!

మొత్తం ఎగుమతులు గత ఏడాది 1,45,259 యూనిట్ల నుంచి 2024 నవంబర్‌లో 24 శాతం పెరిగి 1,80,786 యూనిట్లకు చేరుకున్నాయి. కంపెనీ గత నెలలో దేశీయ మార్కెట్లో మొత్తం 3,68,076 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఇది గత ఏడాది నమోదు చేసిన 3,49,048 యూనిట్ల కంటే ఐదు శాతం ఎక్కువ.

26 శాతం వృద్ధిద్విచక్ర వాహనాల ఎగుమతిలో 26 శాతం పెరుగుదల ఉంది. 2024 నవంబర్‌లో కంపెనీ 1,64,465 వాహనాలను ఎగుమతి చేసింది. గతేడాది ఇదే నెలలో ఈ సంఖ్య 1,30,451గా ఉంది. కంపెనీ విడుదల చేసిన అమ్మకాల నివేదిక 2024 నవంబర్‌లో మొత్తం కమర్షియల్ వాహనాల అమ్మకాలు ఒక్క శాతం క్షీణించి 53,564 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే నెలలో ఈ సంఖ్య 53,955 యూనిట్లుగా ఉంది. బజాజ్ పల్సర్ సిరీస్, సీఎన్‌జీ మోటార్‌సైకిల్ ఫ్రీడమ్ 125, కమ్యూటర్ బైక్ స్కూటర్ల అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి.

Also Read: సింగిల్ ట్యాంక్ ఫుల్‌తో 1000 కిలోమీటర్లు నడిచే టాప్ 5 కార్లు - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?